
JanaSena Telangana
@JSPTelangana • 84,641 subscribers
JanaSena Party, Telangana
Shorts
Videos

జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణాలు ఇక్కడి యువత చేసిన ప్రాణత్యాగాలు, వారి అలుపెరగని పోరాటాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడుస్తున్నప్పటికీ, నేటికీ ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని, యువత ఆశయాలు సహా ఇంకా అనేక కోరికలు నెరవేరాల్సి ఉందని తెలిపారు. #MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
JanaSena Telangana54,154 görüntüleme • 14 gün önce

Congress Hataoo-Desh Bachoo Rahul Gandhi Congress Telangana Congress #CongressExposed #Genz
JanaSena Telangana47,054 görüntüleme • 17 gün önce

తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీలుస్తున్న ప్రజా ప్రతినిధులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నరు, CONGRESS-BRS పార్టీలను ఇంట్లో కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది. -జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ RK Sagar (RK Naidu) #BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
JanaSena Telangana121,275 görüntüleme • 1 ay önce

అరెస్టులు చేసి జనసేనను అడ్డుకోవాలనుకుంటున్నారా? ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు… BRS Party , Telangana Congress పాలన వైఫల్యాలను ఎత్తిచూపితే ఆంక్షలు… ప్రజల తరఫున నిరసనకు దిగితే అడ్డుకోవడం… ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం… ప్రశ్నించే జనసేన నాయకులను అరెస్ట్ చేయడం ఎందుకు? ఒక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే వందల గొంతులు ప్రశ్నిస్తాయి. ఒక్క నిరసనను అడ్డుకుంటే వేలాది మంది ప్రజల ప్రశ్నలు రోడ్డెక్కుతాయి. అధికారం ఎవరిదైనా…ప్రజల సమస్యలపై జనసేన ప్రశ్నిస్తూనే ఉంటుంది.అరెస్టులు మా పోరాటాన్ని ఆపలేవు! #BRSCongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
JanaSena Telangana105,994 görüntüleme • 1 ay önce

కాంగ్రెస్ తెలంగాణలో పుట్టిందా...? టీఆర్ఎస్, బిఆర్ఎస్ గా ఎందుకు మారింది..?
JanaSena Telangana312,371 görüntüleme • 8 ay önce

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచారం రథంను జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు శుక్రవారం హైదరాబాదులో ప్రారంభించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, సూచనలు చేశారు. ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని స్పష్టం చేశారు. #MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
JanaSena Telangana19,573 görüntüleme • 15 gün önce

Imagine working 14 hours in the heat to set up a rally, only to get shoved aside by your own leader because you stood in front of his camera. This video tells you everything you need to know about how he actually treats the people beneath him. Rahul Gandhi Revanth Reddy DK Shivakumar #CongressExposed
JanaSena Telangana19,969 görüntüleme • 19 gün önce

కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల బాగోతంపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలి #BRSLootedTelangana
JanaSena Telangana23,585 görüntüleme • 1 ay önce

మంచానికి పరిమితమైన తన బిడ్డను హేళన చేసినా ఆ తల్లి ఇంకా నిన్ను పెద్ద మనిషి అంటుంది, తన బిడ్డ పరిస్థితిని చూసి Pawan Kalyan గారు వచ్చారు తప్పా రాజకీయానికి సంబంధం లేదు, మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే దిగజారిన వ్యాఖ్యలు చేస్తారా అని ఆ తండ్రి అడుగుతున్నాడు. బహిరంగ క్షమాపణ చెప్పి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో Perni Nani
JanaSena Telangana79,603 görüntüleme • 4 ay önce

జడ్చర్ల MLA మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు చేసే హక్కు దేశంలో ప్రతీ పౌరుడికి ఉంది. ఆ మాత్రం తెలియకుండా MLA ఎలా అయ్యావు? సాక్ష్యాత్తు దేశ ప్రధాని మోదీ గారిని అవమానిస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా వ్యాఖ్యలు చేసిన నీపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం - జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి RK సాగర్ గారు.
JanaSena Telangana121,986 görüntüleme • 8 ay önce

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు! ఇటీవల హార్ట్ స్ట్రోక్ కి గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు శ్రీ ఆర్కే సాగర్ (Rk నాయుడు), మదిరెడ్డి దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ లు పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబ సభ్యులను, ఆసుపత్రి వర్గాలను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ ఎప్పుడు ఎంతో చురుగ్గా, ప్రజాక్షేత్రంలో ఉండే ఆయనను ఈ స్థితిలో చూడడం తీవ్రంగా బాధ కలిగించిందని, నర్సంపేటలో ఆయన ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది శివకోటి లాంటి యువత రాజకీయాల్లోకి రావడం గొప్ప విషయం అన్నారు. భగవంతుని, ప్రజల ఆశీస్సులతో సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మన మధ్యకు రావాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకురాలు ఆకుల వెంకటలక్ష్మి, పబ్బ సునీత గౌడ్, అక్షయ్, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్తూరి నగేష్,ఆంజనేయులు గౌడ్, షేక్ హుస్సేన్, ఎలబోయిన డేవిడ్, రాంప్రసాద్,రాధాకృష్ణ,రాజేందర్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. #JanaSenaTelangana
JanaSena Telangana48,493 görüntüleme • 3 ay önce

