
BigTV APP
@BigtvApp • 19,469 subscribers
BIG TV Telugu | Bold New Avatar Voice of the People | Without Fear or Favour Asia's largest immersive news intelligence centre
Shorts
Videos

స్వదేశానికి తెలుగు కుటుంబం.. అమెరికా వృద్ధురాలి కన్నీళ్లు అమెరికాలో నివసిస్తున్న ఓ తెలుగు కుటుంబం స్వదేశానికి తిరిగి వస్తుండగా పొరుగింట్లో ఉండే ఆ దేశ వృద్ధురాలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నాళ్లూ కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉన్న ఆ కుటుంబం వెళ్లిపోతుండటంతో తట్టుకోలేక వారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్వచ్ఛమైన ప్రేమకు, అనుబంధానికి సరిహద్దులు ఉండవని మరోసారి ఈ ఘటన నిరూపించింది.
BigTV APP721,009 просмотров • 2 месяцев назад

ఈ అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్ విమాన సేవలు రద్దు కానున్నాయి. రాత్రి 10.45 గంటలకు ఢిల్లీకి చివరి ఫ్లైట్ బయలుదేరనుంది. దీంతో సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు. ఇకపై ఈ విమానాశ్రయం కేవలం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, విఐపి విమానాలు, నాన్ షెడ్యూల్డ్ సర్వీసులకే పరిమితం కానుంది.
BigTV APP229,810 просмотров • 2 месяцев назад

మీర్పేట్లో యాక్సిడెంట్.. తల నుజ్జునుజ్జు హైదరాబాద్ మీర్పేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల ప్రసన్నలక్ష్మి మృతి చెందారు. స్కూటీపై వెళ్తుండగా ఆటోను తప్పించబోయి కిందపడగా.. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ ఆమెపైకి దూసుకెళ్లడంతో తల నుజ్జునుజ్జు అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
BigTV APP84,583 просмотров • 1 месяц назад

Jr Ntr మమ్మల్ని ఎందుకు అంత దూరం పెడుతున్నారో ఏంటో నాకు అర్థం కావడం లేదు. మేము టెర్రరిస్టులం కాదు, మాకేమీ అనారోగ్య సమస్యలు లేవు సమస్యలు ఉన్నప్పుడు నేరుగా పిలిచి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని, ఫోన్ల ద్వారా లేదా మూడో వ్యక్తి ద్వారా సందేశాలు పంపడం సరైన పద్ధతి కాదు: సాయి రూప్( RAW NTR) ఆర్గనైజర్
BigTV APP194,803 просмотров • 3 месяцев назад

రేబిస్ టీకా తీసుకున్న రేణు దేశాయ్ నటి, నిర్మాత రేణు దేశాయ్ జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె రేబిస్ టీకా తీసుకుంది. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపింది.
BigTV APP470,863 просмотров • 1 год назад

ACCIDENT: ఒళ్లు గగుర్పొడిచే వీడియో జనాలు రద్దీగా ఉండే చోట వాహనాలను అతివేగంగా నడపడం ఎంతటి ప్రమాదమో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా చండిటాల ప్రమాదం కళ్లకు కడుతోంది. రద్దీ సమయంలో స్పీడ్ బ్రేకర్‌ని గమనించకుండా వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైకర్‌ను ఢీకొట్టి 300 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు.
BigTV APP123,410 просмотров • 3 месяцев назад

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి HYD: కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న మైనర్లను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
BigTV APP116,205 просмотров • 3 месяцев назад

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి BRS MLA పాడి కౌశిక్ రెడ్డి సవాల్ మీరు కొడంగల్‌లో ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి.. నేను హుజూరాబాద్‌లో రిజైన్ చేస్తా హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ వచ్చినా, కొడంగల్‌లో రేవంత్ గెలిచినా.. నేను ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్తా అలా చేసే ధైర్యం లేకపోతే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలని ఛాలెంజ్
BigTV APP67,525 просмотров • 1 месяц назад

