
Akula Srivani - Lady Singham
@akula_srivani • 23,190 subscribers
Lady Singham | Public Servant | Nation Above All • People at the Core • Service with Courage Staunch follower of RSS ideology and a committed BJP Karyakarta
Shorts
Videos

బషీర్‌బాగ్… అసలు ఆ బషీర్ ఎవరు? సమాజానికి ఆయన చేసిన సేవ ఏమిటి? ఈ రోజు నుంచి దీన్ని “శ్రీరామ్ చౌక్” అని పిలుద్దాం. ఆ పేరును మనమే ప్రచారం చేసి, వాడుకలోకి తీసుకురావాలి! బీఆర్ఎస్, కాంగ్రెస్, సోకాల్డ్ సెక్యులర్లకు శ్రీరాముడి పేరు పలకడానికి అభ్యంతరం ఎందుకు? ఎవరో హర్ట్ అవుతారని ఆలోచించే వాళ్లకు హిందువుల మనోభావాలు మాత్రం పట్టవా? మన విశ్వాసాలంటే అంత చులకనా? శ్రీరామ్ చౌక్ అనే పేరును ప్రజల్లోకి తీసుకెళ్దాం. అలాగే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చాలన్న ఆకాంక్షను బలంగా వినిపిద్దాం! జై శ్రీరామ్! 🚩
Akula Srivani - Lady Singham57,033 görüntüleme • 1 gün önce

“Hey Siri, Ram Ram” — no response. “Hey Siri, Jai Shri Ram” — no response. “Hey Siri, Assalamualaikum” — Siri responds. This is what I experienced on iPhone. Apple should look into it and make sure Siri responds respectfully to greetings from every faith. Equal respect should be built into the technology we use every day. #iphone
Akula Srivani - Lady Singham989,808 görüntüleme • 28 gün önce

Ram Ram is a greeting. Radhe Radhe is a greeting. Jai Shri Ram is a greeting. As-salaam alaikum is a greeting. All four are greetings, and all deserve equal recognition and respect. Some people claim that the first three are not greetings. The fact is that millions of people use them to greet one another every day. Anyone with doubts can cross-check on Google or ask ChatGPT. When we tested Siri, it responded to “As-salaam alaikum” but did not respond to “Ram Ram,” “Radhe Radhe,” or “Jai Shri Ram.” We hope Apple takes note of this and makes the necessary corrections in an upcoming update. Every greeting deserves equal respect. Every culture deserves equal recognition. Every voice deserves to be heard. #iphone
Akula Srivani - Lady Singham298,234 görüntüleme • 26 gün önce

🚨 ఓపెన్ ప్లాట్ ఓనర్లకు నా స్ట్రాంగ్ వార్నింగ్! మీ భూమి మీది… కానీ మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను! ప్లాట్ కొనుక్కొని ఎక్కడో నివసిస్తూ, ఇక్కడ ఖాళీగా వదిలేస్తే అది చెత్తకుప్పగా, డంప్‌యార్డ్‌గా, పాములు–ఎలుకలకు అడ్డాగా, రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతోంది. ఇక నుంచి ఇది నడవదు! మీకు ఓపెన్ ప్లాట్ ఉందా? వెంటనే క్లీన్ చేయించుకోండి. గోడ కట్టించుకోండి. గేట్ పెట్టించుకోండి. మీ ప్రాపర్టీ బాధ్యత మీరు తీసుకోండి. లేకపోతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి నోటీసులు ఇప్పించి, చట్టప్రకారం చర్యలు తీసుకునే వరకు నేను వెనక్కి తగ్గను. తర్వాత వచ్చి— “అయ్యో నా భూమి క్లీన్ చేశారు… నా భూమిని కబ్జా చేస్తున్నారు…” అంటూ హడావిడి చేయకండి! మీ భూమి మాకు అవసరం లేదు. మీ భూమిని కబ్జా చేయడం మా ఉద్దేశం కాదు. మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటమే మా ఉద్దేశం! చెత్తకుప్పలుగా మారిన ప్రదేశాలను చట్టపరమైన ప్రక్రియతో శుభ్రం చేయించి, అవకాశం ఉంటే— ❤️ “LITTLE GROUND FOR LITTLE HEARTS” పిల్లలకు ఉపయోగపడే ప్రదేశాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తాం. ఇది విజ్ఞప్తి కాదు… హెచ్చరిక! మీ ప్లాట్‌ను మీరే క్లీన్ చేసుకోండి. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. లేకపోతే చర్యలకు సిద్ధంగా ఉండండి! 🔥 ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ లేదు! ప్రజల భద్రత విషయంలో రాజీ లేదు! నిర్లక్ష్యాన్ని ఇక సహించేది లేదు! ఆకుల శ్రీవాణి హెచ్చరిస్తోంది — Lady Singham is watching! 🔥
Akula Srivani - Lady Singham125,837 görüntüleme • 1 ay önce

