
ɾąցհąѵ
@ThisIsRagh • 1,684 subscribers
విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా ♥️ backup: @thisisraghR
Videos

ఫిదా (2017)లో రేణు పెళ్లయ్యాక తిరిగి ఇంటికి వచ్చే సన్నివేశాలను దర్శకుడు "శేఖర్ కమ్ముల" చాలా అందంగా తెరకెక్కించారు... ❤️❤️ ఈ సీన్లో నన్ను బాగా ఆకట్టుకునే అంశం, కూర్చొని ఉన్న నాన్న పాత్రను కెమెరా పైనుంచి నెమ్మదిగా క్రిందికి పాన్ చేస్తూ, ఆయనలోని బాధను చూపించిన తీరు. 🥹 అప్పుడు వచ్చే సంగీతం (0:41 కి ప్రారంభం అవుతుంది)... మరో హైలైట్ ❤️
ɾąցհąѵ185,822 görüntüleme • 1 ay önce

ఈ పాట చాలా బాగుంటుంది.. కానీ నాకు పల్లవికి అర్ధం అర్ధం కాదు.. అబద్ధపు సాహిత్యాన్ని అలా ఉంచేశారేమో అని ఒక అనుమానం.. 🧐 నర్మదా నది తీరంలో నవ మన్మధా అనుకుంటా గౌతమీ నది తీరంలో సుఖవీణలొ చలి గంటా -- చిత్రం : రధసారధి (1993) సంగీతం : రాజ్ కోటి సాహిత్యం : వేటూరి గానం : బాలు - చిత్ర -- #RaghavMuzix
ɾąցհąѵ183,862 görüntüleme • 1 ay önce
0:20
Sensitive content
This media may contain sensitive content.

చిత్రీకరణ విషయాన్ని ప్రక్కనపెడితే, ఈ పాటలో మంచి రిథం ఉంది, మంచి మెలోడీ కూడా ఉంది.. సాంగ్ బెస్ట్ పార్ట్.... "If you wanna do ఏదైనా కొంచెం Ticky ticky ticky ticky clock goes round Tickey ticky fun goes on Ticky ticky ticky ticky come along When everybody is going round and round" -- Movie: Anukokunda Oka Roju (2005) Music Director: M.M. Keeravani Singers: Sunidhi Chauhan and Dominique Cerejo Lyricists: M.M. Keeravani and Ganga Raju -- #RaghavMuzix
ɾąցհąѵ48,653 görüntüleme • 1 ay önce

ఠాగూర్ (2003) తమిళంలో విజయవంతమైన రమణ చిత్రానికి ఆధారంగా తెరకెక్కింది. తమిళ వెర్షన్లో లేని కొన్ని పాత్రలను తెలుగులో వినోదం కోసం అదనంగా చేర్చారు. అలాంటి పాత్రల్లో రమాప్రభ గారు పోషించిన బామ్మ పాత్ర కూడా ఒకటి. అయితే ఆ పాత్రను డబ్బు మీద అత్యాశ ఉన్న, ప్రతి విషయానికీ చాదస్తం చూపించే ముసలావిడగా తీర్చిదిద్దారు. చివరికి ఆమె పాత్ర కూడా పూర్తిగా వినోదానికే పరిమితమై, అదే తరహాలో ముగుస్తుంది. సినిమా చూసినప్పుడు నాకు మాత్రం ఒక ఆలోచన వచ్చింది. ఆ వినోదపు పాత్రను ముందుగానే ముగించకుండా, నందు (జ్యోతిక), బాబు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆమెను రక్షించేందుకు బామ్మ ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో తాను కూడా ప్రాణాలు కోల్పోయేలా చూపించి ఉంటే ఎలా ఉండేదో అనిపించింది. అలా చేస్తే అప్పటివరకు కేవలం నవ్వులు పంచిన పాత్ర ఒక్కసారిగా భావోద్వేగాన్ని పండించేది. ప్రేక్షకుల దృష్టిలో ఆ పాత్రకు ఒక కొత్త అర్థం వచ్చేది. అంతేకాదు, సినిమాకు మరింత ఎమోషనల్ వెయిట్ వచ్చి, బామ్మ పాత్రకు కూడా మంచి పే-ఆఫ్ దొరికేది అనిపించింది.
ɾąցհąѵ58,647 görüntüleme • 2 ay önce

