
HYDRAA
@Comm_HYDRAA • 80,196 subscribers
Official ‘X’ Account of Commissioner Hyderabad Disaster Response and Asset Protection Agency (HYDRAA)-040-29565758 - DRF Control Room - 9000113667
Shorts
Videos

✳️ HYDRAA took action against illegal groundwater extraction near Sunnam Cheruvu, where borewells installed inside houses, bedrooms and kitchens were being used to extract water for commercial sale through underground pipelines. In a joint operation with CMC, Revenue and Water Board officials, HYDRAA removed illegal borewells and curbed unauthorised water trading to protect groundwater resources and safeguard public health from potentially contaminated water. #HYDRAA #SunnamCheruvu #GroundwaterProtection #WaterConservation #IllegalWaterTrade
HYDRAA43,738 views • 4 days ago

— అక్రమబోర్లపై కొనసాగుతున్న హైడ్రా దాడులు — సోమవారం తమ్మిడికుంట వద్ద 6 బోర్లకు చెక్ — సున్నం చెరువు వద్ద 25 బోర్లను తొలగించిన హైడ్రా ✳️ చెరువుల చెంత బోర్లు వేసి నీటిని తోడేసి వ్యాపారం చేసుకునేవారిపై హైడ్రా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మాధాపూర్‌లోని సున్నం చెరువు చెంత ఉన్న బోర్లకు చెక్ పెడితే.. సోమవారం శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట వద్ద దాడులు నిర్వహించింది. తమ్మిడికుంట దిగువ భాగంలోని ప్రభుత్వ భూమిలో బోర్లు వేసి దర్జాగా నీటి దందా చేస్తున్న వారిని హైడ్రా కట్టడి చేసింది. వివిధ ప్రాంతాల్లో బోర్లు వేసి..ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన కుంటకు సరఫరా చేసి వాటర్ ట్యాంకర్లద్వారా దందా నిర్వహిస్తున్న వారికి హైడ్రా చెక్ పెట్టింది. తమ్మిడికుంట వద్ద 6 బోర్లను పైపు లైన్లతో సహా మోటార్లను తొలగించింది. ప్లాస్టిక్ షీట్లతో తయారు చేసిన నీటి మడుగకు నీరు రాకుండా భూగర్భంలో ఉన్న పైపులను హైడ్రా తొలగించింది. మరోవైపు సున్నం చెరువు చెంత కూడా సోమవారం కూడా దాడులు కొనసాగాయి. మరో 10 బోర్లను పైపులతో సహా పెకలించి నీటి దందాకు చెక్ పెట్టింది. ఇలా సున్నం చెరువు చెంత 25 బోర్లను, తమ్మిడికుంట వద్ద 6 బోర్లను ఇప్పటి వరకూ హైడ్రా తొలగించింది. #HYDRAA #IllegalBorewells #GroundwaterProtection #WaterConservation
HYDRAA10,289 views • 3 days ago