హైదరాబాద్ అత్తాపూర్ లో తన సొంత ఆటోపై తన మతానికి సంబంధించిన సూక్తి రాసుకున్నందుకు ఆటో డ్రైవర్ ను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం సరికాదు. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లడే వారిని చూసి చూడకుండా వదిలేస్తూ, ఆటో డ్రైవర్‌ను అలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఘటనపై దర్యాప్తు జరపాలి. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి. ఎవరిపైనా మతం, కులం, భావజాలం ఆధారంగా వివక్ష చూపకూడదు. పోలీసు వ్యవస్థ పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలాగే ఆటో డ్రైవర్ కు జనసేన అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము! Revanth Reddy DGP TELANGANA POLICE Telangana CMO
JanaSena Telangana54,407 görüntüleme • 3 ay önce

సైదాబాద్ సక్సెస్ స్కూల్లో ‘కల్మా’ పేరుతో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒకమతానికి సంబంధించిన అంశాన్ని హోంవర్క్‌గా ఇవ్వడం తీవ్ర అక్షేపణీయం. పిల్లల డైరీలో బహిరంగంగా మతపరమైన అంశాన్ని హోంవర్క్‌గా రాస్తే, తరగతిగదిలో ఇంకేమి బోధిస్తున్నారో అనే అనుమానం సహజంగానే వస్తుంది. ఇది ప్రభుత్వం విచారించాల్సిన విషయం. మదరసా అయితే మదరసా అని చెబుతారు, మిషనరీ స్కూల్ అయితే తన ప్రత్యేకతను చెబుతుంది, వేద పాఠశాల అయితే వేదాలు బోధిస్తామని ముందుగానే తెలియజేస్తుంది. తల్లిదండ్రులు కూడా అదే అవగాహనతోనే పిల్లలను అక్కడ చేర్పిస్తారు. మరి “సక్సెస్ స్కూల్” అని పేరుపెట్టుకుని ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం..? ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. రాష్ట్ర గుర్తింపు పొందిన సాధారణ విద్యాసంస్థల్లో అన్నిమతాలకు చెందిన విద్యార్థులు చదువుతారు. అలాంటి పాఠశాలల్లో రాజ్యాంగ విలువలు, నైతిక విద్య, విజ్ఞానం బోధించాలి తప్ప, ప్రత్యేకంగా ఒక్కమతాన్ని ప్రోత్సహించకూడదు. గతంలో కూడా ఇలాంటి బోధన, హోంవర్క్ ఇచ్చారా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలి. జనసేన ఏ మతానికీ వ్యతిరేకం కాదని మరొక్కసారి స్పష్టంచేస్తూ..భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ తమమతాన్ని ఆచరించే హక్కును ఇచ్చింది. విద్యాసంస్థలు రాజ్యాంగస్ఫూర్తితో విద్యార్థులందరినీ సమానంగా చూడాలి. పాఠశాలలు మత ప్రచార వేదికలుగా కాకుండా.. జాతీయత, రాజ్యాంగస్ఫూర్తి, విజ్ఞానం, నైతిక విలువలను పెంపొందించే విద్యాలయాలుగా ఉండాలి. పిల్లలకు దేశభక్తి నేర్పండి, రాజ్యాంగ విలువలు నేర్పండి, విజ్ఞానం నేర్పండి. విద్య పేరుతో ఏ మతాన్ని కూడా పిల్లలపై రుద్దే ప్రయత్నాలను అనుమతించరాదు. పాఠశాలలు జాతీయతను నిర్మించే ఆలయాలు కావాలి, మత ప్రచార కేంద్రాలు కాకూడదు అని జనసేన పార్టీ స్పష్టంగా చెబుతోంది. Revanth Reddy DGP TELANGANA POLICE Telangana CMO
JanaSena Telangana53,858 görüntüleme • 3 ay önce

భారత దేశ సైనికుడిగా మా తండ్రి ఒక ప్రాంతం కోసం పని చెయ్యలేదు. కానీ ఇవాళ నేను తెలంగాణ సమాజం కోసం JanaSena Party తరఫున పని చేస్తుంటే ప్రాంతం ప్రస్తావన తెస్తున్నారు. ప్రాంతాల వారీగా గొడవలు పడే లెక్కన దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు పోరాడటం అర్థం ఏముంది. #SenaPrasthanam
JanaSena Telangana60,161 görüntüleme • 4 ay önce

విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేతులెత్తడమేనా మీ 'సంవిధాన్ బచావో'? ప్రజల రక్షణ కోసం రోడ్ల మీద నిలబడే ఖాకీ చొక్కాకి గౌరవం ఇవ్వలేని వాళ్లు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. నాయకులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి అహంకారపు చేష్టలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. #CongressExposed
JanaSena Telangana13,783 görüntüleme • 23 gün önce