
V.C. Sajjanar, IPS
@SajjanarVC_IPS • 189,229 subscribers
Proud husband & father | IPS ‘96 | DG & Commissioner of Police, Hyderabad| Duty is not a job. It’s a promise. #SayNoToBettingApps
Shorts
Videos

ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్‌ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా... లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా? నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించండి. రైల్వే ట్రాక్ పక్కన బాహ్య ప్రపంచపు స్పృహే లేకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టిన ఈ హృదయ విదారక దృశ్యం ఎవరి గుండెలనైనా బరువెక్కించక మానదు. హైదరాబాద్ బొల్లారం సమీపంలో ఇటీవల జరిగిందీ ప్రమాదం. క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన అజాగ్రత్త బతికుండగానే నిండు జీవితాన్ని ఎలా ముగింపునకు తెస్తుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. చెవుల్లో దూరిన ఆ పరికరాలు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేసి, సమీపిస్తున్న ప్రమాద ఘంటికలను సైతం వినిపించకుండా చేస్తున్నాయి. భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా గ్రహించలేనంతగా పరధ్యానంలో మునిగిపోవడం తీవ్ర విషాదాలకు దారితీస్తోంది. ఇది కేవలం రైల్వే ట్రాక్‌ల వద్దే కాదు, రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా నిత్యం ప్రాణాల మీదకు తెస్తున్న భయానక వాస్తవం. బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల స్పృహ కోల్పోయి, వెనుక వచ్చే వాహనాల హారన్లు గానీ, అత్యవసర అంబులెన్స్ సైరన్లు గానీ వినబడక తమ ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారు. నిజానికి ఈ సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు, అలాగే జీవితాన్ని మించిన వినోదమూ మరొకటి లేదు. మీరు మాట్లాడుతున్న ఫోన్ కాల్‌ను కాసేపు ఆపవచ్చు, వింటున్న పాటను తర్వాతైనా వినవచ్చు, కానీ ఆ క్షణిక నిర్లక్ష్యానికి ఒక్కసారి ప్రాణం గాల్లో కలిసిపోతే ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు. ఆ తర్వాత మీ కుటుంబానికి మిగిలేది జీవితాంతం తీరని శోకం, అంతులేని వేదన మాత్రమే. ముఖ్యంగా యువత ఈ భ్రమల నుంచి తక్షణమే బయటకు రావాలి. రోడ్లపై నడుస్తున్నప్పుడు అయినా, వాహనాలు నడుపుతున్నప్పుడు అయినా, రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్నప్పుడు అయినా ఇయర్‌ఫోన్లు వాడే ప్రాణాంతక అలవాటును తక్షణమే మానుకోవాలి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు అనేవి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలు తప్ప అలసత్వానికి తావిచ్చే వేదికలు కావు. కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి, నిండు ప్రాణాలను నిర్లక్ష్యానికి బలివ్వకండి, మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి. Disclaimer: This video is shared strictly for public awareness and safety, not to cause distress. #SafetyFirst #RoadSafety #RailwaySafety #HyderabadCityPolice
V.C. Sajjanar, IPS77,658 views • 8 days ago

▶️'NO' అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ! ▶️ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు! ▶️వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా! ▶️ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం! వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది! బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం 'NO' అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది. ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది! ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది. ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు. ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే... గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు 'YES' గానీ, 'NO' గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండి! కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి. మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండి. ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో వెంటనే '1930' సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా లో ఫిర్యాదు చేయండి. కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!! #CyberCrimeAlert #WhatsAppScam #StayAlert #CyberSecurity #HyderabadPolice
V.C. Sajjanar, IPS103,946 views • 22 days ago

జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ గారి హత్య-దోపిడీ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. రెండు నెలల పాటు నేపాల్, ఇతర రాష్ట్రాల్లో అలుపెరగక శ్రమించి, దారుణానికి ఒడిగట్టిన పనిమనిషితో సహా నలుగురు సభ్యుల అంతర్జాతీయ నేపాల్ ముఠాను సిట్, జూబ్లీహిల్స్ బృందాలు అరెస్ట్ చేశాయి. ఇళ్లలో పనిమనుషులు లేదా వాచ్మెన్లను పెట్టుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లలో ఉచిత పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. #HyderabadCityPolice #JubileeHills #SafeHyderabad #PublicAdvisory
V.C. Sajjanar, IPS26,944 views • 8 days ago

ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు. లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి, ఆహార నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడటం ఎవరికీ మంచి చేయదు.. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది? నిజమైన భక్తి అంటే జీవకారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు! మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం.
V.C. Sajjanar, IPS38,180 views • 13 days ago

ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు! అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరం. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించాం. పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నాం. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయి. అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం. గతంలోనే జీహెచ్‌ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మా పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి. కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. Hyderabad Traffic Police Hyderabad City Police CP Hyderabad City Police
V.C. Sajjanar, IPS65,985 views • 26 days ago

వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు. పెట్రోల్ బంక్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బైక్ స్టంట్లు చేయడం సాహసం కాదు.. అది పచ్చి మూర్ఖత్వం! మీ ఒక్క క్షణపు షో కోసం అక్కడ ఉన్న అమాయకుల ప్రాణాలు బలి కావాలా!? గుర్తుంచుకోండి.. మీరు చేసే Wheelings ఇంట్లో మీ కోసం ఎదురుచూసే తల్లిదండ్రుల కళ్లలో కన్నీటి Feelings మిగల్చకూడదు. బాధ్యతగా ఉండండి!
V.C. Sajjanar, IPS295,021 views • 6 months ago

అమీన్(ఎస్సై)గా చేరి హైదరాబాద్ కొత్వాల్ స్థాయికి ఎదిగిన మహనీయుడు శ్రీ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి గారు. పేదలు, మహిళా విద్య కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అబిడ్స్‌లోని RBVRR సొసైటీలో జరిగిన రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి గారి 157వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నాను. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను. విధుల్లో విశేష ప్రతిభ చూపిన హైదరాబాద్ SB ఇన్స్పెక్టర్ హరీష్, సైబరాబాద్ ఇన్స్పెక్టర్ రవికి రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, కేవీ రంగా రెడ్డి స్మారక గోల్డ్ మెడల్స్ అందజేసి అభినందించాను. #RajaBahadurVenkatramiReddy #HyderabadPolice
V.C. Sajjanar, IPS107,149 views • 2 months ago

చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు! ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. CyberDost I4C Andhra Pradesh Police Telangana Police DGP TELANGANA POLICE PMO India गृहमंत्री कार्यालय, HMO India
V.C. Sajjanar, IPS734,676 views • 1 year ago

చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి.
V.C. Sajjanar, IPS774,682 views • 1 year ago

కన్నతల్లే నిస్సహాయతతో హుస్సేన్‌సాగర్‌లోకి నెట్టేసి మృత్యుఒడికి చేర్చాలని చూసిన వేళ.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌లను మనస్ఫూర్తిగా అభినందించి, సత్కరించాను. ఆపదలో ఉన్న తోటి మనుషులను చూసి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే నేటి రోజుల్లో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమాజానికే ఆదర్శం. క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్! పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభను కలిగించినా.. కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎంతటి కష్టమొచ్చినా అధైర్యంతో కర్కశ నిర్ణయాలు తీసుకోకండి. నైరాశ్యంలో చేతులెత్తేయకుండా సమాజ సాయం కోరండి; ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుంది. లోకంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు! #HyderabadCityPolice #GoodSamaritans #Humanity #Hyderabad #SaluteToHeroes
V.C. Sajjanar, IPS29,903 views • 20 days ago

క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ సీసీటీవీ దృశ్యాలే సజీవ సాక్ష్యం. వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా చిన్నారులకు బైక్ ఎక్కడం ఒక సరదా, యాక్సిలరేటర్ తిప్పడం ఒక సంబురం. కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది. కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులే. అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. - వాహనం నిలిపివేసిన వెంటనే ఇంజిన్ ఆపి, కీ తీసేయడం ప్రాథమిక నియమంగా మార్చుకోవాలి. - ఇంజిన్ ఆన్‌లో ఉన్న టూ-వీలర్‌పై చిన్నారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదు. - ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరమని గ్రహించాలి. చిన్న నిర్లక్ష్యంతో వారి సంబురాన్ని విషాదంగా మార్చకూడదు. సురక్షిత ప్రయాణం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని గుర్తిస్తూ అందరూ ట్రాఫిక్ నియమాలను, భద్రతా ప్రమాణాలను పాటించాలి. Hyderabad Traffic Police Hyderabad City Police CP Hyderabad City Police MORTHRoadSafety MORTHINDIA
V.C. Sajjanar, IPS133,494 views • 3 months ago

