V.C. Sajjanar, IPS's banner
V.C. Sajjanar, IPS's profile picture

V.C. Sajjanar, IPS

@SajjanarVC_IPS • 189,229 subscribers

Proud husband & father | IPS ‘96 | DG & Commissioner of Police, Hyderabad| Duty is not a job. It’s a promise. #SayNoToBettingApps

Shorts

రెండు కళ్లకు ఎదురుగా రెండు ఫోన్లు.. ఒకదాంట్లో గమ్యం చూపించే నేవిగేషన్ రూట్, మరోదాంట్లో నాన్‌స్టాప్ వినోదాన్ని పంచే సినిమా! ఇక చెవులకేమో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా రంగురంగుల లైట్లు వెలిగే పెద్ద హెడ్‌ఫోన్లు! ఇది ఒక ఆటో డ్రైవర్ అధునాతన సెటప్. ఒక నెటిజన్ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోను నాకు పంపించారు. చూడటానికి ఇది మల్టీ-స్క్రీన్ గేమింగ్ విన్యాసంలా అనిపించినా, వెనుక కూర్చున్న ప్రయాణికుల పాలిట మాత్రం ఇది నడుస్తున్న మృత్యుశకటం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దృష్టి క్షణకాలం రోడ్డుపై నుంచి పక్కకు మళ్లినా ఘోర ప్రమాదాలు ముంచుకొస్తాయి. అలాంటిది నేరుగా సినిమా చూస్తూ, చెవుల్లో హెడ్‌ఫోన్లు పెట్టుకుని వాహనం నడపడం కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. క్షమించరాని నేరం. ఎంవీ యాక్ట్ ప్రకారం ఇది డేంజరస్ డ్రైవింగ్ కిందకు వస్తుంది. దీనికి భారీ జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశమూ ఉంది. వినోదం కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడం భావ్యం కాదు. ఆటోను థియేటర్‌గా మార్చి జీవితాలకు ది ఎండ్ కార్డు వేయొద్దని గుర్తుంచుకోవాలి. వాహనం ఏదైనా.. టూవీలర్, కారు, ఆటో, బస్, లారీ.. డ్రైవింగ్ సమయంలో మొబైల్, హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వాడకం ప్రాణాంతకం. ఈ క్రమంలో ప్రయాణం ఆటో అయినా, కారు అయినా, బస్సు అయినా ప్రయాణికులు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ ఫోన్ చూస్తున్నా, చెవుల్లో హెడ్‌ఫోన్లు లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకున్నా చూస్తూ మౌనంగా ఉండిపోకండి. అది ప్రాణాలకే ప్రమాదమని వెంటనే ప్రశ్నించండి, వారించండి. ఒకవేళ వారు వినకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డయల్ 112కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించండి. ప్రయాణంలో మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే ముప్పు తెస్తుంది.. అదే సమయంలో మీ అప్రమత్తత మీతో పాటు ఎందరో అమాయకుల ప్రాణాలను కాపాడుతుందని గ్రహించాలి. Instructed Hyderabad Traffic Police to trace the auto (TG15U2657) driver and take stringent legal action as per the law. #RoadSafety #HyderabadTraffic #PassengerSafety #Dial112 #DriveSafe

137,706 görüntüleme

హెల్మెట్ లేదు, ట్రాఫిక్ నిబంధనలపై గౌరవం లేదు.. కేవలం డేర్ డెవిల్ విన్యాసాలు మాత్రమే! డివైడర్లు రోడ్లను విభజించడానికి ఏర్పాటు చేసినవి, మీ ద్విచక్ర వాహనాలు ర్యాంప్ వాక్ చేయడానికి కాదు. కొద్ది నిమిషాల సమయం ఆదా చేయడం కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి. ఇలాంటి సాహసాలు మిమ్మల్ని గమ్యస్థానానికి కాదు, నేరుగా యమపురికో లేదా హాస్పిటల్ బెడ్‌కో చేరుస్తాయి. రహదారి భద్రత - ప్రతి ఒక్కరి బాధ్యత! 🙏 #RoadSafety

130,403 görüntüleme

ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో ఉండబట్టి పెను ప్రమాదం తప్పింది. కానీ గుర్తుంచుకోండి.. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం ఉండదు. తల్లిదండ్రులారా! రహదారుల పక్కన నడుస్తున్నప్పుడు మీ పిల్లల చేతిని వదలకండి. చిన్న నిర్లక్ష్యం తీరని శోకాన్ని మిగులుస్తుంది. జాగ్రత్తగా ఉండండి! అదృష్టం ఎప్పుడూ తోడుండదు.. అప్రమత్తతే అసలైన రక్షణ #RoadSafety #ChildSafety #AlertParents #Awareness

172,051 görüntüleme

ఇదేం వెర్రి కామెడీ!? సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. TGSRTC @PROTGSRTC

237,954 görüntüleme

పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గరాబం పనికి రాదు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ.. ఏం నేర్పిస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.

పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గరాబం పనికి రాదు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర పనులు చేయిస్తూ.. ఏం నేర్పిస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.

214,614 görüntüleme

ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. కానీ, ప్రాణాలను పణంగా పెట్టి ఇలా వర్క్ ఫ్రమ్ బైక్ చేయడం చూస్తుంటే... ఆత్రం ఎక్కువైతే ప్రాణం మీదకు వస్తుంది అనే మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. రోడ్డు మీద మీ ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది మీ ప్రాణానికే కాదు, పక్కన వెళ్లే అమాయకుల ప్రాణాలకు కూడా ప్రమాదకరం. గుర్తుంచుకోండి... కడుపు నింపుకోవడానికి చేసే పని, కడతేర్చేలా ఉండకూడదు. దయచేసి రోడ్డుపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు మానేయండి. సురక్షితంగా ప్రయాణించి, క్షేమంగా మీ గమ్యస్థానాలకు చేరుకోండి. #RoadSafety #ResponsibleDriving #SafetyFirst

58,574 görüntüleme

అదృష్టవశాత్తు ప్రమాదం తృటిలో తప్పింది. అయితే ప్రతిసారీ అదృష్టమే ఆదుకుంటుందనుకోవడం భ్రమే అవుతుంది! రహదారిపై క్షణికావేశపు తొందరపాటు ఘోర ప్రమాదానికి దారితీస్తుందని ప్రతి వాహనదారుడూ గుర్తించాలి. MORTHINDIA MORTHRoadSafety Hyderabad City Police CP Hyderabad City Police Hyderabad Traffic Police Office of V.C. Sajjanar, IPS #RoadSafety #SafeDriving #TrafficAwareness #DriveCarefully #NoShortcutsToLife #AlertDriving

42,845 görüntüleme

What are your findings regarding this accident? పంజాబ్‌లోని కోట్ కపురాలో ఇటీవల జరిగిందీ ప్రమాదం. #RoadSafety #RoadAwareness #SafeDriving #TrafficRules

What are your findings regarding this accident? పంజాబ్‌లోని కోట్ కపురాలో ఇటీవల జరిగిందీ ప్రమాదం. #RoadSafety #RoadAwareness #SafeDriving #TrafficRules

66,085 görüntüleme

సోషల్ మీడియా ఫేమస్ పిచ్చికి పరాకాష్ట ఇది!! ఇన్స్టాగ్రామ్ లో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం ఈ మహానుభావుడు ఎంతకు తెగించాడో చూడండి. తన వెర్రి చేష్టలకి 4.4 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని అదేదో ఘనకార్యం సాధించినట్లు మరొక వీడియోను వదిలాడు. సోషల్ మీడియాలో ఫేమస్ పిచ్చి పట్టుకున్న వీరంతా సామాజిక విద్రోహులు. వ్యూస్, లైక్స్, కామెంట్ల కోసం వారు ఎంత దూరమైన వెళ్తారు. ఇలాంటి సామాజిక ద్రోహులకు దూరంగా ఉండండి. సోషల్ మీడియానే జీవితం కాదు. వ్యక్తిగత గుర్తింపు సోషల్ మీడియా ద్వారానే వస్తుందనే భ్రమలోంచి యువత బయటకి రావాలి. కష్టాన్ని నమ్ముకుంటే జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చనే విషయాన్ని గ్రహించాలి.

148,167 görüntüleme

లైక్స్, వ్యూస్ కోసం ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది? సమాజం ఏమైపోతోంది? ఫేమస్ అవ్వడం కోసం ఏమైనా చేస్తారా? వెనుక వచ్చే వారికి కళ్లు కనపడక యాక్సిడెంట్ అయితే ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? రోడ్లు మీ సోషల్ మీడియా స్టంట్లకు వేదికలు కావు!

