
Dr.RS Praveen Kumar
@RSPraveenSwaero • 230,435 subscribers
Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.
Shorts
Videos

మానవతా దృక్పథంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం, కిమ్స్ సికింద్రాబాద్ లో చికిత్స పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగింది. గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న ఆరోగ్య భద్రత పథకాన్ని,కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పేద పోలీసుల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నది. శంకర్ నాయక్ డ్యూటీలో ఉండగా అనారోగ్యం పాలైతే,డబ్బులు అడ్వాన్స్ కట్టలేదని హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం అందించలేదు. చివరికి తోటి ఉద్యోగులు చందాలు వేసుకొని చికిత్స చేయిస్తుండగా, విషయాన్ని కేటిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగా తప్పకుండా ఆదుకుంటామని మాటిచ్చి, ఈ రోజు బాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు. మేము కిమ్స్ సందర్శించిన తరువాత కాని EHS అధికారులు మేల్కొనలేదు! నిరంతరం రేవంత్ రెడ్డి కృూర ఆదేశాల మేరకు బిఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్ట్ చేస్తున్నా, అవన్నీ ఏవీ మనసులో పెట్టుకోకుండా, ఒక పేద కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్న కేటిఆర్ గారికి, లక్షలాది మంది పోలీసు కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు.🙏 KTR #BringBackBhadhrata #ScrapEHS
Dr.RS Praveen Kumar95,225 次观看 • 2 天前

మేడిగడ్డ పిల్లర్ 99% బాంబు పేలుడు (controlled explosion) వల్లనే కుంగి పోయింటదని నేను సంవత్సరం క్రితమే చాలా మంది ఇంజనీర్లతో మాట్లాడిన తరువాతనే చెప్పిన. దాని తర్వాత ఇసుక దందా కోసం కొన్ని చెక్ డ్యామ్ లను కాంగ్రేసు నాయకులు పేల్చి వేశారు కూడా. వీటిని పూర్తిగా దర్యాప్తు చేయకపోవడం కూడా నేరమే. DGP TELANGANA POLICE
Dr.RS Praveen Kumar42,974 次观看 • 10 天前