9 రోజులు పూజించిన గణనాథుడికి కనీసం 9 గంటల గౌరవం కూడా ఇవ్వరా? హిందువులంటే ఎందుకంత చులకన? నిమజ్జనం చేసిన వెంటనే విగ్రహాలను హడావిడిగా బయటకు తీసి DCMలలో పడేయడం ఏంటి? సరైన ప్రణాళికతో విగ్రహాలను ఒకదానిపై మరొకటి పడకుండా, దూరంగా నిమజ్జనం చేయవచ్చు కదా! కానీ మీరు చేయరు. ఎందుకంటే మా మనోభావాలంటే మీకు చులకన! తెలివిలేని మీ ప్రభుత్వానికి, అధికారులకు ప్రణాళిక రూపొందించడం చేతకాకపోతే నిపుణులను అడగండి. కనీసం ChatGPTని అడిగినా చెబుతుంది! చెరువుల ప్రక్షాళన జరగాలి! గణనాథుడి గౌరవమూ నిలబడాలి! ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి, సరైన ప్రణాళికతో హిందువుల మనోభావాలను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నాను!
Akula Srivani - Lady Singham74,623 görüntüleme • 1 ay önce

ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనా ప్రజాపాలన? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారి పిలుపు మేరకు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. విద్యార్థుల కోసం పోరాడటం నేరమా? విద్యార్థుల భవిష్యత్తు కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తుంటే, ఈరోజు ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించింది. మమ్మల్ని అరెస్ట్ చేయగలరు… కానీ విద్యార్థుల గొంతును అరెస్ట్ చేయలేరు! మా పోరాటాన్ని ఆపలేరు! ఈరోజు తెలంగాణలో ఒక తల్లిదండ్రి తన బిడ్డను చదివించుకోవడానికి పడుతున్న బాధను మాటల్లో వర్ణించలేం. ఆస్తులు అమ్ముకుంటున్నారు… పుస్తెల తాళ్లు తాకట్టు పెడుతున్నారు… బంగారం అమ్ముకుంటున్నారు… అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నారు! ఎందుకంటే— నా బిడ్డ చదువుకుంటే వాడికి బంగారు భవిష్యత్తు వస్తది… మా కుటుంబానికి బంగారు భవిష్యత్తు వస్తది… తెలంగాణకు బంగారు భవిష్యత్తు వస్తది అని ప్రతి తల్లిదండ్రి ఆశపడుతున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే… ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను నెరవేర్చడం పక్కన పెడితే కనీసం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చింది. పేదోడి బిడ్డ చదువుకోవడం ఈ ప్రభుత్వానికి భారమైందా? ఒక్క విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోతే అది ఒక్క విద్యార్థి నష్టం కాదు. ఒక కుటుంబం భవిష్యత్తు ఆగిపోతది… తెలంగాణ భవిష్యత్తు ఆగిపోతది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ, విద్యాశాఖ బాధ్యత కూడా మీ దగ్గరే ఉంది. మరి సమాధానం చెప్పండి— విద్యార్థుల ఫీజులు చెల్లించలేరు… తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవలేరు… విద్యార్థులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు… వాళ్ల కోసం ప్రతిపక్షం పోరాడితే అరెస్టులు చేస్తారు… ఇదేనా మీ ప్రజాపాలన? ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాపాలన కాదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రజాపాలన. పిల్లలను చదివించలేని ప్రభుత్వం… పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవలేని ప్రభుత్వం… ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచాలని చూసే ప్రభుత్వం… అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతుంది. అందుకే మా డిమాండ్ స్పష్టం— విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి! విద్యాశాఖ బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత తీసుకోవాలి. మమ్మల్ని అరెస్ట్ చేయండి… జైళ్లలో పెట్టండి… కేసులు పెట్టండి… కానీ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటాన్ని మాత్రం ఆపలేరు! ఫీజుల బకాయిలు తీరేదాకా — విద్యార్థులకు న్యాయం జరిగేదాకా — మా పోరాటం ఆగేది లేదు!
Akula Srivani - Lady Singham54,610 görüntüleme • 1 ay önce