61,332 görüntüleme

మీరు చూసే IPLలో Decision Review System(DRS) ఉంటుంది... కానీ యమధర్మరాజు దగ్గర 'Death Review System' మాత్రం అస్సలు ఉండదు! గ్రౌండ్‌లో వికెట్ పడితే ప్లేయర్ పెవిలియన్‌కి వెళ్తాడు.. కానీ రోడ్డు మీద ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మీ వికెట్ పారేసుకుంటే, మీరు పర్మనెంట్‌గా పైకి వెళ్తారు. క్రికెట్ లో అంపైర్ నిర్ణయంపై రివ్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది.. ఇక్కడ ఆ ఛాన్స్, ఛాయిస్ రెండూ ఉండవు! మొబైల్ లో స్కోర్ బోర్డ్ చూస్తూ మీ జీవితాన్ని 'జీరో' కి క్లీన్ బౌల్డ్ చేసుకోకండి. మీకు మ్యాచ్ ముఖ్యం కావొచ్చు.. కానీ మీ కోసం ఇంట్లో ఎదురుచూసే మీ కుటుంబానికి 'మీరు' మాత్రమే ముఖ్యం. క్రికెట్ పై అభిమానం ఉండొచ్చు కానీ ప్రాణాలు తీసే వెర్రి పిచ్చి మాత్రం కాదు. బి సేఫ్.. డ్రైవ్ సేఫ్! #IPL2024 #RoadSafety #VCSajjanar #DontWatchAndDrive #CricketFever #TrafficRules #LifeIsPrecious #SafeDriving

42,580 görüntüleme

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న పిచ్చి.. మృత్యువుతో చెలగాటమాడే స్థాయికి చేరింది. చేతిలో ఆయుధాలు పట్టుకుని విన్యాసాలు చేస్తూ.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రీల్స్ చేస్తున్న యువత ఏమాత్రం విచక్షణ కోల్పోతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కేవలం వందల కొద్దీ లైకుల కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాక ఆ ఫేం వల్ల ఉపయోగం ఏంటి? డిజిటల్ ప్రపంచపు మాయలో పడి వాస్తవ జీవితాన్ని మర్చిపోకండి. సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి ఒక వేదిక మాత్రమే కానీ అది మీ జీవితం కాదు. ప్రమాదకరమైన స్టంట్లు, ఆయుధాలతో చేసే విన్యాసాలు కేవలం చట్టరీత్యా నేరం మాత్రమే కాదు, మీ ప్రాణాలకే ముప్పు. గుర్తుంచుకోండి.. పోయిన ప్రాణం మళ్ళీ రాదు. లైకుల కోసం లైఫ్ రిస్క్‌లో పెట్టకండి. ఆలోచించండి! #ReelsMadness #SocialMediaAddiction #FakeFame #CyberSafety #LifeIsPrecious #ThinkBeforeYouAct

39,704 görüntüleme

రాజధాని కొత్త బస్సు 🩷 #TSRTC @TSRTCHQ @PROTSRTC @PonnamLoksabha Telangana CMO

రాజధాని కొత్త బస్సు 🩷 #TSRTC @TSRTCHQ @PROTSRTC @PonnamLoksabha Telangana CMO

43,248 görüntüleme

లహరి-ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు💙 వేసవిలో చల్లదనం అందించే #TSRTC లహరి- ఏసీ స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను వినియోగించుకోండి. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, అదిలాబాద్, నిజమాబాద్, నాగ్ పూర్, షిరిడీ, సత్తుపల్లి, తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం వెబ్ సైట్ ని సంప్రదించండి. @PROTSRTC @TSRTCHQ Grandpashabet Giriş Sabit #2026 Eenadu TV9 Telugu

37,154 görüntüleme

డ్రైవింగ్ చేస్తూ 'స్ట్రీమింగ్'.. మృత్యువుకు వెల్కమ్ చెప్పడమే! 🚫📱 క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన చేతులే.. ఇలా వినోదం మోజులో పడితే ప్రజల భద్రతకు గ్యారంటీ ఎవరు? ​క్షణకాలం అజాగ్రత్త.. తీరని విషాదాన్ని మిగుల్చుతుంది. డ్రైవింగ్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చూడటం (Distracted Driving) కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టే నేరం. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తప్పవు. ​⚠️ మీ భాగస్వాముల ప్రవర్తనపై నిఘా ఉంచాల్సిన బాధ్యత రైడ్ అగ్రిగేటర్లదే. 🗣️ ప్రయాణికులకు విజ్ఞప్తి!! ఇలాంటి ప్రమాదకర ప్రయాణాన్ని గమనించినప్పుడు మౌనంగా ఉండకండి.. వెంటనే ఫిర్యాదు చేయండి. ​మీ వినోదం.. అమాయకుల పాలిట శాపం కాకూడదు. Be Responsible. Drive Safe. ​#DistractedDriving #RoadSafety #HyderabadTraffic #Rapido #SafetyFirst #CyberabadPolice

12,120 görüntüleme

భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సందర్భం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో #NaatuNaatu పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ దక్కడం మనకెంతో గర్వకారణం. #RRR చిత్ర దర్శకుడు rajamouli ss గారికి, సంగీత దర్శకుడు mmkeeravaani గారికి, ఇతర చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు.