మాకు EHS వద్దు- ఆరోగ్య భద్రతే కావాలి: తెలంగాణ కాంగ్రెస్ పాలనలో, 4 కోట్ల మంది ప్రజలను కాపాడుతూ, శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసుల ఆరోగ్యానికి కూడా కనీస భరోసా లేదు. ఈ రోజు కిమ్స్ సికింద్రాబాద్ హాస్పిటల్ లో దేవసోత్ శంకర్ అనే పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాన్ని కలిశాను. కానిస్టేబుల్ సతీమణి నేను కనబడగానే కన్నీరు మున్నీరుగా విలపించింది. 😭 శంకర్ 2013 నుండి పోలీస్ హోం గార్డుగా పని చేసి, 2024 తర్వాత కానిస్టేబుల్ గా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు వెల్ నెస్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నుండి నిమ్స్ కు తీసుకెళ్తే బెడ్స్ ఖాళీ లెవన్నారు. అక్కడి నుండి యశోదకు తరలించగా అక్కడ EHS పనిచేయడం లేదన్నారు. వెంటనే కిమ్స్ సికింద్రాబాద్ కు తరలించారు. అత్యంత నిరుపేద కుటుంబం. అయినా శంకర్ మిత్రులు, బంధువుల సహాయంతో రూ.1.5 లక్షలు చెల్లించి ఆపరేషన్ చేయించారు. ఇపుడు ఐసియులో చికిత్స పొందుతున్నాడు. మళ్లీ ఇపుడు ₹2 లక్షలు కావాలని హాస్పిటల్ యాజమాన్యం అడిగితే కానిస్టేబుల్ మిత్రులు ఒక్కొక్కరు వెయ్యి, 2 వేల చొప్పున తోచినంత సాయం చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 24 గంటలు పని చేసే కానిస్టేబుల్ కి ఇలాంటి పరిస్థితి ఎదురవడానికి కారణం ఎవరు ? ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? గతంలో కేసిఆర్ గారి ప్రభుత్వంలో ఆరోగ్య భద్రత పథకం అమలైనపుడు ఎక్ఖడ ఏం ఆపద వచ్చినా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉండేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చి, ఆరోగ్య భద్రత స్థానంలో EHS Employee Health Scheme ను అమలులోకి తెస్తామన్నారు. కానీ ఇప్పటివరకు పోలీసు మిత్రులు ఏ దవాఖానకు వెళ్లినా EHS పెద్దగా చెల్లడం లేదని చెబుతున్నారు. ఆసుపత్రులు కూడా తెలివిగా, పోలీసు-ఇతర ఉద్యోగ పేషంట్ల నుండి డైరెక్టుగా నగదు డబ్బులు గుంజడానికి తెలివిగా EHS ట్రస్టుకు సమాచారం అందించ కుండా పేషంట్ల కుటుంబాలను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. వాళ్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని నమ్మకం లేదంట! ఇలాంటి తొండి హాస్పిటల్స్ ను గుర్తించి DMHO లైసెన్స్ రద్దు చేయాలి. కానీ వాళ్లలో చాలా మంది లంచాలు మింగడంలో సీయం గారిని మించిపోయారు. ఉదా- ఈ రోజు ఏసీబీ ట్రాప్ అయిన రంగారెడ్డి DMHO. వీళ్ళు పైకి ఎంత మామూళ్లు పంపుతున్నారో? సీయం రేవంత్ రెడ్డి గారు రోజుకు 18 గంటలు భోది ప్యాలెస్ లో MediCover లాంటి తన స్వంత బినామీ కార్పోరేట్ హాస్పిటల్ ప్రమోషన్ కే శ్రమిస్తున్నారు తప్ప లక్షలాది ఉద్యోగుల ఆరోగ్యం గురించి కానేకాదు. ఇది మన కర్మ. ఇప్పుడు దేవసోత్ శంకర్ పరిస్థితి దయనీయంగా ఉంది. నేను పై అధికారులతో మాట్లాడితే వెంటనే EHS వర్తింపచేస్తాం అని హామీ ఇచ్చారు. వెంటనే అమలు చేసి శంకర్ ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ శంకర్ కు ఎలాంటి అపాయం జరిగినా పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే. శంకర్ ను కాపాడకపోతే బిఆర్ఎస్ తరపున పోలీసులందరి పక్షాన పోరాడుతం. అయ్యా డిజిపి గారు, తప్పు చేసిన కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేయడం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నపుడు అప్పుడప్పుడు ఆదుకోవడం కూడా చేయండి. Telangana CMO Revanth Reddy DGP TELANGANA POLICE ACB Telangana Damodar Raja Narasimha KTR Harish Rao Thanneeru ANI Press Trust of India #TelanganaSinking #ElCongo
Dr.RS Praveen Kumar78,047 次观看 • 20 天前