Educational jihad” Stay alert .. Parents, pay attention to what your children are being taught From a young age, children are being told that their beliefs are wrong, and poisonous ideas are being planted in their minds in schools. This is very dangerous. We send our children to school to learn—not to be mocked for wearing a bindi, kankanam, rakhi or mala, or for practising puja. I call on the District Collector and Education Department , school managements must answer for what is taught in their classrooms. Parents, speak to your children. Listen closely. No child should be taught that respecting their family’s traditions is something to be ashamed of.
Akula Srivani - Lady Singham26,163 görüntüleme • 25 gün önce

Diesel, Petrol , LPG are finite. India cannot depend on it forever while global wars and crises affect prices & foreign exchange. Promoting Biomass Gasifier Stoves through the initiative of MP Konda Vishweshwar Reddy is a step.. Small changes… Big patriotic 🙏 #AatmaNirbarBharat #Diesel
Akula Srivani - Lady Singham98,397 görüntüleme • 5 ay önce

మా గణేశుడు వస్తున్నడంటే ఎందుకురా అడుగడుగునా అడ్డంకులు? VIP వస్తున్నడంటే రోడ్లు ఖాళీ చేస్తరు… Green Channel పెడ్తరు… ఎందుకంటే మేము హిందువులము vote bank కాదు కదా అందుకే మా పండుగలు అన్న మా సాంప్రదాయాలు అన్న చులకన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి... మా పండగలు చేసుకోవాలి అంటే మాకు ఎన్ని కష్టాలో ..... కాలనీల చిన్న చిన్న పిల్లలు చందాలు పోగేస్తరు… యువకులు ఇంటింటికీ తిరుగుతరు… ఎవరి దగ్గర ఎంతుంటే అంత వేస్తరు… అవసరమైతే సొంత జేబుల నుంచి పెట్టుకుంటరు… ఎందుకు? మన గణేశుడిని మంచిగా పెట్టుకుందాం… మన బస్తీలో పండుగ మంచిగా చేసుకుందాం... కానీ విగ్రహం కొనడానికి పోయినప్పటి నుంచి నిమజ్జనం చేసేదాకా — ఇది వద్దు… అది వద్దు… ఇంత ఎత్తు వద్దు… ఈ దారిలో పోవద్దు… స్పీకర్ పెట్టొద్దు… సౌండ్ తగ్గించు… ఇక్కడ మండపం వద్దు… అరే… పండుగ చేసుకుంటున్నమా? లేక ప్రతి అడుగుకీ పర్మిషన్ అడుక్కుంటున్నమా? వైర్లు అడ్డం ఉంటే ముందే సరిచేయండి. రోడ్లు బాగాలేకపోతే బాగుచేయండి. చెత్త ఉంటే తీసేయండి. నిమజ్జనం రూట్ క్లియర్ చేయండి. అవి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది! మాకు ఎవరితో గొడవ అవసరం లేదు. మా పండుగ ఇంకొకరికి ఇబ్బంది కావాలని కూడా మేము కోరుకోం. కానీ మా భక్తికి గౌరవం కావాలి! మా సంప్రదాయానికి గౌరవం కావాలి! మా గణేశుడికి గౌరవం కావాలి! హిందూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన హిందూ పండుగలకు మన గణేశా విఐపి కి తీసుకొచ్చిన రోజు నుంచి నిమజ్జనం చేసే రోజు వరకు “GANESH GREEN CHANNEL ఉంటుంది... ఇది ఎవరి మీద పోరాటం కాదు… మన పండుగను గౌరవంగా జరుపుకోవాలనే ఒక భక్తుడి ఆవేదన! మన దేవుడు… మన పండుగ… మన సంస్కృతి… మన సంప్రదాయం… వీటిని కాపాడుకోవడం మన బాధ్యత! గణపతి బప్పా మోరియా!
Akula Srivani - Lady Singham29,807 görüntüleme • 1 ay önce