23,272 görüntüleme

తమ ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి #TSRTC యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయనను రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, టీ, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీ కేఎస్ శ్రీనివాస రాజు గారితో కలిసి @TSRTCHQ ఎండీ వీసీసజ్జనర్, ఐపీఎస్ గారు ధన్యవాదలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, తదితరులు పాల్గొన్నారు. Revanth Reddy Telangana CMO @PonnamLoksabha Grandpashabet Giriş Sabit #2026

18,381 görüntüleme

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో #TSRTC నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను సంస్థ అందించనుంది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోంది. @PROTSRTC @TSRTCHQ CTMTSRTC #Dasara2023 #Dasara

18,461 görüntüleme

Videos

SajjanarVC_IPS's profile picture

ఆధునికత పేరుతో చెవులకు తగిలించుకుంటున్న ఇయర్‌ఫోన్లు వినోదాన్ని పంచుతున్నాయా... లేక కళ్లముందే పొంచి ఉన్న మృత్యువు కేకను కూడా వినిపించకుండా ప్రాణాలను కబళించే మాయా తెరగా మారుతున్నాయా? నిండు జీవితం కంటే ఆ ఫోన్ కాల్ అంత అత్యవసరమా, ఇంట్లో ఎదురుచూసే కుటుంబ సభ్యుల కంటే ఆ పాటలు అంత ముఖ్యమైనవా? ఒక్కసారి ఆలోచించండి. రైల్వే ట్రాక్ పక్కన బాహ్య ప్రపంచపు స్పృహే లేకుండా ఫోన్ మాట్లాడుతూ నడుస్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన రైలు క్షణాల వ్యవధిలో ఢీకొట్టిన ఈ హృదయ విదారక దృశ్యం ఎవరి గుండెలనైనా బరువెక్కించక మానదు. హైదరాబాద్ బొల్లారం సమీపంలో ఇటీవల జరిగిందీ ప్రమాదం. క్షణకాలం ఏమరుపాటు, మితిమీరిన అజాగ్రత్త బతికుండగానే నిండు జీవితాన్ని ఎలా ముగింపునకు తెస్తుందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. చెవుల్లో దూరిన ఆ పరికరాలు చుట్టూ ఉన్న ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని పూర్తిగా తెంచేసి, సమీపిస్తున్న ప్రమాద ఘంటికలను సైతం వినిపించకుండా చేస్తున్నాయి. భీకరమైన శబ్దంతో రైలు దూసుకొస్తున్నా, హారన్ మోగుతున్నా గ్రహించలేనంతగా పరధ్యానంలో మునిగిపోవడం తీవ్ర విషాదాలకు దారితీస్తోంది. ఇది కేవలం రైల్వే ట్రాక్‌ల వద్దే కాదు, రోడ్లపై వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా నిత్యం ప్రాణాల మీదకు తెస్తున్న భయానక వాస్తవం. బైక్‌లు, కార్లు డ్రైవ్ చేస్తూ ఇయర్‌ఫోన్లలో మాట్లాడటం లేదా సంగీతం వినడం వల్ల పరిసరాల స్పృహ కోల్పోయి, వెనుక వచ్చే వాహనాల హారన్లు గానీ, అత్యవసర అంబులెన్స్ సైరన్లు గానీ వినబడక తమ ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకూ ముప్పు తెచ్చిపెడుతున్నారు. నిజానికి ఈ సృష్టిలో ప్రాణానికి మించిన అత్యవసరమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు, అలాగే జీవితాన్ని మించిన వినోదమూ మరొకటి లేదు. మీరు మాట్లాడుతున్న ఫోన్ కాల్‌ను కాసేపు ఆపవచ్చు, వింటున్న పాటను తర్వాతైనా వినవచ్చు, కానీ ఆ క్షణిక నిర్లక్ష్యానికి ఒక్కసారి ప్రాణం గాల్లో కలిసిపోతే ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు. ఆ తర్వాత మీ కుటుంబానికి మిగిలేది జీవితాంతం తీరని శోకం, అంతులేని వేదన మాత్రమే. ముఖ్యంగా యువత ఈ భ్రమల నుంచి తక్షణమే బయటకు రావాలి. రోడ్లపై నడుస్తున్నప్పుడు అయినా, వాహనాలు నడుపుతున్నప్పుడు అయినా, రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఉన్నప్పుడు అయినా ఇయర్‌ఫోన్లు వాడే ప్రాణాంతక అలవాటును తక్షణమే మానుకోవాలి. రోడ్లు, రైల్వే ట్రాక్‌లు అనేవి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశాలు తప్ప అలసత్వానికి తావిచ్చే వేదికలు కావు. కాస్త ఆలోచించండి, బాధ్యతగా మెలగండి, నిండు ప్రాణాలను నిర్లక్ష్యానికి బలివ్వకండి, మీ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మీ కుటుంబాన్ని గుర్తుంచుకోండి. Disclaimer: This video is shared strictly for public awareness and safety, not to cause distress. #SafetyFirst #RoadSafety #RailwaySafety #HyderabadCityPolice