— సున్నం చెరువు చెంత.. — అక్రమ బోర్లపై హైడ్రా కొరడా — గతంలోనే చెరువులో బోర్లను తొలగించిన హైడ్రా — నేడు పరిసర ప్రాంతాల్లో నీటి దందాకు హైడ్రా చెక్ ✳️ హైడ్రా శనివారం భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. సున్నం చెరువు చెంత అక్రమ బోర్లపై హైడ్రా స్టింగ్ ఆపరేషన్ చేసి అక్రమ నీటి వ్యాపారం సాగుతున్న తీరును బయట పెట్టింది. ఇళ్లలో, బెడ్ రూంలలో, వంట గదుల్లో భారీ స్థాయిలో బోర్లు వేసి.. హైపవర్ మోటార్ల ద్వారా తోడిన నీటిని భూగర్భంలో వందలమీటర్ల పైపులు అమర్చి.. తరలించే వైనాన్నిబట్టబయలు చేసింది. ఎక్కడో బోరుంటుంది.. మరెక్కడో ట్యాంక్ ఉంటుంది. అలా తోడిని నీటిని భారీ వాటర్ ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి చిన్న ట్యాంకర్లను నింపి.. అమ్ముకునే వైనాన్ని మీడియా సాక్షిగా బయట పెట్టింది. వెనువెంటనే రంగంలోకి దిగి సున్నం చెరువు చెంత నీటి దందాకు చెక్ పెట్టింది. సీఎంసీ, రెవెన్యూ, జలమండలి అధికారులతో కలిసి హైడ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇళ్లలో బోర్లు వేసి.. గుట్టు చప్పుడు కాకుండా దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ నీటి వ్యాపారానికి హైడ్రా ఎట్టకేలకు చెక్ పెట్టింది. అక్రమంగా వేసిన బోర్లను పదుల సంఖ్యలో తొలగించింది. శనివారం మధ్యాహ్నానికి మొత్తం 15 బోర్లను ప్రత్యక్షంగా తొలగించిన హైడ్రా.. పరోక్షంగా పదుల సంఖ్యలో బోర్లను అనుసంధానం చేసే భూగర్భ పైపులను తొలగించింది. ఈ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. — అక్రమ నీటి దందాతో సున్నం చెరువును ఖాళీ.. ✳️ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే పదుల సంఖ్యలో బోర్లు వేసి.. దుర్గంధ భరిత నీటి దందాకు హైడ్రా గతంలోనే చెక్ పెట్టింది. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా అక్కడి బోరు నీటిని పరీక్షించి ప్రమాదకర, ప్రాణాంతక రసాయనాలున్నాయని తేల్చి చెప్పింది. కాడ్మియం, సీసం, నికెల్ వంటి లోహాలు అధికంగా ఉన్నాయని రుజువు చేసింది. ఈ నీళ్లు తాగిగే కాలేయ సమస్యలు... క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలతో పాటు.. గర్భశ్రావాలు జరుగుతాయి. ఇలాంటి నీళ్లను మాధాపూర్‌లోని హాస్టళ్లకు, హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకునే వారికి హైడ్రా చెక్ పెట్టింది. శనివారం నవభారత్‌నగర్, బోరబండ్ ఫేజ్ 3 ప్రాంతాల్లో ఉన్న బోర్లను తొలగించింది. సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తున్న క్రమంలో అందులోని 10 అడుగుల మేర పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించింది. దీంతో చెరువులో నీరు భూగర్భంలోకి ఇంకడం మొదలయ్యింది. భూగర్భ జలాలు పెరిగాయి. అయితే ఈ ఫలాలు అక్కడి నివాసితులకు దక్కకుండా.. నీటి వ్యాపారులు చేసినవైనంపై హైడ్రాకు ఫిర్యాదులందాయి. పదుల సంఖ్యలో నీటి ట్యాంకర్లు తరలించి నీటిని తోడేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా చర్యలు తీసుకుంది. — బెడ్ రూంలు, ఇంటి గదుల్లో బోర్లు.. ✳️ సున్నం చెరువు చెంత నివాసాలలో ఆశ్చర్యం కలిగించే విధంగా బోర్లున్నట్టు హైడ్రా గుర్తించింది. నిద్రపోయే బెడ్ల కింద, వంటగదుల్లో బోర్లును గమనించింది. నీటి సంపులో భారీ బోర్లు.. ఇలా నీటి దందా కొనసాగిన తీరు కనిపించింది. స్థానికుల ముందే వాటిని తొలగించింది. బోర్లకు బిగించిన మోటార్లతో సహాతొలగించి నీటి దందాకు హైడ్రా చెక్ పెట్టింది. శనివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్‌ను శనివారం సాయంత్రం వరకూ కొనసాగించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గతంలో 60 అడుగుల్లో నీల్లు పడేవి.. ఇప్పుడు 600ల అడుగులు వెళ్లినా బోర్లు పడట్లేదని వాపోయారు. బోర్లు ఎండిపోయి.. మోటార్లు కాలిపోవడంతో నీళ్లను కొనుక్కొంటున్నామని.. వాళ్లు మాత్రం నీటిని అమ్ముకుంటున్నారని వాపోయారు. సున్నం చెరువులో నీటి నిల్వలపైనా అక్రమ నీటి దందా ప్రభావం పడుతోందని వాపోయారు. వర్షాకాలం ఆదిలో పడిన వర్షంతో కొంతమొత్తంలో చేరిన నీటిని కూడా పరిసరాల్లో వేసిన భారీ బోర్లు గుంజేశాయని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పదుల సంఖ్యలో ట్యాంకర్లను నింపే కార్యక్రమాలు చేయడంతో తమకు దారిలేకుండా చేస్తున్నారని పలువురు వాపోయారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడక తాగు నీటి కష్టాలు రాకముందే హైడ్రా ఇలాంటి చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. #HYDRAA #SunnamCheruvu #IllegalBorewells #SunnamCheruvuOperation
HYDRAA15,507 views • 5 days ago