ఇది చిరంజీవితో మణిశర్మ చేసిన తొలి సినిమా. సంగీత దర్శకుడిగా ఆయనకు నాలుగో సినిమా. (*'అంతం'*లో ఒక పాట, *'ప్రేమించుకుందాం రా'*లో కొన్ని పాటలకు పాక్షికంగా పనిచేసిన సినిమాలను కలుపుకుని.) పూర్తి స్థాయిలో సంగీతం అందించిన రెండో సినిమా. స్టార్ హీరో సినిమాకు పూర్తి స్థాయి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం. మణిశర్మ పాటల్లో ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ ఉంటుంది. పాట మధ్యలో ఒక్కసారిగా వచ్చే ఉత్సాహభరితమైన బీట్, ఎనర్జీని అమాంతం పెంచేసే చిన్న "హుషారు" సెక్షన్. అది ఆయన సంగీతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ పాటలో అలాంటి హైలైట్ ఇదే... "తాగించాలా బిస్లేరి ఏయ్... తీపించాలా క్యాడ్బరి అందించాలా స్ట్రాబెర్రీ కొంచెం మారాలి నీ వైఖరి!" -- పాట: సారీ సారీ చిత్రం : బావగారు బాగున్నారా (1998) సంగీతం: మణి శర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం : మనో, సుజాత -- #RaghavMuzix
ɾąցհąѵ40,423 görüntüleme • 2 ay önce

1998లో వచ్చిన "శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి" సినిమాలో కీరవాణి స్వరపరచిన "నీ ఊహల్లో ఏకాంతం" అనే పాట ఉంది. ఆ పాట విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. కానీ ఆ ట్యూన్ ఎప్పుడో, ఎక్కడో విన్నాను, బహుశా MTVలో. చాలా కాలం అది బ్రియాన్ ఆడమ్స్ పాటేమో అనుకుంటూ వెతికాను కూడా. కానీ ఆల్బమ్ గుర్తు లేదు, పాట పేరు తెలియదు, ఒక్క లిరిక్ కూడా గుర్తు లేదు... గుర్తున్నది కేవలం ఆ ట్యూన్ మాత్రమే! అలా సంవత్సరాల తరబడి రాండమ్‌గా వెతుకుతూనే ఉన్నాను. సరిగ్గా పది నెలల క్రితం, ఒకరోజు యాదృచ్ఛికంగా Kool 104 FM వింటుంటే... ఒక్కసారిగా ఆ సాంగ్ వినిపించింది! ఈసారి మాత్రం పాటలోని లిరిక్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను. వెంటనే వెతికితే తెలిసింది... అది Boyzone పాడిన "Words"! ఎన్నో సంవత్సరాలుగా పేరు తెలియకుండా, కేవలం ఒక ట్యూన్ జ్ఞాపకంతో వెతుకుతున్న పాటను అలా అనుకోకుండా ఒక FM స్టేషన్లో కనుక్కోవడం చక్కని అనుభూతి! ❤️ "Smile, an everlasting smile, a smile can bring you near to me..." ❤️ అదే ట్యూన్‌కు సిరివెన్నెల మాటలు జతకలిస్తే... "నీ ఊహల్లో ఏకాంతం నేనంటూ లేనందీ ఏది ఎటు, నా ప్రాణం ఏమైంది అనే ఈ దేహాన్ని ఎట్టా మోసేద..." ❤️ Credits : ---- Song: Words Band: Boyzone Album: A Different Beat (1996) Writers: Barry Gibb, Robin Gibb, Maurice Gibb ======= Movie: శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి (1998) Song: నీ ఊహల్లో ఏకాంతం Music: ఎం.ఎం. కీరవాణి Singers: ఎం.ఎం. కీరవాణి, సురేష్ పీటర్స్, సునీత Lyrics: సిరివెన్నెల సీతారామశాస్త్రి ---- #RaghavMuzix
ɾąցհąѵ27,101 görüntüleme • 2 ay önce