V.C. Sajjanar, IPS

77,658 görüntüleme • 8 gün önce

SajjanarVC_IPS's profile picture

▶️'NO' అంటే.. బ్యాంకు ఖాతా ఖాళీ! ▶️ఓటీపీలు అడగరు.. లింకులు నొక్కక్కర్లేదు! ▶️వాట్సాప్ సందేశంతోనే క్షణాల్లో సొమ్ము స్వాహా! ▶️ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్‌తో కేటుగాళ్ల సరికొత్త పన్నాగం! వాట్సాప్‌లో వచ్చిన ఒకే ఒక్క సందేశానికి కేవలం 'NO' అని రిప్లై ఇచ్చినందుకే ఒకరి బ్యాంక్ ఖాతా క్షణాల్లో నిలువునా ఖాళీ అయిపోయింది! బాధితుడు ఎవరికీ ఎలాంటి ఓటీపీ చెప్పలేదు.. ఏ అనుమానాస్పద లింక్‌పైనా క్లిక్ చేయలేదు.. కేవలం 'NO' అనే రెండక్షరాల సమాధానమే జీవితకాల సంపాదనను తుడిచిపెట్టేసింది. ఇటీవల ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను సైతం నిలువునా ముంచేసిన ఈ సరికొత్త సైబర్ నేరం నా దృష్టికి వచ్చింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు పన్నిన అత్యంత ప్రమాదకరమైన ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్ ఇది! ఈ మోసం ఎలా జరుగుతోందంటే.. మొదట గుర్తుతెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు ‘మీ ఖాతా నుంచి ఇంత మొత్తం డెబిట్ అయ్యింది’ అంటూ నకిలీ సందేశం వస్తుంది. ఆ వెంటనే మిమ్మల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తూ.. ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే NO అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో మెసేజ్ పంపుతారు. ఖాతాలో డబ్బులు పోయాయన్న కంగారుతో మీరు ‘NO’ అని టైప్ చేసి పంపిన మరుక్షణమే.. ఆ సందేశంలో కనిపించకుండా దాగి ఉన్న మాల్‌వేర్ స్క్రిప్ట్స్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయి. క్షణాల్లో మీ మొబైల్ ఫోన్‌పై పూర్తి నియంత్రణను హ్యాకర్లు చేజిక్కించుకుని, బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతటినీ ఊడ్చేస్తారు. అందుకే ప్రజలందరికీ విజ్ఞ‌ప్తి ఏంటంటే... గుర్తుతెలియని నంబర్ల నుంచి బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు 'YES' గానీ, 'NO' గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వకండి! కంగారుపడి ఎలాంటి సమాధానమూ పంపకుండా వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి చాట్‌ను డిలీట్ చేయండి. మీ ఖాతాలో డబ్బు కట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీ అధికారిక బ్యాంక్ యాప్‌లోకి వెళ్లి నేరుగా చెక్ చేసుకోండి తప్ప, వాట్సాప్ సందేశాలను అస్సలు నమ్మకండి. ఏ అధికారిక బ్యాంకూ వాట్సాప్‌లో ఇలా సమాధానాలు కోరదు. ఒకవేళ ఎవరైనా ఈ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్‌లో వెంటనే '1930' సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా లో ఫిర్యాదు చేయండి. కంగారులో ఇచ్చే ఒక్క నో అనే సందేశం మీ సర్వస్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!! #CyberCrimeAlert #WhatsAppScam #StayAlert #CyberSecurity #HyderabadPolice

