
BRS Party
@BRSparty • 945,174 subscribers
Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.
Shorts
Videos

కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే అనుకునే వారి అవగాహన కోసమే ఈ వీడియో.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే... 🔹 3 బ్యారేజీలు 🔹 15 రిజర్వాయర్లు 🔹 19 సబ్స్టేషన్లు 🔹 21 పంప్హౌజులు 🔹 203 కిలోమీటర్ల సొరంగాలు 🔹 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ 🔹 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ 🔹 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం 🔹 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్టింగ్ 🔹 240 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం #KaleshwaramProject
BRS Party27,951 views • 1 day ago

మేడిగడ్డ బ్యారేజ్లో బాంబులు పెట్టి పేల్చడం వల్లే రెండు పిల్లర్లు కుంగిపోయినయ్..! ఆనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్పై ప్రజావ్యతిరేకత సృష్టించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్ర ఇది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఇసుక మాఫియా జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసిన చెక్డ్యామ్లే దీనికి సాక్ష్యం!
BRS Party34,475 views • 5 days ago

ఇది చేతగాని కాంగ్రెస్ పాలన తెచ్చిన దుస్థితి! కరెంట్ కోతలు, సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు.. కళ్లముందే ఆరుగాలం పడిన కష్టం నాశనమవుతుంటే తట్టుకోలేక, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లో రైతు నల్లాల శ్యామ్సుందర్రెడ్డి ఏకంగా వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పోసి వరి పంటను కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. రైతు సంక్షేమం అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ సర్కార్.. అన్నదాతలను నట్టేట ముంచింది. కరెంట్ ఇవ్వరు, నీళ్లు ఇవ్వలేరు.. ఇది కదా కాంగ్రెస్ తెచ్చిన "మార్పు"? అన్నదాతల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం.
BRS Party47,494 views • 11 days ago

Rs. 50,000 Cr Telangana Heist 💰 Telangana Rising ❌ Anumula Family Rising ✅
BRS Party124,745 views • 1 month ago

🚨🏥 వరంగల్ ఎంజీఎం దుస్థితిపై ప్రశ్నిస్తే.. దాస్యం వినయ్ భాస్కర్ పై పోలీసుల పాశవిక దాడి! సరిపడా బెడ్లు లేవు.. పెచ్చులూడుతున్న పైకప్పులు.. ఆంబులెన్స్ల కొరతపై ప్రశ్నిస్తూ ఎంజీఎంను సందర్శించేందుకు వెళ్లిన మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను అడ్డుకున్న పోలీసులు. కడుపులో తన్ని.. చేయి విరగ్గొట్టి.. కాలు, చేతులకు తీవ్ర గాయాలు చేసిన పోలీసులు! నొప్పితో కన్నీళ్లు పెట్టుకొని రోదిస్తున్న వినయ్ భాస్కర్.. ఎంజీఎం వద్ద రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు. ప్రజా పాలన ముసుగులో తెలంగాణను గూండాల రాజ్యంగా మార్చిన రేవంత్! Dasyam Vinaya Bhaskar
BRS Party125,031 views • 1 month ago

తేడా సుస్పష్టం! నాడు ఎంత ఖర్చయినా పర్వాలేదు, తెలంగాణ ప్రజలు బాగుండాలని ఆలోచించిన దమ్మున్న నాయకుడు కేసీఆర్.. నేడు కరెంట్ వాడకం తగ్గించండి, ఫ్యాన్లు బంద్ చేసుకోండంటూ చేతకాని ముచ్చట్లు చెప్పే రేవంత్! దమ్మున్న అసలైన నాయకుడు కేసీఆర్ పాలనకు.. చేతకాని దద్దమ్మ రేవంత్ అసమర్థ పాలనకు ఉన్న తేడా ఇదే!
BRS Party26,487 views • 9 days ago

కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ పెట్టడం ఏంటి? ఎవరి కోసం, దేని కోసం ఈ గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు? పవర్ హాలిడేలు ఇచ్చే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? ఈ మూడేళ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన MOUలు, సమ్మిట్ల గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అసలు పెట్టుబడులు వచ్చాయా? లేకపోతే వాటి ముసుగులో అనుముల అన్నదమ్ములు భూదందా నడిపారా? - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
BRS Party13,129 views • 4 days ago

