
Harish Rao Thanneeru
@BRSHarish • 1,406,996 subscribers
Former Minister | MLA from Siddipet | BRS Party | Telangana State.
Shorts
Videos

Congratulated and felicitated actor Priyadarshi Pulikonda From Balagam and Mallesham to portraying KCR garu as MLA Shankaranna in #TheParadise his mannerisms, dialect, and screen presence are remarkable. “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!” Congratulations to the entire #TheParadise Movie Srikanth Odela , Nani and everyone involved. Wishing you many more memorable films and greater success ahead, Darshi. All the very best for your future endeavours!
Harish Rao Thanneeru205,949 次观看 • 1 个月前

మల్లన్న సాగర్ కూల్చాలని కుట్ర చేస్తున్నారా ? కట్టపక్కనే అనధికారికంగా ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండా డైరెక్ట్‌గా జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్టింగ్ ఎలా చేస్తారు ? మేడిగడ్డను చేసినట్లు ఈ ప్రాజెక్ట్ ను దెబ్బతీయాలని చేస్తున్నారా ? #CongressFailedTelangana
Harish Rao Thanneeru42,832 次观看 • 9 天前

లక్షల క్యూసెక్కుల గోదావరి వరద వృథాగా పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది. పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా వాడకుండా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి.. సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతున్న ముఖ్యమంత్రి Revanth Reddy అసమర్థత ఇది. తెలంగాణ రైతుల కడుపు కొట్టి, మన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్న రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం. #CongressFailedTelangana #CongressBetrayedFarmers
Harish Rao Thanneeru176,230 次观看 • 3 个月前

విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తారా Revanth Reddy .? ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు? ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే.. ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే లాఠీలు.. హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా? విద్యార్థులన్నా.. నిరుద్యోగులన్నా ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి? వెంటనే పోలీసు దమనకాండను ఆపాలి. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించడంతో పాటు, మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించిన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని DGP TELANGANA POLICE డిమాండ్ చేస్తున్నాం.
Harish Rao Thanneeru77,591 次观看 • 2 个月前

ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రం ఇచ్చినందుకు విద్యార్థి, నిరుద్యోగులను అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఒకే రోజు SSC, TGPSC AEE పరీక్షలు ఉండటంతో నష్టపోతున్నామని, AEE పరీక్ష వాయిదా వేయాలని కోరడమే వారు చేసిన తప్పా Revanth Reddy ? మీ పంతాలు, పట్టింపుల కంటే నిరుద్యోగుల భవిష్యత్తే ముఖ్యం. భేషజాలకు పోయి విద్యార్థుల జీవితాలతో ఆడుకోకండి. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, AEE పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. DGP TELANGANA POLICE
Harish Rao Thanneeru15,707 次观看 • 14 天前