అంకితభావంతో శ్రమించి హైదరాబాద్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా విజయవంతం చేసిన మా సిబ్బంది నిబద్ధత వెలకట్టలేనిది.. వీరి కష్టానికి ఎన్ని ప్రశంసలైనా తక్కువే! కర్తవ్య నిర్వహణలో అలసిసొలసిన నా సహచరుల్లో సరికొత్త జోష్ నింపేందుకే వారితో కలిసి సరదాగా ఆడిపాడాను. అహోరాత్రులు చెమటోడ్చిన వాళ్ల ముఖాల్లో.. ఆ అలసట స్థానంలో విరిసిన నవ్వులు చూశాక, ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది #HyderabadCityPolice #DutyFirst #PoliceFamily #GaneshUtsav #HyderabadGaneshImmersion
V.C. Sajjanar, IPS39,953 views • 1 month ago
0:48
Sensitive content
This media may contain sensitive content.

చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!? యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. Video Credit: Vedhaan Media #SayNoToBettingApps CyberDost I4C PMO India गृहमंत्री कार्यालय, HMO India
V.C. Sajjanar, IPS419,266 views • 1 year ago

వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా!? వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!? చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు — క్షమార్హం.. చట్టరీత్యా నేరం!! ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి. When values fade in the illusion of views—what are we becoming!? How justifiable is it to risk the future of children merely to gain *views* and *likes* on social media? By creating indecent content with minors, what message are you really sending to society? Instead, interview and highlight people who inspire youth and children—those who can truly contribute to the progress of society. Don’t divert children’s minds by making such inappropriate videos with them. Remember—this is not just a violation of children's rights, it is *inexcusable* and *a punishable offense under the law*! Such actions amount to violations under the POCSO Act and the Juvenile Justice Act. Involving minors in such content constitutes *child exploitation*. The Police Department will take strict action against anyone involved in producing or uploading such content with minors. Cases will be registered as per law against offenders who fail to remove such material immediately or engage in similar posts in the future. If you come across such videos on social media, report them immediately. Inform your local police station. You can also call the helpline number 1930 or file a complaint at the National Cyber Crime Portal ( As parents, your duty doesn’t end with raising children—it includes safeguarding their childhood, mental well-being, and future. Keep your children away from inappropriate content. Provide them with a positive environment and the right values.
V.C. Sajjanar, IPS282,622 views • 1 year ago

నగర ప్రజలకు విజ్ఞప్తి! గణేశ్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా పోలీసు, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ఇప్పటికే విధించిన ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నాం. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదు. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి అనవసరంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దు. ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా మాకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
V.C. Sajjanar, IPS35,916 views • 1 month ago

'ఓపెన్ ఛాలెంజ్' అంట!? ఫేమస్ అయ్యేందుకు ఇవేం పిచ్చి పనులు. సోషల్ మీడియా వైరల్ వెర్రి పట్టి ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఆలోచించకుండా దిక్కుమాలిన వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర వీడియోలతో ఏం సందేశం ఇస్తున్నారు మీరు. సమాజానికి ఏం నేర్పిస్తున్నారు. ఆలోచించండి.
V.C. Sajjanar, IPS301,692 views • 1 year ago

పశువులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి దొంగిలించడమే కాకుండా, సెల్ ఫోన్ దుకాణాల్లో చోరీలకు పాల్పడుతూ వాటిని బంగ్లాదేశ్‌కు అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేయడం జరిగింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఖమ్మం పోలీసులు సమన్వయంతో చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో పాటు అంతర్జాతీయ రిసీవర్లతో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశాం. వారి వద్ద నుంచి రూ. 22 లక్షల నగదు, 3 కార్లు, 15 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ అక్రమ నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఛేదించాం.
V.C. Sajjanar, IPS36,064 views • 1 month ago

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్ కవచ్ నాకాబందీ తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాను. ఈ స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 725 వాహనాలను డిటైన్ చేసి, 48 మంది అనుమానితులను హైదరాబాద్ సిటీ పోలీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిటీలో నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి కోసం రాత్రి వేళల్లో ఇలాంటి ఆకస్మిక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నగర పౌరులంతా పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. #OperationKavach #HyderabadCityPolice #NightVigil #Dial112
V.C. Sajjanar, IPS14,855 views • 18 days ago