✳️ తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అండ ✳️ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్.. కుటుంబానికి రూ. లక్ష తక్షణ ఆర్థిక సహాయం తెలంగాణ ఉద్యమంలో మానుకోట సంఘటన నుంచి మొదలుకొని చురుకైన పాత్ర పోషించిన ఉద్యమకారుడు, దళిత కుటుంబానికి చెందిన ఈదురు జనార్ధన్ అనారోగ్యంతో మరణించారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పనిచేస్తున్న జనార్ధన్ కుటుంబం, ఆయన మరణంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆయనకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. జనార్ధన్ కుటుంబం దీనస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో.. జనార్ధన్ ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసాగా ఒక్కొక్కరి పేరిట రూ.3 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడంతో పాటు, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా రూ. లక్ష అందించారు. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి Satyavathi Rathod, మాజీ ఎంపీ Kavitha maloth, మాజీ ఎమ్మెల్యే REDYA NAIK DHARAMSOTHU, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇతర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దివంగత ఈదురు జనార్ధన్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, కేటీఆర్ అందించిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జనార్ధన్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే బాధ్యతతో కేటీఆర్ చొరవకు ధన్యవాదాలు తెలిపారు.
BRS Party48,248 views • 23 days ago

నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలుపుతున్న విద్యార్థులను అమెరికా లాంటి దేశాలలో కాల్చి పారేస్తారంటూ దిగజారుడు కూతలు కూసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి. విద్యార్థుల పట్ల కనీస మానవీయ కోణం లేకుండా.. దాదాపు 20 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా కనీస మానవత్వం లేకుండా.. అధికార మదంతో బీజేపీ నాయకులు ఇలాంటి సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నారు.
BRS Party175,794 views • 3 months ago

అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు.. నిజాలు మాట్లాడాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు చేయొద్దు. కమలాపూర్ మండలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్న సమయంలో రాజకీయ విమర్శలు, వాస్తవాలకు విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే Padi Kaushik Reddy🔥 ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు స్పందిస్తూ.. “అబద్ధాలు చెప్పొద్దు.. నిజాలు మాట్లాడాలి. ఇది రాజకీయాలు చేయాల్సిన వేదిక కాదు. ప్రజలకు వాస్తవాలు చెప్పండి” అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
BRS Party147,006 views • 2 months ago

అసెంబ్లీ వద్ద పోలీసుల దురుసు ప్రవర్తనలో గాయపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రి Jagadish Reddy G, ఎమ్మెల్యేలు Dr Sanjay Kalvakuntla, ఎమ్మెల్సీలు Shambipur Raju MLC, యాదవ రెడ్డి లకు తెలంగాణ భవన్ లో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడులా? సిగ్గు.. సిగ్గు
BRS Party90,191 views • 1 month ago

పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఓజీ కేసీఆర్. ఆయన చాలు మాకు.. ఆయన తెలంగాణను కాపాడుకుంటారు. KTR
BRS Party214,645 views • 5 months ago

పుట్టినరోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్ గారు. తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన KTR బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తమ తనయుడైన కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ దంపతులు దీవించారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్తో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి కేటీఆర్ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మాజీ ఎంపీ Santosh Kumar J కోరిక మేరకు మొక్కను నాటి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె రియాన్షి ఇతర కుటుంబసభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.
BRS Party144,928 views • 3 months ago

ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్. ఏపీలో క్రాప్ హాలిడే లేదు.. మరి తెలంగాణలో ఎందుకు ఉంది? మీరు నీళ్లు వదిలితేనే కదా ఏపీకి వెళ్తాయి. గోదావరి నది మీద ఉన్న దేవాదుల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు? దేవాదుల నుంచి ఎన్ని మోటార్లు నడిపారు? ఎన్ని గంటలు నడిపారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru
BRS Party13,199 views • 7 days ago

మేడిగడ్డ బ్యారేజిని కుట్రపూరితంగా ధ్వంసం చేసి నేటికి సరిగ్గా మూడేళ్లు. ఆరోజు పెద్ద పేలుడు శబ్దం వచ్చిందని, తర్వాతనే పిల్లర్ కుంగినట్టు గమనించామని ఏకంగా ప్రాజెక్టు ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు కాంగ్రెస్ మంత్రుల సమక్షంలోనే ఇటీవల వెల్లడించడం సంచలనం సృష్టించింది. ఆరోజు ఇరిగేషన్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్లో ఈ పేలుడు శబ్దం గురించి చెబుతూ ఒక ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు మీద దర్యాప్తు ఎంతవరకు వచ్చింది రేవంత్ రెడ్డి గారూ? కేసీఆర్ గారు మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు కట్టారు. మీరేమో మూడేళ్లు పూర్తయినా కనీసం రెండు పిల్లర్లు కూడా బాగుచేయలేకపోతున్నారు. అందుకే అంటున్నాం.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని!
BRS Party19,984 views • 12 days ago