🚩 హిందువులు ఓటు బ్యాంకు కాదనేనా… మా పండగలంటే ఇంత చులకన? హిందువులు మీకు ఓటు బ్యాంకుగా కనిపించడం లేదనేనా… హిందువులంటే చులకన? హిందువుల పండగలంటే నిర్లక్ష్యం? ఇతర పండగలకు ముందుగానే ప్రణాళికలు వేసి, అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి అన్ని రకాల ఏర్పాట్లు చేయగలిగిన ప్రభుత్వం… ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి, గణేష్ నిమజ్జనం విషయంలో మాత్రం చివరి నిమిషం వరకు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? గణేష్ నిమజ్జనానికి సమయం దగ్గరపడుతోంది. కానీ ఇప్పటికీ సరూర్‌నగర్ చెరువు వద్ద పూర్తిస్థాయి ఏర్పాట్లు కనిపించకపోవడం అత్యంత బాధాకరం. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు — భక్తుల మనోభావాలను అర్థం చేసుకోలేని బాధ్యతారాహిత్యం. సరూర్‌నగర్ చెరువు మాకు కేవలం ఒక చెరువు కాదు! అది మా సరూర్‌నగర్ ప్రజల ఎమోషన్. అది మా చిన్ననాటి జ్ఞాపకం. అది మా భక్తి. అది మా విశ్వాసం. అది తరతరాలుగా కొనసాగుతున్న మా పండగ సంప్రదాయం. సరూర్‌నగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తమ గణనాథుడిని ఇక్కడే నిమజ్జనం చేయాలని వస్తారు. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తితో పూజించిన గణనాథుడికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలని కోరుకోవడం కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఆశ అయిపోయిందా? ఈరోజు రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో కూడా ఇదే విషయంపై సమావేశం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన గణేష్ ఉత్సవాలు–నిమజ్జన ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేను, ఆకుల శ్రీవాణి, కూడా పాల్గొని సరూర్‌నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించిన సమస్యలను, భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను, అవసరమైన ఏర్పాట్లను అధికారుల దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లాను. మా డిమాండ్ ఒక్కటే — సమావేశాలు కాగితాలకే పరిమితం కాకూడదు. హామీలు మాటలకే పరిమితం కాకూడదు. క్షేత్రస్థాయిలో పని కనిపించాలి! ఎందుకంటే… హైదరాబాద్‌లో మేము ఇప్పటికే ఒక “కాంప్రమైజ్ లైఫ్” బతుకుతున్నాం! దోమలతో కాంప్రమైజ్ అయ్యాం… చెత్తతో కాంప్రమైజ్ అయ్యాం… గుంతల రోడ్లతో కాంప్రమైజ్ అయ్యాం… డ్రైనేజీ సమస్యలతో