మహారాష్ట్రలో నకిలీ బాబా ఆగడాలు..జ్యోతిష్కుడి ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్న కామాంధుడు రిటైర్డ్ మర్చంట్ నేవీగా చెప్పుకుంటూ చెలామణి అవుతున్న అశోక్ ఖరాత్‌ను అరెస్ట్ చేసిన నాసిక్ పోలీసులు వ్యక్తిగత సమస్యల కోసం వచ్చిన 35 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిష్కుడు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన దారుణం..మరో 58 మంది మహిళలకు సంబంధించిన అసభ్యకర వీడియోలు లభ్యం కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం
BigTV APP207,084 просмотров • 7 месяцев назад

‘నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి’ AP: వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్టుపై ఆయన భార్య శ్రీదేవి స్పందించారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉంది. నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటివరకు చెప్పలేదు. ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదాల్లో మరణించిన బాధితుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.
BigTV APP91,890 просмотров • 3 месяцев назад

గృహప్రవేశంలో రక్తపాతం.. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ దేవేందర్ నగర్లో నూతన గృహప్రవేశం వేడుకలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 50 మంది దుండగులు కర్రలు, రాళ్లతో కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా దాడి చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల పరిస్థితి విషమంగా ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
BigTV APP109,086 просмотров • 4 месяцев назад

టెక్ మహీంద్రా’లో భావన ధర్నా HYD: అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం మూడు రోజులు సెలవు అడిగినందుకు టెక్ మహీంద్రా కంపెనీ తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించిందని భావన ఆరోపించారు. కంపెనీ ఎదుట ధర్నాకు దిగి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
BigTV APP87,682 просмотров • 3 месяцев назад

సభలో కన్నీరు పెట్టుకున్న కవిత TG: సంకల్ప సభలో మాట్లాడిన TRS వ్యవస్థాపకురాలు కవిత కన్నీరు పెట్టుకున్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, నిప్పులాంటి మనిషి కాబట్టే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని స్పష్టం చేశారు. సొంతగడ్డకు రాగానే భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదన్నారు. రాజకీయంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని, కానీ బిడ్డగా తనను తీహార్ జైల్లో పెట్టడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
BigTV APP54,853 просмотров • 2 месяцев назад

AP: ఆషాఢ మాసం ముగియడంతో అత్తారింటికి వెళ్లిన కొత్త అల్లుడు శ్రీహర్షకు నర్సీపట్నంలో అరుదైన ఆతిథ్యం లభించింది. అత్తమామలు రమేశ్‌కుమార్, కళావతి ఇంటి గేటు నుంచి ఒక్కో అడుగుకు ఒక్కో బహుమతి అందించారు. అనంతరం 100 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అల్లుడిని ఆశ్చర్యపరిచారు. భార్య నవ్య, బంధువులు ప్రేమగా తినిపించడంతో ఇంట సందడిగా మారింది.
BigTV APP63,768 просмотров • 2 месяцев назад
Sensitive content
This media may contain sensitive content.

ట్రైన్లో డబ్బులు ఇవ్వనందుకు ఘోరంగా కొట్టిన హిజ్రాలు ముంబై లోకల్ ట్రైన్లో డబ్బులు ఇవ్వనందుకు ఇద్దరు హిజ్రాలు ఓ యువకుడిని ఘోరంగా కొట్టారు. ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. చాలా ప్రాంతాల్లో దాదాపు ఇలాగే ఉందని, అలాంటి హిజ్రాలపై కఠినచర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
BigTV APP79,982 просмотров • 3 месяцев назад

బీహార్‌లోని ఓ కూరగాయల మార్కెట్లో ఓ వృద్ధుడు వాడుతున్న ‘త్రాసు’ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. తూనికరాళ్లతో పనిలేకుండా.. కేవలం నాలుగు తాళ్ల ముక్కల కట్టు సాయంతోనే ఆయన అరకిలో నుంచి 2 కిలోల వరకు ఖచ్చితమైన బరువును కొలుస్తున్నారు. ఈ వందేళ్ల నాటి దేశీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
BigTV APP88,686 просмотров • 4 месяцев назад

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో అరుదైన దృశ్యం HYD: బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉత్సవాలకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒకరికొకరు మర్యాదపూర్వకంగా పూలదండలు వేసుకొని ఆత్మీయతను చాటుకున్నారు. ఈ అరుదైన క్షణం అక్కడ ఉన్న భక్తులు, నాయకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
BigTV APP75,122 просмотров • 3 месяцев назад