
KTR
@KTRBRS • 4,601,225 subscribers
Personal account of Working president of BRS & Former Minister | MLA from Siricilla, Telangana. Abusers will be Blocked
Shorts
Videos

ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు! కృష్ణా నదిలో ఈ ఏడాది 250 టీఎంసీల వరద వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులు నడపలేదు. గోదావరిలో 750 టీఎంసీల వరద వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపలేదు. ఫలితం, ఇవ్వాళ ఎండిపోతున్న పంటలకు ట్యాంకర్లతో నీటిని కొనుక్కొచ్చి పోస్తున్న తెలంగాణ రైతన్నలు.
KTR103,851 views • 12 days ago

పబ్లిక్ లేకుండా పబ్లిక్ హియరింగ్. డీపీఆర్ లేకుండా ప్రాజెక్ట్. ఇదీ కాంగ్రెస్ పాలనా తీరు. మూసీ బ్యూటిఫికేషన్ పేరు మీద చేస్తున్న రూ. 1.5 లక్షల కోట్ల లూటిఫికేషన్‌కు వ్యతిరేకంగా మేము ఎప్పటినుండో పోరాడుతున్నాం. నిన్న మా నాయకులు, మాజీ మంత్రి Sabitha Reddy, ఎమ్మెల్యే Devireddy Sudheer Reddy MLA, ఎమ్మెల్సీ Prof Dasoju Sravan Kumar, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంఛార్జ్ Karthik Indra Reddy Patlolla మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్తుంటే, అడ్డుకొని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు కరువు ఉంది అంటారు... ఇంకోవైపు మూసీ సుందరీకరణ చేపడతారు... ఇదేం విపరీత బుద్ధి?
KTR47,963 views • 6 days ago

ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్, ఇప్పుడేమో రైతుల సెల్ఫ్ డిక్లరేషన్. తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఏర్పడింది. జెనరేటర్లు, ట్యాంకర్లతో తెలంగాణ రైతులు పంటలు కాపాడుకుంటున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం హాలిడే ఇవ్వాలి!
KTR34,127 views • 6 days ago

About 10 months ago, I had made a comment at a media event that a Gen-Z protest is imminent in our country if the aspirations of youngsters are not addressed After yesterday’s Delhi protest, it is high time for the Union Govt to address the demand for accountability and education reforms
KTR355,244 views • 3 months ago

పూలతో పూజించడమే కాదు... పూలనే పూజించే విభిన్న, విశిష్ఠ సంస్కృతి తెలంగాణకు సొంతం. తీరొక్క పువ్వులను అందంగా పేర్చి, భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో మన ఆడబిడ్డలు తొమ్మిది రోజుల పాటు ఆనందోత్సాహాలతో జరుపుకునే మన అస్తిత్వ సౌరభం బతుకమ్మ పండుగ. బతుకమ్మ వేడుకల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా... తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. 🌸🌷🏵️🌺🌼
KTR46,829 views • 17 days ago

With Tim Cook stepping down as CEO of Apple, this memory from his visit to Hyderabad in 2016 came to mind. During my tenure as IT Minister, I had the pleasure of hosting Tim in Hyderabad when Apple established its development centre here, a significant vote of confidence in the city’s talent and the technology ecosystem we were building in Telangana. It was a memorable moment for Hyderabad, and one worth looking back on today. My warmest wishes to Tim Cook for the journey ahead.
KTR162,740 views • 2 months ago

History made! 🇮🇳 A proud milestone for India's space sector 🚀 Skyroot Aerospace has successfully launched #Vikram1, India's first privately developed orbital-class rocket. It is truly heartening to see Hyderabad-based Skyroot, incubated at T-Hub, achieve this landmark feat and reach new heights. Congratulations to Pawan Chandana, Naga Bharath Daka, and the entire Skyroot Aerospace team on this historic achievement. Wishing you many more successful missions ahead. Rooting for you, as always! #MissionAagaman
KTR258,026 views • 3 months ago

This is the famed Indiramma Rajyam where even female MLAs are not safe! When Duryodhana, Dushashanas become Chief Ministers and Ministers, it is only natural that the Congress police try and strip women MLAs These are some of the strongest women, fiercest fighters I know and they are in tears because of how Congress police pulled their sarees, dragged them by their hair and assaulted them. Absolutely deplorable behavior and no human should be put through this humiliation. Will you Rahul Gandhi be silent if the same treatment is meted out to Madam Sonia Gandhi or Priyanka Gandhi? Remember this Revanth Reddy - these tears will haunt you and wipe you out very soon
KTR139,905 views • 1 month ago

పోరాడితే పోయేదేమీలేదు… బానిస సంకెళ్లు తప్పా!!! జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో…రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం! ఈ కుంభకర్ణ ప్రభుత్వన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు! ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని, తెలంగాణా ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం! ప్రశ్నించడం, పోరాడడం, మన తెలంగాణా హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడడం- ఇదే మన ముందున్న లక్ష్యం! జై కేసీఆర్ జై తెలంగాణ ✊🏽
KTR95,563 views • 1 month ago

జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలను, రైతులను అక్రమంగా అరెస్టుచేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నేతలందరినీ అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. అదేవిధంగా వందలాది రైతులను కూడా పోలీసులు అడ్డుకుని, నిర్భంధించడం రాష్ట్రంలో సాగుతున్న అణచివేతకు తాజా ఉదాహరణ. కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి, న్యాయమైన డిమాండ్ తో నిరసనకు సిద్ధమైన రైతులను, బీఆర్ఎస్ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోంది. సీఎంగా విఫలమైన రేవంత్ తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే, జిల్లాలోని అనేక మండలాల్లో బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు చీకటి ఆదేశాలిచ్చాడు. జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా కుంటిసాకులతో రేవంత్ సర్కారు పచ్చని పంటల ఉసురు తీస్తోంది. తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే, వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోంది. తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి, వందలాది పోలీసులను చుట్టుపక్కల మోహరించడం, వస్తున్న రైతులను అడ్డగించి అరెస్టులు చేయడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య. తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా, 9 టీఎంసీలున్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని నేరం. అక్రమంగా అరెస్టుచేసిన రైతులను, బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు రిలీజ్ చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై కిసాన్.
KTR93,485 views • 1 month ago

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి స్వపరిపాలనను అందించిన కేసీఆర్ గారు, జిల్లాలను పునర్వ్యవస్థీకరించి సుపరిపాలను అందించారు. 10 జిల్లాలను 33 జిల్లాలు చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరిపి, ప్రజల ముంగిటికే పాలన తీసుకొచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కొన్ని దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలకు ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తూ... కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడమే కాదు, ఆ ప్రాంత విశిష్ఠత ఉట్టిపడేలా జిల్లాలకు నామకరణం చేశాడు. జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు గతంలో 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి మారి, నేడు జిల్లా కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని నలుమూలల ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత వచ్చింది, గడపగడపకు సంక్షేమం అందింది. నూతన జిల్లాలు ఏర్పడి పదేళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. జై తెలంగాణ!
KTR49,161 views • 25 days ago

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు! కేసీఆర్ గారి మానవీయ పాలనకు నిదర్శనం కళ్యాణలక్ష్మి పథకం. ఉద్యమ సమయంలో ఒక గిరిజన తండాలో స్వయంగా చూసిన ఒక సంఘటన ప్రేరణగా ఈ పథకానికి శ్రీకారం చుట్టిండు కేసీఆర్. తెలంగాణలోని లక్షల కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి సమయంలో కేసీఆర్ మేనమామ లాగా నిలిచాడు... పేద కుటుంబాలకు పెద్ద దిక్కైనాడు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ. 1,00,116 కానుకగా అందించాలన్న ఆలోచన కేసీఆర్‌కు తప్ప ప్రపంచంలోని ఏ నాయకుడికి రాలేదు. ఆడబిడ్డ పెళ్లి సమయంలో తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడింది. బాల్య వివాహాలను కూడా తగ్గించింది. గత పన్నెండేళ్లలో కళ్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా 16.78 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరింది. కాంగ్రెస్ వచ్చాక కళ్యాణలక్ష్మి పథకాన్ని నీరుగార్చడమే కాకుండా.. పూర్తిగా రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి. కళ్యాణలక్ష్మితో పాటు ఇస్తానన్న తులం బంగారం దేవుడెరుగు, అసలు ఈ పథకమే లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు. కళ్యాణలక్ష్మి పథకం అమలులోకి వచ్చి ఈ రోజుతో 12 ఏళ్ళు నిండిన శుభ సమయాన... లబ్ధిదారులకు శుభాకాంక్షలు.
KTR62,950 views • 1 month ago

కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది! రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు #KaleshwaramProject
KTR132,902 views • 3 months ago

Dear Sri Siddaramaiah Garu, We’ve lost the election because your party had shamelessly misled the people of Telangana with Fake promises Dec 9th, 2023 has passed, but where is the: 👉 Rythu Bharosa promised to farmers, tenant farmers and farm labourers 👉 Rs 2 Lakhs Farm Loan Waiver 👉 Rs 4000 welfare pension 👉 Rs 500 Gas Cylinder 👉 Rs 2500 your party had promised to every woman 👉 Mega DSC announcement in first cabinet 👉 Providing legal sanctity to 6 guarantees in first cabinet Are these promises fake or your party leaders who promised these schemes fake? Also care to explain why you lost elections in three other states?
KTR1,027,553 views • 2 years ago

జీవో 97 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. శాంతియుతంగా నిరసనను తెలుపుతున్న విద్యార్థుల మీద కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన దృశ్యాలు నన్ను కలచివేశాయి. విద్యార్థుల హక్కులను కాలరాయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా... కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జీవో 97 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికే పలు నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇకముందు కూడా పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.
KTR82,860 views • 2 months ago

The best Gift for me in what has been a difficult year Thank you Binku Himanshu Rao Kalvakuntla ❤️ Loved the vocals Apparently, my son recorded this for my birthday in July. But shied away from releasing it as he didn’t think it was good enough!!! I’ve only heard it last week for the first time. Super proud as a Dad 😊
KTR585,345 views • 1 year ago

స్వరాష్ట్ర ఆకాంక్షను చాటే విధంగా... తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా... ఉద్యమకారులకు ఒక వేదికగా... సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఒక అద్భుత కట్టడం తెలంగాణ భవన్ ప్రారంభమయ్యింది. ఉద్యమ సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో... దశాబ్ద కాలపు స్వరాష్ట్ర అప్రతిహత ప్రగతి ప్రస్థానంలో... నేడు కాంగ్రెస్ విఫల పాలనలో తెలంగాణ ప్రజలకు ఒక 'జనతా గ్యారేజ్'లా మారడంలో... మన తెలంగాణ భవన్ సాక్షీభూతంగా నిలిచింది. తెలంగాణ 'భువన విజయం' తెలంగాణ భవన్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా - ఉద్యమకారులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. జై తెలంగాణ ✊
KTR81,314 views • 2 months ago