— HYDRAA is restoring Kapra Lake with an investment of ₹35 crore, with nearly 60% of the works completed. The project focuses on protecting wetlands, providing a habitat for migratory birds, preserving biodiversity, and creating a cleaner, greener space for the public. #HYDRAA #KapraLake #LakeRestoration #WetlandConservation #Biodiversity
HYDRAA10,121 views • 15 days ago

— అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సేవలు #HYDRAA #DRF #MRT #Monsoon2026
HYDRAA33,112 views • 2 months ago

-గచ్చిబౌలి ఆంజనేయనగర్‌లో హైడ్రా - CMC సంయుక్త ఆపరేషన్ -కూలే ప్రమాదం ఉన్న భవనం తొలగింపు -పక్కనే ఉన్న భవనాలకు ముప్పు లేకుండా చర్యలు -బాహుబలి JCB తో జాగ్రత్తగా తొలగింపు పనులు -CMC అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు 🔷రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి లోని ఆంజనేయనగర్‌లో CMC - హైడ్రా ఆపరేషన్ ప్రారంభించింది. శనివారం 7 అంతస్థుల భవనం కూలిపోయిన విషయం విదితమే. ఆ భవనం కూలినప్పుడు పక్కన ఉన్న మరో 7 అంతస్థుల భవనం కూడా బాగా దెబ్బ తింది. ఆ భవనం కూలిపోయే ప్రమాదం ఉండడంతో దాన్ని హైడ్రా - CMC సంయుక్తంగా తొలగిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భవనాన్ని నిర్మించినట్టు CMC అధికారులు తెలిపారు. ఈ భవనం కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని CMC అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు భవనాన్ని తొలగించాలని హైడ్రాను CMC కోరింది. దీంతో హైడ్రా ఆదివారం చర్యలు ప్రారంభించింది. పక్కనే ఉన్న భవనాలపై పడకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది. ఏమాత్రం భావనల మధ్య గ్యాప్ లేకపోవడంతో జాగ్రత్తగా భవనం తొలగింపు పనులను చేపడుతోంది. భవనం తొలగింపు వైపు ప్రజలు రాకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. శనివారం సాజిద్ కు చెందిన భవనం కూలడంతో జయదర్శిని అపార్ట్మెంట్ C బ్లాక్ దెబ్బతింది. ఆదివారం తొలగిస్తున్న భవనం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున స్టెర్లింగ్ వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ నివాసితులను ఖాళీ చేయించారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా వరుసగా పేక మేడలులా 50 గజల్లో 7 అంతస్తులవరకు నిర్మించిన భవనాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో హైడ్రా - CMC సంయుక్తంగా yee ఆపరేషన్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆదివారం ఒక భవనాన్ని తొలగిస్తాంది. Cyberabad Municipal Corporation #HYDRAA #Gachibowli #AnjaneyaNagar #CMC #JointOperation #BuildingRemoval
HYDRAA25,417 views • 2 months ago