V.C. Sajjanar, IPS

103,946 görüntüleme • 22 gün önce

SajjanarVC_IPS's profile picture

జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజా రంజన్ గారి హత్య-దోపిడీ కేసును హైదరాబాద్ సిటీ పోలీసులు ఛేదించారు. రెండు నెలల పాటు నేపాల్, ఇతర రాష్ట్రాల్లో అలుపెరగక శ్రమించి, దారుణానికి ఒడిగట్టిన పనిమనిషితో సహా నలుగురు సభ్యుల అంతర్జాతీయ నేపాల్ ముఠాను సిట్, జూబ్లీహిల్స్ బృందాలు అరెస్ట్ చేశాయి. ఇళ్లలో పనిమనుషులు లేదా వాచ్‌మెన్లను పెట్టుకునే ముందు యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లలో ఉచిత పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. #HyderabadCityPolice #JubileeHills #SafeHyderabad #PublicAdvisory

V.C. Sajjanar, IPS

26,944 görüntüleme • 8 gün önce

SajjanarVC_IPS's profile picture

ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ.. కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి, మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు. లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించగా.. ఛత్రినాక శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, అలాగే మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను రెస్క్యూ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. బాధ్యులపై అటవీశాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి, ఆహార నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడటం ఎవరికీ మంచి చేయదు.. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది? నిజమైన భక్తి అంటే జీవకారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు! మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ, కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని కోరుతున్నాం.

V.C. Sajjanar, IPS

38,180 görüntüleme • 14 gün önce

SajjanarVC_IPS's profile picture

ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ వద్దు! అర్ధరాత్రి రోడ్లపైకొచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ట్యాంక్‌బండ్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద అర్ధరాత్రి వేళల్లో పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్‌లు చేయవద్దని నగర ప్రజలకు, ముఖ్యంగా యువతకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరం. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి పుట్టినరోజు నాడే ఆ పాపతో పాటు కుటుంబసభ్యుడు దుర్మరణం చెందడం ఎంతో కలిచివేసింది. ప్రమాదం జరిగిన వెంటనే మా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలపలేకపోయాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ జరుగుతున్న ప్రమాదాలపై వివిధ ప్రభుత్వ విభాగాలలో కలిసి సమగ్ర సమీక్ష నిర్వహించాం. పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నాం. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుంటాయి. అలాంటి సమయంలో చిన్నపిల్లలను వెంటేసుకుని నడిరోడ్డుపైకి రావడం ఎంతమాత్రం వివేకం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అసలు ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వేడుకలు నిర్వహించడం నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధం. గతంలోనే జీహెచ్‌ఎంసీ దీనిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మా పోలీసులు నిరంతరం పహారా కాస్తూ అక్కడికి వచ్చేవారిని పంపిస్తున్నప్పటికీ, అర్ధరాత్రి పూట మళ్లీ వచ్చి వేడుకలు చేసుకోవడం వల్లే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి. కేవలం క్షణికానందం కోసం చేసే పొరపాట్ల వల్ల అమూల్యమైన ప్రాణాలను పోగొట్టుకోవద్దు. ఇకపై ఎవరూ కూడా అర్ధరాత్రి వేళల్లో ట్యాంక్‌బండ్, చెరువులు, బహిరంగ ప్రదేశాల వద్దకు వచ్చి సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. Hyderabad Traffic Police Hyderabad City Police CP Hyderabad City Police

V.C. Sajjanar, IPS

65,985 görüntüleme • 26 gün önce

SajjanarVC_IPS's profile picture

చేస్తున్న‌దే త‌ప్పు.. అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు. ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి. ఆన్‌లైన్ బెట్టింగ్ భూతాన్ని అంత‌మొందించ‌డంలో మీ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించండి. CyberDost I4C Andhra Pradesh Police Telangana Police DGP TELANGANA POLICE PMO India गृहमंत्री कार्यालय, HMO India