గోదావరి (2006) పాటల రికార్డింగ్ సమయంలో జరిగిన ఒక అందమైన సంఘటన ఇది. బాలు గారి దగ్గర నుంచి వేటూరి గారికి ఫోన్ వచ్చింది. కానీ వేటూరి గారు ఆన్సర్ చేయలేదు. బాలు గారు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి వేటూరి గారి సహాయకుడికి ఫోన్ చేసి, “ఏమయ్యా, ఆయనకి ఏమయ్యింది? కాల్ చేసినా ఆన్సర్ చేయడం లేదు” అని అడిగారట. అప్పుడు వేటూరి గారు సహాయకుడి (ఈ సంఘటన చెప్పింది ఆయనే)తో, “కాల్ ఎందుకు ఆన్సర్ చేశావు? నేను బాలుకి ఎనభై వేలు ఇవ్వాలి. అందుకే చేస్తున్నాడు” అన్నారట. అది విన్న బాలు గారు, “ఎనభై వేలా? వాటి గురించి కాదండీ. మీరు ఇవ్వకపోయినా పర్లేదు. మీరు రాసిన ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట పాడుతున్నాను. మీ సాహిత్యం వింటుంటే నా కళ్లలో నీళ్లు ఆగడం లేదు. ఆ ఆనందాన్ని మీతో పంచుకుందామని కాల్ చేశాను” అన్నారట. సాహిత్యానికి గాయకుడు ఇచ్చే ఇంతకంటే గొప్ప నివాళి ఏముంటుంది! వేటూరి గారి కలం నుంచి జాలువారిన పదాలు బాలు గారి గొంతులో ప్రాణం పోసుకుని, ఆయన్నే కదిలించాయి. ❤️ "వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి" -- పాట : ఉప్పొంగెలే గోదావరి సాహిత్యం - వేటూరి చిత్రం - గోదావరి (2006) సంగీతం: కె. ఎం. రాధాకృష్ణన్ గానం: ఎస్. పి. బాలు -- #RaghavMuzix
ɾąցհąѵ17,257 görüntüleme • 1 ay önce

స్టార్ హీరోల సినిమాల్లో సాధారణంగా కథానాయకుడు ఎవరో ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వారిని రక్షించే ఫైట్ సీన్ ద్వారా మొదటిసారి తెరపై కనిపిస్తాడు. ఈ పరిచయ విధానం ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులకు అలవాటైన ఒక పద్దతిగా మారింది. అయితే, ఆ మూసను బద్దలు కొట్టి 1994లో దర్శకుడు ముప్పలనేని శివ తెరకెక్కించిన ఘరానా అల్లుడు భిన్నంగా చూపించింది. ఇందులో కృష్ణ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో కథానాయకుడు తన పెళ్లి చూపుల కోసం హీరోయిన్ ను చూడటం కోసం వస్తూ ఉంటాడు. ఆ సమయంలో పెళ్లి చూపుల కోసం పంపించిన అతని ఫోటో కథానాయిక చేతికి చేరుతుంది. ఆ ఫోటోను చూసిన కథానాయిక అతని ఊహల్లో విహరిస్తూ ఒక డ్రీమ్ సాంగ్‌లోకి వెళ్లిపోతుంది. విశేషమేమిటంటే, ఆ డ్రీమ్ సాంగ్‌లోనే కథానాయకుడు తొలిసారిగా తెరపై కనిపిస్తాడు. అంటే, ఫైట్ సీన్ లేదా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ఎంట్రీకి బదులుగా, కథానాయిక ఊహల్లో వచ్చే రొమాంటిక్ పాట ద్వారా హీరోను పరిచయం చేయడం ఆ కాలంలో చాలా అరుదైన ప్రయోగంగా చెప్పవచ్చు. దీంతో ఘరానా అల్లుడు హీరో పరిచయ సన్నివేశం ప్రత్యేకంగా నిలిచిపోయింది. -- పాట: కొంగే జారిపోతుంది అమ్మమ్మో సినిమా: ఘరానా అల్లుడు (1994) దర్శకుడు: ముప్పలనేని శివ గాయకులు: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: వెన్నెలకంటి -- #RaghavMuzix
ɾąցհąѵ29,503 görüntüleme • 4 ay önce

7/జీ బృందావన్ కాలనీ(2004).. "తలచి తలచి" పాటకి రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆమె పాడేది... మరొకటి అతను పాడేది. అతను పాడే వెర్షన్లో, "నీకై నేను బ్రతికే ఉంటిని" అంటే... నువ్వు ఈ లోకంలో లేకపోయినా, నీ మధుర జ్ఞాపకాల కోసం నేను ఇంకా బ్రతికే ఉన్నాను అనే భావం.... ఆమె పాడే వెర్షన్లో, "నీకై నేను బ్రతికే ఉంటిని" అంటే... నేను ఈ లోకంలో లేకపోయినా, నీ ఊహల్లో, నీ జ్ఞాపకాలలో నీ కోసమే ఇంకా బ్రతికే ఉన్నాను అనే భావం.... #RaghavMuzix
ɾąցհąѵ20,974 görüntüleme • 4 ay önce
Daha fazla içerik yok.