✳️ గణేష్ నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు. ✳️ నిమజ్జన ఘాట్ వద్ద ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసిన హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్. ✳️ నిమజ్జనానికి ముందు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు. ✳️ హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారితో పాటు అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య గారు కూడా ప్రత్యేక నిమజ్జన పూజల్లో పాల్గొన్నారు. ✳️ NTR మార్గంలోని HYDRAA కంట్రోల్ రూమ్ వేదిక నుంచి నిమజ్జనాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్. ✳️ హైడ్రా బోట్స్ పహారాను పరిశీలించిన హైడ్రా కమిషనర్. ✳️ నిమజ్జనం పూర్తయ్యేవరకు అన్ని శాఖలతో హైడ్రా అధికారులు, సిబ్బంది సమన్వయంగా పని చేయాలని సూచించిన హైడ్రా కమిషనర్. ✳️ హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారితో పాటు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య గారు, RFO శ్రీ జయప్రకాష్ గారు, SFO చంద్రశేఖర్ బాబు ఉన్నారు. #HYDRAA #GaneshImmersion #Hyderabad #KhairatabadGanesh
HYDRAA13,871 views • 1 month ago

❇️ Nallagandla Lake Restoration Begins! With the support of local farmers, HYDRAA has commenced restoration works at Nallagandla Lake to improve water storage, enhance greenery, and transform the lake surroundings into a clean, green, and pleasant space. #HYDRAA #LakeRestoration #LakeProtection #NallagandlaLake
HYDRAA23,337 views • 2 months ago

-హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలపై తనిఖీ -హైడ్రా - జీహెచ్ ఎంసీ కమిషనర్లతో పాటు కలెక్టర్ సంయుక్త విచారణ -ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు మేరకు అధికారుల పరిశీలన ✳️హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు శ్రీ ఏవీ రంగనాథ్ గారు, శ్రీ ఆర్ వీ కర్ణన్ గారు, హైదరాబాద్ కలెక్టర్ డా. ప్రియాంక అలా గారి నేతృత్వంలో అధికారుల బృందం సోమవారం పరిశీలించింది. తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విచారించింది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఇరిగేషన్ శాఖ ఈ సందర్భంగా తెలిపింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. Commissioner GHMC Collector Hyderabad GHMC #HYDRAA #HussainSagar #ProtectWaterBodies #PradeepConstructions
HYDRAA30,821 views • 3 months ago

-రామంతాపూర్ పెద్దచెరువు ఆక్రమణలు తొలగింపు -2180 గజాల మేర చెరువు పరిధిలోకి తెచ్చిన హైడ్రా 🔶ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ పెద్ద చెరువు ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. రామంతాపూర్ పెద్ద చెరువు ఎప్టీఎల్ విస్తీర్ణం 30 ఎకరాలు కాగా.. 16 ఎకరాల వరకూ కబ్జాకు గురైంది. ఇందులో 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలు వచ్చాయి. వీటి జోలికి వెళ్లకుండా మరో 4 ఎకరాల మేర తాత్కాలిక షెడ్డులు, గుడిసెలుంటే వారికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరుకు హైడ్రా సిఫారసు చేసింది. ఇలా మొత్తం 18 ఎకరాల మేర చెరువును అభివృద్ధి చేస్తున్న క్రమంలో 1900 గజాల మేర జీ ప్లస్ 2 నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనంతో పాటు.. 280 గజాల మేర ఉన్న ఆటో గ్యారేజీని కూడా హైడ్రా మంగళవారం తొలగించింది. వర్షాకాలం చెరువు నిండితే గుడిసెలు మునిగిపోయేవి. అక్కడ నివసిస్తున్న వారు ప్రతి ఏటా చాలా అవస్థలు పడుతుండేవారు. చెత్త సేకరణతో పాటు.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి డబుల్బెడ్రూం ఇళ్ల మంజూరీకి హైడ్రా సిఫారసు చేయగా.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం విధితమే. ప్రభుత్వం కూడా కేటాయింపులో ప్రాధాన్యం ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంది. దాదాపు రూ.19 కోట్లతో రామంతాపూర్ పెద్దచెరువును అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఎఫ్టీఎల్ విస్తరణ పనులకు ఆటంకాలు తొలగాయి. రామంతాపూర్ చెరువు అభివృద్ధి పనుల్లో ఎలివేషన్‌కు ఈ ఆక్రమణలు తొలగింపు ఉపయోగపడనుంది. #HYDRAA #RamanthapurPeddaCheruvu #LakeRestoration
HYDRAA28,845 views • 3 months ago