V.C. Sajjanar, IPS

734,676 görüntüleme • 1 yıl önce

SajjanarVC_IPS's profile picture

చూశారా.. వస్తువులను కొనడం ఎంత సులువో!! అలా షాప్ కి వెళ్లి.. అక్కడే బెట్టింగ్ పెట్టి.. వచ్చిన లాభంతోనచ్చిన వస్తువును ఇట్టే కొనుక్కోవచ్చు అంట!! ఇంతకన్నా దిక్కుమాలినతనం ఏమైనా ఉంటుందా.. చెప్పండి!!? ఒకవైపు ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అనేక మంది ప్రాణాలను తీస్తుంటే.. తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ఇలాంటి చిత్రవిచిత్ర వేషాలు వేస్తున్నారు. మాకు ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు.. ప్రమోషన్ల పేరుతో డబ్బు కోసం ఏమైనా చేస్తామనే పెడ ధోరణి సరైంది కాదు. స్వార్థం కోసం బెట్టింగ్ పేరుతో సోషల్ మీడియాలో ఇలాంటి మాయగాళ్ళు వదిలే వీడియోలను నమ్మి.. బెట్టింగ్ కూపంలో పడకండి.

V.C. Sajjanar, IPS

774,682 görüntüleme • 1 yıl önce

SajjanarVC_IPS's profile picture

కన్నతల్లే నిస్సహాయతతో హుస్సేన్‌సాగర్‌లోకి నెట్టేసి మృత్యుఒడికి చేర్చాలని చూసిన వేళ.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆరేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, ప్రైవేట్ ఉద్యోగి బాలకృష్ణ, వ్యాపారి మహ్మద్ అఫ్సర్‌లను మనస్ఫూర్తిగా అభినందించి, సత్కరించాను. ఆపదలో ఉన్న తోటి మనుషులను చూసి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయే నేటి రోజుల్లో.. ఈ ముగ్గురు పౌరులు ప్రదర్శించిన తెగువ, సమయస్ఫూర్తి నిజమైన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమాజానికే ఆదర్శం. క్షణాల్లో స్పందించి ఒక చిన్నారికి పునర్జన్మనిచ్చిన ఈ నిజమైన హీరోల సాహసానికి నా సెల్యూట్! పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు తల్లిదండ్రులకు ఎంతటి మానసిక క్షోభను కలిగించినా.. కన్నబిడ్డల ప్రాణాలు తీయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఎంతటి కష్టమొచ్చినా అధైర్యంతో కర్కశ నిర్ణయాలు తీసుకోకండి. నైరాశ్యంలో చేతులెత్తేయకుండా సమాజ సాయం కోరండి; ఆదుకోవడానికి సమాజం ఎప్పుడూ ముందుంటుంది. లోకంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు! #HyderabadCityPolice #GoodSamaritans #Humanity #Hyderabad #SaluteToHeroes

V.C. Sajjanar, IPS

29,903 görüntüleme • 20 gün önce

SajjanarVC_IPS's profile picture

క్షణకాలపు అజాగ్రత్త జీవితకాలపు ఆవేదనకు దారితీస్తుందనడానికి ఈ సీసీటీవీ దృశ్యాలే సజీవ సాక్ష్యం. వాహనం ఆపి, ఇంజిన్ రన్ అవుతుండగానే పిల్లలను దానిపై వదిలేయడం లేదా వారు పక్కనే ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతటి పెను ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా చిన్నారులకు బైక్ ఎక్కడం ఒక సరదా, యాక్సిలరేటర్ తిప్పడం ఒక సంబురం. కానీ, వాహనం స్టార్ట్ చేసి ఉన్నప్పుడు వారు తెలియక చేసే ఆ చిన్న పొరపాటే క్షణాల్లో ఊహించని ప్రమాదంగా మారి ప్రాణాల మీదికి తెస్తుంది. కళ్లముందే నిమిషం వ్యవధిలో జరిగిపోయే ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సింది తల్లిదండ్రులే. అందుకు కనీస జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. - వాహనం నిలిపివేసిన వెంటనే ఇంజిన్ ఆపి, కీ తీసేయడం ప్రాథమిక నియమంగా మార్చుకోవాలి. - ఇంజిన్ ఆన్‌లో ఉన్న టూ-వీలర్‌పై చిన్నారులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒంటరిగా కూర్చోబెట్టకూడదు. - ముఖ్యంగా పిల్లల చేతులు యాక్సిలరేటర్‌కు అందేలా వాహనాల ముందు భాగంలో నిలబెట్టడం అత్యంత ప్రమాదకరమని గ్రహించాలి. చిన్న నిర్లక్ష్యంతో వారి సంబురాన్ని విషాదంగా మార్చకూడదు. సురక్షిత ప్రయాణం బాధ్యతాయుత ప్రవర్తనతోనే సాధ్యమవుతుందని గుర్తిస్తూ అందరూ ట్రాఫిక్ నియమాలను, భద్రతా ప్రమాణాలను పాటించాలి. Hyderabad Traffic Police Hyderabad City Police CP Hyderabad City Police MORTHRoadSafety MORTHINDIA