సస్పెండ్ చేయాల్సింది డిప్యూటి సిఎం, సీయం లను, ఛీఫ్ ఇంజనీర్ ను కాదు. తెల్లవారు జామున 4 గంటల నుండి అర్థరాత్రి వరకు పనిచేసే గిరిజన సామాజిక వర్గానికి చెందిన సురేష్ అనే ఉన్నతాధికారిని (సీఈ) సస్పెండ్ చేశారు. థర్మల్ పవర్ స్టేషన్ లో ఐఏఎస్ అధికారులు ఏం చేయగలరు? టైం పాస్ చేయడం తప్ప. మనుషుల డాక్టర్లు అవసరమున్న చోట, పశువుల డాక్టర్లను పంపిస్తున్నారు. మూడు సంవత్సరాల లో ఒక్క సబ్ స్టేషన్ కూడా నిర్శించకుండా, అరకోర సబ్ స్టేషన్ల నిర్మాణ కాంట్రాక్టులు కూడా 15 శాతం కమీషన్లు ఇచ్చిన వారికే ఇవ్వాలని చూస్తున్నారు. దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ లోపాలు ప్రతి చోటా తలెత్తినయి. రేవంత్ రెడ్డి కుటుంబం దోచుకున్న 50 వేల కోట్ల తో నాణ్యమైన బొగ్గు(Gr-9) సరఫరా చేస్తే ఈ రోజు కరెంట్ కోతలు ఉండేవి కావు. నాసిరకం బొగ్గును (Gr-15) సరఫరా చేయడం వల్లనే ఈ రోజు కరెంట్ కష్టాలు వచ్చి పంటలు ఎండిపోతున్నాయి. ఇంధన శాఖతో ఎందుకు ఒక్క రివ్యూ కూడా పెట్టడం లేదు? రివ్యూలు పెట్టి సమస్య పరిష్కరించకుండా ,పేద వర్గాలకు చెందిన ఛీఫ్ ఇంజనీర్ ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. మీ చేతకానితనానికి మా పేద వర్గాల ఆఫీసర్లనే బలిచేస్తరా? కేసిఆర్ గార్ పాలనలో ఎన్నడూ కరెంట్ కష్టాలు రాలేదు. గత ప్రభుత్వ పాలసీని అమలు చేయకుండా, ఆనాటి సి ఎండి ప్రభాకర్ రావు ను అరెస్ట్ చేయాలని,పాస్ పోర్ట్ సీజ్ చేసి, వేధింపులకు గురి చేయాలని చూశారు. అవసరం లేకపోయినా అటెన్షన్ డైవర్షన్ కోసం జస్టిస్ నరసింహ రెడ్డి కమీషన్ వేసి కాలయాపన చేశారు. ఇవి ఎల్ నినో వల్ల ఏర్పడ్డ కరెంట్ కోతలు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరెంట్ కోతలు. ఎల్ కాంగో(కాంగ్రెస్) కరోనా కంటే ప్రమాదకరం. #ElCongo #TelanganaSinking
Dr.RS Praveen Kumar20,311 次观看 • 10 天前

Thanks a million, Anna. 🙏🏼 Your humane gesture is a harbinger of the welfare state BRS 3.0 is going to create in the days to come. ప్రతి ప్రాణం విలువైనదే: KIMS లో చికిత్స పొందుతున్న మెదక్ కానిస్టేబుల్ దేవసోత్ శంకర్ వైద్య ఖర్చులు మొత్తం భరిస్తామని BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సహాయం పట్ల బాధిత కుటుంబం కేటిఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కేటిఆర్ గారికి ఉన్న స్పందించే హృదయం మరియు ఔదార్యం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్క శాతం (1%) ఉన్నా రాష్ట్రం ఎంతో బాగుపడేది. BRS Party బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి అండగా నిలబడి ,ప్రశ్నించేవరకు EHS అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శంకర్ త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం శంకర్ పూర్తిగా కోలుకొని,తిరిగి విధుల్లో చేరేవరకు ప్రభుత్వమే అన్ని విధాలా అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. EHS అంటేనే కార్పొరేట్ ఆసుపత్రులు పెదవి విరుస్తున్నాయి అన్న విషయం రేవంత్ రెడ్డి గారికి తెలవకపోడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. While the Telangana Chief Minister is busy expanding his business empire brazenly, thousands of employees and pensioners are left to fend for themselves. And the officers who are responsible for disciplining the recalcitrant hospitals, are busy in collecting hafta or mamools from them. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? ACB Telangana Office of Chief Secretary, Telangana Govt. DGP TELANGANA POLICE Revanth Reddy
Dr.RS Praveen Kumar21,549 次观看 • 19 天前

Dear M. Nageswara Rao IPS (Retired) sir, I truly appreciate honest commentary on political humility and police protection to robber barons. Other day I came across your post on appreciating the CM of Telangana for scaling down of police security to many ‘VIPs’ including some senior officers who sacrificed best part of their careers to deal with the most violent home grown insurgency of our times. We will debate it at a later date, but what missed your attention is the gentleman who is officially moving with a posse of huge police security sporting imported automatic weapons! His only qualification is that he is the brother of hon’ble CM of Telangana!!! Whatever I comment on his activities will become political, but I request you to do a little bit of research to dig out the truth behind this made up ‘threat perception’ saga. All people are equal, but some are more equal than others!!! Satyameva Jayate. Jai Hind 🇮🇳🫡
Dr.RS Praveen Kumar76,138 次观看 • 3 个月前

ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారు. మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ KTR గారు ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నవి..మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారు! ఇదెక్కడి న్యాయం? మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా, గౌరవ హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారు! ఆది నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారు, హోంమంత్రి Revanth Reddy గారు. మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు పోతా. పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తా✊ స్వేచ్ఛ మా జన్మ హక్కు ✊ Art 19(1)(a)(b) BRS Party #TelanganaUnderArrest
Dr.RS Praveen Kumar65,759 次观看 • 3 个月前

హైదరాబాద్ శివార్లలో ఉన్న బండ్లగూడ జాగీర్ మునిసిపాలిటీ లో ఉన్న ఏకంగా పీరాన్ చెరువులోనే యధేచ్చగా పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు. ఎవరైనా అడుగుతే మాకు సీయం బాగా తెలుసు, R-Tax (Per Sft ₹50/-) కట్టుకుంటం, కోర్టుకు ఎట్ల పోవాలో మాకు తెలుసు అని దబాయిస్తున్నరంట! మరి ఇక్కడి అధికారులు ఏంచేస్తున్నరు? పేదోళ్ల ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే శనివారం-ఆదివారం నాడు కూల్చేస్తున్నారు కదా! HYDRAA ఎక్కడ? మీకు ఈ పెద్దోళ్ల దురాక్రమణలు కనిపించడం లేదా? పేదోళ్ల గుడిసెలే కనిపిస్తాయా? #RTax Dr Lubna Sarwath
Dr.RS Praveen Kumar191,563 次观看 • 2 年前

నిన్న అచ్చంపేట పట్టణంలో కాంగ్రేసు గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి DGP TELANGANA POLICE గారు. ఆగంతకులు యధేచ్చగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి టాబ్లెట్ (electronic gadget) పట్టుకొని చోద్యం చూస్తున్నారు! ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇప్పుడే DSP గారితో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కనీసం ఒక్క నిందితున్ని కూడా పీఎస్ కు తీసుకరాలేకపోయారు!!! వాళ్ల మీద చర్య తీసుకోండి. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందరనే తెలువదా??? ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్లో ప్రశ్నించండి..నిందితులు రెండు నిముషాల్లో దొరుకుతారు. See the inefficiency of policemen in Atchempet town while murderous assault was taking place right in front of their eyes! Is this the way policemen are trained to respond in Telangana? Or are they asked to stay silent. The inability to apprehend at least one accused till now bolsters the suspicion that they are hand in glove with the aggressors. Please take disciplinary action on all those who are responsible for this DGP TELANGANA POLICE garu. #NoGuaranteeForLifeInTelangana
Dr.RS Praveen Kumar186,928 次观看 • 2 年前

సైఫాబాద్ పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ పీఆర్వో మహేష్ మాణిక్యం ముదిరాజ్ ను కక్ష కట్టి మరో అక్రమ కేసులో అరెస్ట్ చేసిన బొల్లారం పోలీసులు! ఇతను ఉగ్రవాది కాదు, తీవ్ర వాది కాదు. రేవంత్ రెడ్డి లాగా ఓటు కు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా కూడా దొరక లేదు. అతను ఎక్కడికి పారిపోయే ప్రమాదం లేదు. అతని వల్ల ఎవరికీ ప్రమాదం లేదు. అయినా కావాలనే సతాయిస్తున్నారు!!! This is recorded in the files and will be remembered. Thanks. DGP TELANGANA POLICE #TelanganaSinking
Dr.RS Praveen Kumar14,780 次观看 • 1 个月前