కాంప్రమైజ్ అయ్యాం… వర్షం వస్తే నీటమునిగే రోడ్లతో కాంప్రమైజ్ అయ్యాం… వీధి కుక్కల భయంతో కాంప్రమైజ్ అయ్యాం… ట్రాఫిక్‌తో కాంప్రమైజ్ అయ్యాం… అపరిశుభ్రతతో కాంప్రమైజ్ అయ్యాం… టాక్సులు మాత్రం పూర్తిగా కడుతున్నాం… కానీ కనీస సౌకర్యాల విషయంలో ప్రతిరోజూ కాంప్రమైజ్ అవుతున్నాం! ఇన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం… కానీ ఇప్పుడు మా దేవుడి విషయంలోనూ కాంప్రమైజ్ కావాలా? మా భక్తి విషయంలోనూ కాంప్రమైజ్ కావాలా? మా పండగ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలా? లేదు… ఇక చాలు! మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మేము ప్రత్యేకమైన సౌకర్యాలు అడగడం లేదు. శుభ్రమైన నిమజ్జన ప్రదేశం, సురక్షితమైన రోడ్లు, సరైన లైటింగ్, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీరు, వైద్య–అత్యవసర సదుపాయాలు, క్రేన్లు, బారికేడ్లు, భక్తుల భద్రతకు అవసరమైన పోలీస్ బందోబస్తు — ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన కనీస బాధ్యతలు. వినాయక చవితి అకస్మాత్తుగా వచ్చిన పండగ కాదు! ప్రతి సంవత్సరం ఇదే సమయంలో వస్తుందని ప్రభుత్వానికి తెలుసు. అధికారులకు తెలుసు. సంబంధిత శాఖలకు తెలుసు. మరి ముందస్తు ప్రణాళిక ఎక్కడ? చెరువు శుభ్రత ఎక్కడ? రోడ్ల మరమ్మతులు ఎక్కడ? లైటింగ్ ఏర్పాట్లు ఎక్కడ? ట్రాఫిక్ ప్లాన్ ఎక్కడ? భక్తుల భద్రతకు కార్యాచరణ ఎక్కడ? మా ప్రశ్న చాలా సూటిగా ఉంది — హైదరాబాద్ ప్రజలు అన్నింటికీ కాంప్రమైజ్ అవుతున్నారు కాబట్టి… చివరికి మా భక్తితో కూడా కాంప్రమైజ్ అవుతారని అనుకుంటున్నారా? అది జరగదు! కాంగ్రెస్ ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. సరూర్‌నగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. భక్తులు భయంతో కాదు — భక్తితో రావాలి. అసౌకర్యంతో కాదు — ఆనందంతో రావాలి. అస్తవ్యస్త పరిస్థితుల్లో కాదు — అంగరంగ వైభవంగా గణనాథుడికి వీడ్కోలు పలకాలి. మేము అడుగుతున్నది ఉపకారం కాదు — మీ బాధ్యతను నిర్వర్తించమని! మేము కోరుతున్నది ప్రత్యేక హక్కు కాదు — మా పండగకు తగిన గౌరవం! 🚩 సరూర్‌నగర్ చెరువు మా ఎమోషన్! గణనాథుడు మా విశ్వాసం! గణేష్ నిమజ్జనం మా సంప్రదాయం! మా భక్తి విషయంలో మాత్రం — కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు! – ఆకుల శ్రీవాణి లేడీ సింగం
Akula Srivani - Lady Singham28,793 görüntüleme • 1 ay önce