All real estate ventures with legally valid permissions have nothing to fear. False news is being spread that HYDRAA will demolish structures near lakes, even those legally permitted by competent authorities. The Honorable Chief Minister of Telangana has categorically stated that no structure with valid permissions will be demolished. HYDRAA will strictly adhere to this directive. Telangana CMO Secretary MAUD. Vijayalaxmi Gadwal GHMC HMDA
HYDRAA130,768 views • 2 years ago

🔷 అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్. 🔷 భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు. 🔷 రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్. 🔷ఐలాపురం తండాతో పాటు గ్రామంలో ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా చర్యలు. 🔷పేదల యిల్లజోలికి వెళ్లకుండా హైడ్రా ఆపరేషన్. 🔷కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన Mukheem గెస్ట్ హౌస్ తో పాటు, mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷తండాలోని నివాసాలతో పాటు ఐలాపురంలో యిళ్ళ జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకుంటున్న హైడ్రా. 🔷 సంగారెడ్డి జిల్లా ameenpur మండలం ఐలాపురం విలేజ్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 🔷 ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వచ్చాయి. 🔷 ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడుతున్న ప్రభుత్వం. 🔷 863 ఎకరాల భూమి విలువ 15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 🔷 యథాతథ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోకుండా Mukheem నిర్మించిన గెస్ట్ హౌస్ ను తొలగించిన హైడ్రా. 🔷 అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా Mukheem సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగించిన హైడ్రా. 🔷ఐలాపూర్ లో Mukheem తమ్ముడు అజీమ్ అక్రమంగా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండడం లేదు. 🔷ఖాళీగా ఉన్న భవనాన్ని తొలగిస్తున్న హైడ్రా. 🔷కొంతమందిని ఆప్పటికప్పుడు అద్దెలకు దించి నివాసాలున్నట్టు చూపిన భావన నిర్మాణ దారుడు. 🔷 భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా. #HYDRAA #Ameenpur #EncroachmentRemoval #LandProtection
HYDRAA45,969 views • 6 months ago

మోకాల లోతుకే ఉప్పొంగిన గంగ హైడ్రా తవ్వకాల్లో బయటపడిన బతుకమ్మకుంట ♦️బతుకమ్మ కుంట బతికే ఉంది. మోకాలు లోతు మట్టి తీయగానే బిరబిరా గంగమ్మ బయటకొచ్చింది. ఇక అంతే అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. ♦️బతుకమ్మ కుంట కాదు.. ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారు ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ♦️కబ్జాల చెరలో చెరువు ఆనవాళ్లను కోల్పోయిన చెరువుకు ప్రాణం పోయమని స్థానికులు హైడ్రాను ఆశ్రయించిన విషయం విధితమే. ♦️ఈ మేరకు అక్కడి ముల్ల పొదలను తొలగించి... తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది. ♦️మంగళవారం మోకాలు లోతు మట్టిని తీయగానే గంగమ్మ ఉబికి వచ్చింది. దశాబ్దాలుగా నింపిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు కళకళలాడుతుందని స్థానికులు చెబుతున్నారు. ♦️అయితే బతుకమ్మ కుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టుకు వెళ్లాలని సూచించిన విషయం విధితమే. నాటి నుంచి పనులను హైడ్రా కొనసాగించింది. చెరువు చరిత్ర ఇది..: ♦️బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట ఉంది. ♦️అంబర్‌పేట మండలం, బాగ్అంబర్పేట్లోని సర్వే నంబరు 563లో 1962 -63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట. ♦️బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు. ♦️తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే. ♦️ప్రస్తుతతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు. ♦️ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారి ఆదేశాలు. ♦️ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందన్న స్థానికులు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ♦️కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందన్న స్థానికులు. ♦️బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టనున్న హైడ్రా. బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడనుంది. Telangana CMO #Hydraa
HYDRAA82,500 views • 1 year ago

వరద ముప్పు లేకుండా.. నాళాల విస్తరణకు హైడ్రా శ్రీకారం. -ప్యాట్నీ నాలాతో శ్రీకారం. #HYDRAA
HYDRAA59,653 views • 1 year ago