కారా కారా మే మారో మారో 👊😱 హోం మంత్రి మన రేవంతన్న నే…పబ్బులల్ల, డెన్నులల్ల ఏంత తన్నుకున్నా కేసులు పెట్టే ధమ్ము ఎవరికీ లేదు..👊 అందుకే ఈ బరితెగింపు. విచిత్రం ఏందంటే ‘కారా కారా’ పబ్బు సీయం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఉంది. ఆయనకు తెలవకుండానే ఈ గలీజు దందా జరుగుతదా? ఆయనకు మామూళ్లు పోకుండనే ఈ పబ్బు గాడు రాత్రి రెండుగంటల వరకు విచ్చలవిడిగా సారాయి, గంజాయి, టెకీలాలు, వోడ్కాలు తాగిపిచ్చుకుంటనే ఉంటరా? కాంగ్రెస్ యువ నేతలు ప్రజా పాలనలో పబ్బుల గబ్బులో మునిగి తేలుతున్నారు.. మహా నగర పోలీసు అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. Feel sad to say this. But… ఇవి నిజం కాక పోతే ఇంత వరకు FIR ఎందుకు విడుదల కాలేదు? దాస్పల్లా పబ్ ఓనర్ గాడు కంప్లయింట్ ఎలాగూ ఇవ్వడు, ఎందుకంటే వాడు కూడా అడ్డంగా దొరికిపోయాడు ఇప్పుడు! మీరన్నా సుమోటో గా కేసు చేయాలె కదా, Telangana Police ? పోనీ FIR చేస్తే నిందితుల పేర్ల కాలమ్ లో ‘గుర్తు తెలియని నిందితులు’ అని ఎందుకు రాస్తున్నరు? యూత్ కాంగ్రెస్ అరవింద్ అని ఎందుకు రాయలే? నిన్న రాత్రే వాళ్లకు బ్రీత్ అనలైజర్ టెస్టు, డ్రగ్ టెస్టు ఎందుకు చేయలేదు? మీ టాస్క్ ఫోర్స్ కేవలం సుమంత్ -సల్మాన్ ల మీదనే పనిచేస్తదా ? నిందితులు ఇంకా అరెస్టు ఎందుకు కాలేదు? అయితే వాళ్ల ఫోటోలు ఎక్కడ? అసలు యూత్ కాంగ్రెస్ నేత అరవింద్ యాదవ్ ఎక్కడ? నిన్న రాత్రి ఆయన టవర్ లొకేషన్ తీయండి…సీసీటీవీ ఫుటేజ్‌లు తీయండి. ఆయన కూడా MLC మీర్జా రహ్మాత్ బేగ్ లాగా బెంగుళూర్ నుండి ఆస్ట్రేలియా బీచ్ లకు పారిపోయేదాకా నిద్రపోతేనే ఉంటరా? ‘కారా కారా’ పబ్బు రాత్రి రెండు గంటల వరకు నడుస్తుంటే గాఢంగా నిద్రపోయిన సెక్టర్ ఎస్సై, Night Supervisory Officer(NSO) లపై ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు? ‘కారా కారా’ పబ్బు లైసెన్సు ను ఎందుకు వెంటనే రద్దు చేయలేదు? ఇవన్నీ ఎందుకు, మన ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పంచాయతీ చేసి కాంప్రమైజ్ చేసి వదిలేయాలని రేవంతో, ఫయీం భాయో చేప్తే చాలు, బారా ఖూన్ మాఫ్ లాగా చేస్తరా??? చెప్పండి తెలంగాణ రైజింగ్ కాప్స్? కేసీఆర్ గారి టైం లోనే నిందితులకు పోలీసుల పేరు చెప్తే నిద్ర వచ్చేది కాదు. రేవంత్ టైంలో పోలీసులు కాంగ్రేసు గూండాల పేరు చెపితేనే గజగజ వణుకుతున్నరు. Telangana CMO DGP TELANGANA POLICE CP Hyderabad City Police Dr. M. Ramesh, IPS
Dr.RS Praveen Kumar17,296 次观看 • 1 个月前