రేవంత్ రెడ్డి... మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావొచ్చు. కానీ నాది కాదు. 20 ఏళ్ల నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ల నా రాజకీయ చరిత్ర నే దానికి నిదర్శనం. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైంది? రాష్ట్రం సంగతి పక్కన పెడదాం... కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా? సమాధానం చెప్పగలవా? ఒకవైపు "చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం" అంటూ.. మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు? కన్నెపల్లి నుండి నీళ్ళు లిఫ్ట్ చేయని నీ చేతగాని తనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటం హీనమైన చర్య. 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు చెక్కు చెదరలేదు. లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారు. కన్నెపల్లి పంపు హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? రిటైర్డ్ ఇంజనీర్ల సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కే లేదా? ఆనాటి రోజులు తెస్తానన్న Revanth Reddy ..మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గం. తెలంగాణ జలాలను తన గురువు చంద్రబాబుకు కప్పం కడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి తెలంగాణకు శాపంగా, ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారింది. ఒక వైపు ఎల్ నినో ప్రభావం ఉన్నా తెలంగాణలో గోదావరి జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. అయినా ఆ నీటిని ఒడిసిపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్న రేవంత్ సర్కారు తెలంగాణకు జలద్రోహం చేస్తోంది. ఎల్‌నినో కరువు హెచ్చరికలు, రిటైర్డ్ ఇంజినీర్ల సూచనలు పక్కనబెట్టి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద లక్ష క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా పంపులు ఆన్ చేయకుండా నీటిని దిగువకు వదిలేయడం తెలంగాణ రైతాంగానికి రేవంత్ చేస్తున్న నమ్మక ద్రోహం. ఇది రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ అసలు వైఖరికి నిదర్శనం. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న పంపులు సిద్ధంగా ఉన్నా కావాలనే ఆన్ చేయకపోవడం క్షమించరాని నిర్లక్ష్యం. నీళ్లు ఉండి కూడా వాడుకోకపోవడం కంటే పెద్ద వైఫల్యం ఇంకేముంటుంది? తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నది. నిరంతరాయంగా పట్టిసీమ పంపులు పనిచేస్తూ మొత్తం 24 మోటార్లను ఫుల్ రన్లో ఉంచి గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తుంటే, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం పంపులు ఆన్ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం సిగ్గుచేటు. ఒక్కో పట్టిసీమ మోటారు 4 మెగావాట్ల విద్యుత్ వినియోగిస్తూ నీటిని ఎత్తిపోస్తుంటే, తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటి? కళ్ల ముందే నీరు ఏపీకి తరలివెళ్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చొంటున్నది? తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నట్లు? గురుదక్షిణ చెల్లింపులో భాగంగానే కన్నెపల్లి పంపులను ఆన్ చేయకుండా తెలంగాణ జలాలను ఏపీకి వదులుతున్నారా? దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి? ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20.18 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 5.48 టీఎంసీలే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 3.32 టీఎంసీల స్థాయికి చేరువలో ఉన్నా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదు. ఇది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. ఎల్లంపల్లి స్టేజ్ 1 & 2 ఆయకట్టుకు 12 tmc, కడెం లిఫ్ట్ స్కీమ్ కోసం 3 tmc, మంథని, రామగుండం సాగునీటి అవసరాల కోసం 2tmc, రామగుండం STPP కోసం 6.50 tmc, NTPC కోసం 4.73 tmc మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరం కోసం 13.67 tmc, తాగునీటి సరఫరా, మిషన్ భగీరథ కోసం 6.57 tmc, హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం 10 tmc కేటాయింపులు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరిన నీటి నిల్వతో ఈ అవసరాలను ప్రభుత్వం ఎలా తీర్చుతుంది? హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడితే దానికి బాధ్యులు ఎవరు? 1/2
Harish Rao Thanneeru93,719 次观看 • 3 个月前

రేవంత్ రెడ్డి మీ సొంత ఇలాకాలోనే రైతుల రాస్తారోకో.. ఇది మీ పాలనా వైఫల్యానికి నిలువుటద్దం. Revanth Reddy మీ సొంత ఊరు నుండే కౌంట్ డౌన్ మొదలయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక రైతులకు 6 నుంచి 8 గంటల కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వలేని దుస్థితికి చేరింది. నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నాకు దిగడం, ట్రాక్టర్లతో రాస్తారోకో చేయడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. పంటలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు.. కానీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేకపోవడం దుర్మార్గం. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు 24 గంటల కరెంట్ హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులకు 6–8 గంటల విద్యుత్ కూడా సరఫరా చేయకపోవడం శోచనీయం. రైతులకి అండగా నిలవాల్సిన ప్రభుత్వం, వారి గోడును పట్టించుకోకుండా చోద్యం చూడడం విడ్డూరం. ముఖ్యమంత్రి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే రైతులు కరెంట్ కోసం జాతీయ రహదారిపైకి రావాల్సి పరిస్థితి వస్తే దాన్ని ‘ప్రజా పాలన’ అంటారా? సొంత ఇలాకాలోని రైతుల సమస్యలే పరిష్కరించలేని సీఎం , తెలంగాణలోని లక్షలాది మంది రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? ఇదేనా కాంగ్రెస్ తెచ్చిన ‘మార్పు’ . రైతుల ఆక్రందన రేవంత్ రెడ్డికి వినిపించడం లేదా ?? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడి రైతుల పొలాలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. #CongressFailedTelangana #CongressBetrayedFarmers
Harish Rao Thanneeru46,637 次观看 • 1 个月前