V.C. Sajjanar, IPS

133,494 görüntüleme • 3 ay önce

SajjanarVC_IPS's profile picture

చూశారా.. వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడమే ఒక్కటే మార్గమట. మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్. ఎందరో బెట్టింగ్ కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా!? యూట్యూబ్ లో వ్యూస్ తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ ని మోసం చేస్తారా!? వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేస్తారు.. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. Video Credit: Vedhaan Media #SayNoToBettingApps CyberDost I4C PMO India गृहमंत्री कार्यालय, HMO India

V.C. Sajjanar, IPS

419,266 görüntüleme • 1 yıl önce

SajjanarVC_IPS's profile picture

వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా!? వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!? చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు — క్షమార్హం.. చట్టరీత్యా నేరం!! ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి. When values fade in the illusion of views—what are we becoming!? How justifiable is it to risk the future of children merely to gain *views* and *likes* on social media? By creating indecent content with minors, what message are you really sending to society? Instead, interview and highlight people who inspire youth and children—those who can truly contribute to the progress of society. Don’t divert children’s minds by making such inappropriate videos with them. Remember—this is not just a violation of children's rights, it is *inexcusable* and *a punishable offense under the law*! Such actions amount to violations under the POCSO Act and the Juvenile Justice Act. Involving minors in such content constitutes *child exploitation*. The Police Department will take strict action against anyone involved in producing or uploading such content with minors. Cases will be registered as per law against offenders who fail to remove such material immediately or engage in similar posts in the future. If you come across such videos on social media, report them immediately. Inform your local police station. You can also call the helpline number 1930 or file a complaint at the National Cyber Crime Portal ( As parents, your duty doesn’t end with raising children—it includes safeguarding their childhood, mental well-being, and future. Keep your children away from inappropriate content. Provide them with a positive environment and the right values.

V.C. Sajjanar, IPS

282,622 görüntüleme • 1 yıl önce

SajjanarVC_IPS's profile picture

నగర ప్రజలకు విజ్ఞప్తి! గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి నుంచి ఎంతో ప్రశాంత వాతావరణంలో, వైభవంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉత్సవాన్ని విజయవంతం చేస్తున్న ప్రజలందరికీ హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున ధన్యవాదాలు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైంది. ఈ శోభాయాత్ర నేటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. విగ్రహాల నిమజ్జనాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి మా పోలీసు, ట్రాఫిక్‌ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన మార్గాల్లో ఇప్పటికే విధించిన ట్రాఫిక్ ఆంక్షలను నేడు కూడా కొనసాగిస్తున్నాం. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ స్టాచ్యూ, ఇందిరాగాంధీ రోటరీ పరిసరాల్లో విగ్రహాల రద్దీ కారణంగా సాధారణ వాహనాలకు అనుమతి లేదు. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడమో లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధాన రహదారులపైకి వాహనాలతో వచ్చి అనవసరంగా ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడవద్దు. ట్రాఫిక్ విభాగం ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక సూచనలు, అడ్వైజరీలను గమనిస్తూ నగర ప్రజలంతా మాకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.

V.C. Sajjanar, IPS

35,916 görüntüleme • 1 ay önce

SajjanarVC_IPS's profile picture

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా గురువారం అర్ధరాత్రి వేళ 3,000 మంది సిబ్బంది, 100 బృందాలతో విస్తృతంగా చేపట్టిన ఆపరేషన్‌ కవచ్‌ నాకాబందీ తనిఖీలను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాను. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 725 వాహనాలను డిటైన్ చేసి, 48 మంది అనుమానితులను హైదరాబాద్ సిటీ పోలీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిటీలో నేరాల నియంత్రణ, అసాంఘిక శక్తుల కట్టడి కోసం రాత్రి వేళల్లో ఇలాంటి ఆకస్మిక నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నగర పౌరులంతా పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్‌ 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. #OperationKavach #HyderabadCityPolice #NightVigil #Dial112

V.C. Sajjanar, IPS

14,855 görüntüleme • 18 gün önce