జిల్లపురుగు, బల్లి, కప్పలు లాంటి సీజనల్ పార్టీలను నమ్ముకుంటే… చివరికి రెండు గాజులు అమ్ముకున్నట్టే! Gen Z గుర్తుంచుకోండి ట్రెండ్ చూసి కాదు… నిజం చూసి సపోర్ట్ చేయండి. ఎమోషన్లో కాదు… ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే — “తొందరపడి తీసుకున్న నిర్ణయం… జీవితాంతం పశ్చాత్తాపం
Akula Srivani - Lady Singham73,048 görüntüleme • 5 ay önce

ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై ప్రతి పౌరుడు ఒక ప్రశ్న వేసుకోవాలి. పేపర్ లీక్ వంటి ఘటనలు జరిగితే వాటిపై నిష్పక్షపాత విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనిపై భిన్నాభిప్రాయాలకు తావు లేదు. అయితే, ఏ నిరసన అయినా శాంతియుతంగా, చట్టబద్ధంగా జరగాలి. హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడులు లేదా ప్రజల్లో ఉద్రిక్తతలు పెంచే చర్యలు జరిగితే, వాటిని కూడా అదే స్థాయిలో ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యంలో విభేదాలను వ్యక్తం చేయడానికి రాజ్యాంగబద్ధమైన మార్గాలు ఉన్నాయి. ఎన్నికలు, చట్టబద్ధ నిరసనలు, న్యాయపరమైన ప్రక్రియలు—ఇవే ప్రజాస్వామ్య బలం. దేశ ప్రతిష్ఠ, సామాజిక శాంతి, ప్రజల ఐక్యతకు నష్టం కలిగించే చర్యలు ఏ లక్ష్యంతో జరిగినా సమర్థించబడకూడదు. ప్రజలారా... సమస్యలపై ప్రశ్నించండి. బాధ్యత వహించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయండి. కానీ హింస, విద్వేషం, విధ్వంసానికి దూరంగా ఉండండి. రాజకీయాలు మారుతాయి. ప్రభుత్వాలు మారుతాయి. కానీ దేశం శాశ్వతం. భారతదేశం యొక్క ఐక్యత, ప్రజాస్వామ్యం, శాంతి—వీటిని కాపాడటం మనందరి ఉమ్మడి బాధ్యత. #JantarMantar #cjp_पार्टी
Akula Srivani - Lady Singham46,460 görüntüleme • 3 ay önce

Honey Trap ah… POCSO ah… nothing is confirmed yet. So why are people conducting media trials before the police investigation is complete? Calm down. Let the law do its job. If there is truth, it will come out. If there are lies, they too will be exposed. Emotion before investigation is not justice — it is hysteria.
Akula Srivani - Lady Singham74,327 görüntüleme • 5 ay önce

Today, I’m ditching the car and choosing Metro travel! As our Hon’ble Prime Minister Narendra Modi always inspires us — real change begins with our daily habits. Using public transport means: Less fuel consumption Less pollution, less traffic A cleaner and smarter India If we want to build a better nation, we must first change our lifestyle and take responsible decisions in our everyday lives. One small step from us can create a big change for the country.
Akula Srivani - Lady Singham50,367 görüntüleme • 5 ay önce

🚨 This is not politics anymore… this is harassment. 🚨 Since morning, I have been receiving continuous phone calls from BRS leaders and karyakartas in the name of “citizens.” This constant targeting, pressure, and mental harassment is unacceptable. India is a democratic country. 🇮🇳 Every citizen has the constitutional freedom to speak, question, and express opinions. Who are you to decide what I should speak or not speak? Who gave you the right to mentally torture someone for expressing their views? This kind of intimidation culture is dangerous for democracy. Trying to silence voices through fear, pressure, and emotional harassment is absolutely ridiculous. I am deeply disturbed and emotionally hurt by the repeated calls and targeting. Disagreement is part of democracy — but harassment is not. 🚩 I will continue to speak with courage. 🚩 I will not be silenced through intimidation. 🚩 Democracy gives every Indian the right to express themselves freely.
Akula Srivani - Lady Singham48,469 görüntüleme • 5 ay önce