నమ్మినోళ్లను నట్టేట ముంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మించినోళ్లు లేరు. కళాకారులను కూడా దగా చేసిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది. అధికారంలోకి రావడానికి 1000 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచినా ఆ హామీ అమలు కాలేదు. కడుపు మండిన కళాకారులు నిలదీస్తే.. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ముఖ్యమంత్రి Revanth Reddy , మంత్రులు ఎన్నాళ్లు ఇలా తప్పించుకు తిరుగుతారు? డైవర్షన్ రాజకీయాలు.. ఊక దంపుడు డైలాగులతో ఇంకెన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారు రేవంత్ రెడ్డి?. కళాకారుల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. కళాకారుల జీవితాలతో చెలగాటమాడటం మాని.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. Telangana CMO
Harish Rao Thanneeru31,159 次观看 • 1 个月前

రేవంత్ రెడ్డి.. నాకు మంత్రి పదవి ఎవరి భిక్ష వల్లనో రాలేదు. శ్రీమతి సోనియా గాంధీ గారి కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాము తప్ప పదవుల కోసం కాదు. నాకు మంత్రి పదవి వచ్చినపుడు టీ ఆర్ ఎస్ లోనే ఉన్నావ్.. ఆ ఊరేగింపులోనూ ఉన్నావు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా నా వెనకే ఉన్నావ్, నిక్కి నిక్కి చూశావ్. ఇదంతా నీ కళ్ల ముందు జరిగిందే. కానీ ఇవేమి తెలియనట్లు చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నావు. పదవులు, విలువల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో పదవులను గడ్డి పోచలుగా త్యజించిన చరిత్ర మాది. పూటకో పార్టీ మారిన రాజకీయ చరిత్ర నీది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర నీది. ముఖ్యమంత్రి అయినప్పటికీ హుందాగా ప్రవర్తించడం లేదు. చీఫ్ మినిస్టర్ గా కాకుండా, చిల్లరగా మాట్లాడే చీప్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నావు. #CheapMinister
Harish Rao Thanneeru443,298 次观看 • 2 年前

మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు. నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై CI దౌర్జన్యం. Revanth Reddy అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా? ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం.. ప్రజలపై పోలీసులతో జులుం.. ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులు.. హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన? DGP TELANGANA POLICE గారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
Harish Rao Thanneeru45,270 次观看 • 2 个月前

నిరసన తెలియజేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులను కలుస్తామంటే పోలీసు నిర్బంధాలు.. పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసి సంఘీభావం తెలుపుతామంటే అరెస్టులు.. ఏడో గ్యారెంటీ “ప్రజాస్వామ్యం” అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి .. మీరు ఇప్పుడు చేస్తున్నదేంటి? ప్రతిపక్షాల గొంతు నొక్కడం.. ప్రజల హక్కులను కాలరాయడం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూడటం మూర్ఖత్వం. నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు.. అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు.
Harish Rao Thanneeru41,967 次观看 • 2 个月前

తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంది. మరోవైపు.. ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో.. నాకు తెలియదు.. నా ప్రమేయం లేదు.. నా దగ్గరికి ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చేతులెత్తేస్తారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరు.. సాక్షాత్తు ఒక క్యాబినెట్ మంత్రికి తెలియకుండానే.. ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే.. అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. Revanth Reddy గారు.. అసలు మీరు నడుపుతున్నది సర్కారా.. లేక సర్కస్ కంపెనీనా... టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా.. ఈ ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయం. ఒక వైపు అసెంబ్లీ సాక్షిగా సొంత డబ్బా.. మరొక వైపు క్షేత్రస్థాయిలో అడ్డగోలు నిర్ణయాలు. చెప్పేదొకటి, చేసేది మరొకటి..పేపర్లలో కలరింగ్ ఇచ్చేది ఇంకొకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని మైకు పట్టుకొని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్.. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారు.ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని మాకు తెలుసు.. కానీ సినిమా టికెట్ల విషయంలో కూడా ఇంత నిస్సిగ్గుగా సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా.. ఇక సినిమాటోగ్రఫీ మంత్రి Komatireddy Venkat Reddy గారి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఒక పక్క హోం శాఖ జీవో ఇస్తుంది.. సినిమా మంత్రి ఏమో నాకు సంబంధం లేదు, నా దగ్గరికి ఎవరూ రాలేదు అంటారు. ఐటీ మంత్రిని నేనే సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇపుడు ఉన్న శాఖ తో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారు ? టిక్కెట్ల రేటు పెంపు సీఎం నిర్ణయమేనని కొమటి రెడ్డి చెప్పకనే చెపుతున్నారు అంటే, తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా.. సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయంటే.. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు.. తెర వెనుక ఏ రాజ్యాంగేతర శక్తి ఉంది.. ఒక సినిమా రిలీజ్ సమయంలో దుర్ఘటన జరిగినప్పుడు నీతులు చెప్పారు.. ఇప్పుడేమో యథేచ్ఛగా రేట్లు పెంచుతున్నారు. మంత్రికి తెలియకుండా పాలన సాగడమేనా మీ ప్రజా పాలన అంటే.. అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా? ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు.. ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఇస్తారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారు. మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు. ఇప్పుడు మీకు నచ్చినోళ్లు అయితే.. రూ. 600 టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా.. వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా. రేవంత్ రెడ్డి గారు.. పాలకుడు అనేవాడు పాలసీ తో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదు. గత పదేళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఎక్కడా వివక్ష చూపలేదు. అందుకే ఇవాళ తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ప్రపంచం గర్వించేలా మన సినిమాలు తయారవుతున్నాయి. 50, 60 ఏళ్లుగా ఎంతోమంది కష్టపడి నిర్మించుకున్న ఈ పరిశ్రమ వాతావరణాన్ని.. మీ అహంకారంతో, మీ పిచ్చి చేష్టలతో, మీ పగ ప్రతీకారాలతో, మీ చిల్లర రాజకీయాలతో నాశనం చేస్తున్నారు. ప్రభుత్వమంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి చుట్టం .. మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది మీ పాపిష్టి పాలన కు పరాకాష్ట. మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో?.. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ గారు దృష్టి సారించాలని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని BRS Party పక్షాన డిమాండ్ చేస్తున్నాం. Telangana CMO #CongressFailedTelangana
Harish Rao Thanneeru135,432 次观看 • 10 个月前

మాట్లాడితే Harvard–Stanford–Oxford వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల గురించి గొప్పలు చెప్పుకునే Revanth Reddy మీ పాలనలో తెలంగాణ గురుకులాల్లో పిల్లలకు యూనిఫాంలు లేవు, సాక్సులు లేవు, బెల్టులు లేవు.. కనీసం తాగునీరు కూడా లేదు. శిథిలావస్థలోని భవనాల్లో ఎప్పుడు కూలిపోతాయో తెలియక బిక్కుబిక్కుమంటూ భయంతో చదువుకోవాల్సిన దుస్థితి. సిర్పూర్ కాగజ్ నగర్ ఆశ్రమ గురుకుల పాఠశాల పిల్లల మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతోంది. ఇదేనా మీ “ప్రపంచ స్థాయి విద్య”? విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. దీనికి ఏం సమాధానం చెబుతారు? #CongressFailedTelangana #CongressBetrayedTelangana
Harish Rao Thanneeru36,367 次观看 • 2 个月前

