
JanaSena Party
@JanaSenaParty • 2,649,774 subscribers
Official Twitter Handle - JanaSena Party
Shorts
Videos

ప్రజలను భయపెట్టి వైసీపీ ఏం సాధిస్తుంది? పులివెందులలో వైసీపీ ప్రేరేపిత హింసను ప్రతి ఒక్కరూ ఖండించాలి తెనాలిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ Manohar Nadendla గారు ‘పులివెందులలో ఈ రోజు జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. సమాజంలో అల్లర్లు, అలజడులు సృష్టించి ప్రజల్ని భయాందోళనలకు గురి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని మూర్ఖంగా వైసీపీ ఆలోచిస్తుంది’ అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖామాత్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజలను భయపెట్టినట్లుగా.. ఇప్పుడు కూడా అదే పంథాను కొనసాగిస్తుందని చెప్పారు. తెనాలిలో శనివారం సాయంత్రం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. "రాష్ట్రంలో పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఎన్నికల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ N Chandrababu Naidu గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు ఆకాంక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా ఏకగ్రీవాల కోసం అరాచకాలు సృష్టించిన విధంగా కాకుండా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇందుకు విరుద్ధంగా వైసీపీ మాత్రం రాష్ట్రంలో అలజడులు, అశాంతి సృష్టించి ప్రజలను భయపెట్టాలని భావిస్తోంది. గత ప్రభుత్వంలో కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా వైసీపీ చేసిన పిచ్చి ఆలోచనలతో ప్రజలంతా ఎంత ఇబ్బందిపడ్డారో రాష్ట్రమంతా చూసింది. ఇప్పుడు కూడా అదే పంథాలో వైసీపీ ఉండడం దురదృష్టకరం. పులివెందులలో శనివారం వైసీపీ ప్రేరేపిత హింసాత్మక సంఘటనలు అత్యంత దురదృష్టకరం. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి" అన్నారు.
JanaSena Party137,644 views • 5 days ago

అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకమే వైసిపి ఇప్పుడు మళ్లీ చేస్తోంది - మళ్ళీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టడానికి చూస్తున్నట్లు అర్థమవుతుంది - ఓటమి ముందే పసిగట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే కుట్రకు పాల్పడుతోంది - రాజమండ్రిలో మీడియాలో సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ Kandula Durgesh పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ రాజమండ్రి ప్రెస్మీట్ నిర్వహించారు. ముఖ్యాంశాలు * స్థానిక ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి వేదికగా మరోసారి అరాచకాలు సృష్టించారు. * రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. * ఎన్నికల నియమావళిని ఏమాత్రం పాటించకుండా, 100 మీటర్ల అవతలే వాహనాలు నిలిపివేయాలని నిబంధనలు చెబుతున్న ఎంపీ పట్టించుకోలేదు. సుమారు 100 మందితో నామినేషన్ కు రావడం సరైన చర్య కాదు. * అడ్డుకున్న వాళ్లని వాహనాలతో తొక్కించి ముందుకు వెళ్లిన వైసీపీ నాయకుల దాష్టికం దారుణం. రాయలసీమను రణరంగం చేయడానికి, వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మళ్ళీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టడానికి చూస్తున్నట్లు అర్థమవుతుంది. * అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకమే వైసిపి ఇప్పుడు మళ్లీ చేస్తోంది. ఓటమి ముందే పసిగట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా ఎన్నికలను నిలిపివేయాలనే కుట్ర వైసిపి చేస్తోంది. * స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు మొదటి రోజే కావాలని వైసిపి ఓ కుట్ర ప్రకారం అరాచకం సృష్టించింది. * ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఎంపీని పదవికి అనర్హుడిని చేయాలి. ఓట్లు ఎన్నికల సంఘం ఈ విషయాన్ని సుమోటోగా తీసుకొని ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. * ఒక ఎంపీ ఏకంగా కత్తులు కటార్లు పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సాధారణ విషయం కాదు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. * ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసిపి ఈ ఘర్షణలకు తెర తీసింది. తిరిగి బుకాయిస్తూ తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తోంది. * బయట ప్రాంతాల నుంచి మనుషుల్ని తీసుకువచ్చి ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న రాయలసీమను కావాలని రక్తసిక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా వైసీపీ ఆడుతున్న గేమ్. ఇలాంటి ఆటలు ఆడితే ప్రజలు తగిన విధంగా వైసీపీకి బుద్ధి చెబుతారు.
JanaSena Party150,377 views • 6 days ago

ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #VoteForGlass #APLocalBodyElections
JanaSena Party48,564 views • 2 days ago

జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..! దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. Vangaveeti Radha Krishna
JanaSena Party175,176 views • 8 days ago

వైసీపీ పై శ్రీ కిరణ్ రాయల్ ఆగ్రహం ఓటమి భయంతో పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్లు ధ్వంసం రూ.4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును అర్ధరాత్రి ధ్వంసం చేశారు ప్రజల రాకపోకల కోసం నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం కూటమి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే విధ్వంసానికి పాల్పడ్డారు ప్రజలు వినియోగించే రహదారిని ధ్వంసం చేయడం హత్యకన్నా దారుణం ఏకగ్రీవాలపై గతంలో జగన్ చేసిన ప్రకటనకు ఇప్పుడేం సమాధానం చెబుతారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలపై జగన్ చర్యలు తీసుకుంటారా…?
JanaSena Party62,167 views • 3 days ago

గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేద్దాం - పల్లె ప్రగతిని కొనసాగిద్దాం! గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసి అఖండ విజయాన్ని అందిద్దాం. #VoteForGlass #APLocalBodyElections
JanaSena Party67,908 views • 4 days ago

"Jai Kottu " - JanaSena Party Youth Wing Theme Song. #HBDJanaSenaniPawanKalyan
JanaSena Party912,171 views • 1 month ago

గాజు గ్లాసు గుర్తుకు మన ఓటు! #VoteForGlass #APLocalBodyElections
JanaSena Party79,163 views • 5 days ago

స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సత్తా చూపించండి! #APLocalBodyElections
JanaSena Party92,692 views • 10 days ago

జనసేన పార్టీలోకి పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త, బైరా ఫౌండేషన్ అధినేత శ్రీ బైరా దిలీప్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలోకి పార్టీలో చేరిన వారిలో వైసీపీ నేత, శ్రీకాకుళం మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ డోలా జగన్, తిరుపతికి చెందిన శ్రీ పెనుమాదు ప్రణీత్, ఆచంటకు చెందిన జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు శ్రీ తుంగ నాగేశ్వరరావు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు శ్రీ ఏడీఎస్ ప్రసాద్, శ్రీ మారుతి, శ్రీ దోవరీ అమర్నాథ్ లు ఉన్నారు.
JanaSena Party73,412 views • 8 days ago

జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి అకేటపాటి సుభాషిణి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి రోజా గత ప్రభుత్వంలో అక్రమంగా ఆస్తులు ఎలా కూడబెట్టుకుంది ? అప్పుడప్పుడు నేనున్నాను అని చెప్పుకోవడానికి రోజు మీడియా ముందుకు వస్తుంది రోజాకు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి జగన్ శవాలపై పడుతాడు, నువ్వు సమాధులపై పడతావు ఆడుదాం ఆంధ్రా స్కాం త్వరలో బయటపడుతుంది, రోజా సిద్ధంగా ఉండు మా ప్రభుత్వం రోడ్లు, లైట్లు వేసినందుకే క్రెడిట్ తీసుకుంటున్నాం మీరు ఏమి చేశారో చెప్తే మీకు క్రెడిట్ ఇస్తాము, ఏమి చేశారో చెప్పు జల్ జీవన్ మిషన్ ద్వారా పులివెందులలో నీరు ఇచ్చాము రోజా నగరి, పుత్తూరులో సమాధులను కబ్జా చేసి లే అవుట్ లు వేసింది రోజా ఆస్తులపై విచారణ చేయాలని కలెక్టర్ ను కలిసి పిర్యాదు చేస్తాము. నోరుంది కదా అని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మా వీర మహిళల నోర్లు కూడా లేస్తాయి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దెబ్బకు బయపడి ఎర్ర స్మగ్లర్లు తోపుడు బండ్లలో సోమొసాల వ్యాపారాలు చేసుకుంటున్నారు.
JanaSena Party89,338 views • 14 days ago

నగర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు
JanaSena Party161,220 views • 1 month ago