Sorry for coming back on this painful photograph again. This is not going to be erased from Indian memory that easily. Rahul Gandhi ji - is this what your #BharatJodoYatra for??? The person who is sitting on the extreme left on a tiny bench is none other than hon’ble Dy CM of Telangana, Mr Mallu Bhatti Vikramarka ji. He is the product of Hyderabad Central University and a senior legislator with spotless track record. Being Dalit seems to be the only sin he has committed. All others who are sitting on the chairs are hon’ble CM Revanth Reddy ji and Mrs Revanth garu, hon,ble cabinet ministers Mr Uttam Reddy garu and Mr Komati Reddy garu who belong to dominant community. One doesn’t have to be a rocket scientist to understand why Dy CM who should be sitting next to CM in the order of protocol. This is all because of deep rooted discrimination. If it is not, then: 1. CM could have asked his ‘grab all’ minister colleagues to offer their chairs to Dy CM 2. Senior Cabinet Ministers could have offered their seats to Dy CM to avoid embarrassment. 3. District Collector Yadadri or Executive Officer Yadadri Temple could have arranged more chairs sensing the situation before hand keeping the protocol issues in mind. All the above things won’t happen because of deep rooted bigoted mindset. Now and then it raises its ugly head by default. You can’t notice it oftentimes, sadly. Mr Revanth garu, if you have any sensitivity towards human dignity, you will come out open on this sordid episode and take action on the culprits on this gross violation of protocol which happened in the most sacred place. Or resign to your post. Or we demand that Mallikarjun Kharge take action on their CM in Telangana. Are you also facing the same humiliation in Congress everyday? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ల దగ్గర పాపం Dy CM భట్టి గారి మనసు మౌనంగా ఎంత రోదించి ఉంటదో…ఆయన ముఖ కవళికలు చూడండి!! అట్ల ఎన్నాళ్ల నుండి ఆ పంజా గుట్ట పంజరంలో బందీగా రోదిస్తున్నరో.! సోదరి కొండా సురేఖ (OBC) గారి పరిస్థితి కూడా చాలా దీనంగా ఉంది. తగిన గౌరవం దక్కనప్పుడు ఈ పోస్టులు పదవులు బంగళాలు ఎందుకు బ్రదర్?? బయటికి రాండి. మన గుడిసెల్లో రాజు లాగా బతుకుదురు గాని. Panchi Pinjra Thodke Aajavo.✊ #CongRSS Telangana CMO
Dr.RS Praveen Kumar180,250 次观看 • 2 年前

గౌరవ మంత్రి వివేక్ గారు. మీరు ఎందుకు దొడ్డి దారిన, ఎవరికి సమాచారం లేకుండా, కేవలం మీ సొంత ఛానల్ ని తీసుకొని మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి వచ్చారు? విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తున్నారు.? 58 లక్షలతో మీ మంత్రుల బాత్రూంలు రిపేర్ చేసుకోవడానికి బడ్జెట్ ఉంటుంది కానీ, ముఖ్యమంత్రి రెండవ హెలికాప్టర్ కు ₹111 కోట్ల డబ్బులు వస్తయి కానీ, విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేయడానికి మాత్రం ఉండవా? ఎందుకు పిల్లలని స్కిల్ యూనివర్సిటీకి రావాలని బలవంతం చేస్తున్నారు? వాళ్లకు నచ్చిన కోర్సు చదివే స్వేచ్ఛ వారికి లేదా? రాజ్యాంగ విరుద్దమైన జీవో 97 రద్దు చేసి, TSBTET ని కొననసాగించండి. Keep GO 97 in Abeyance or Face the wrath of Telangana ✊ Telangana CMO Dr Vivek Venkatswamy Harish Rao Thanneeru KTR
Dr.RS Praveen Kumar20,849 次观看 • 2 个月前

.CP Hyderabad City Police Grandpashabet Giriş Sabit #2026 Election Commission of India ఎన్నికల కోడ్ బహిరంగంగా ఉల్లంఘించి ఇప్పటికీ జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే తిరుగుతూ డబ్బులు పంచుతున్న బయటి ప్రాంతాల కాంగ్రెస్ Telangana Congress MLA/MLC లను అర్ద గంటలో అరెస్ట్ చేయకపోతే BRS Party పార్టీ నుండి అందరూ సీనియర్ నాయకులం MLA/MLCలము అందరం జూబ్లీ హిల్స్ కు వస్తాం. తరువాత జరగబోయే పరిణామాలకు మేము బాధ్యులం కాము. If you can’t arrange a level playing field to every party, please withdraw bandobust and leave it to us. Seriously. See how MLC Shankar Nayak and MLA Beerla Ilaiah are moving openly in Borabanda today! BRS Party KTR Harish Rao Thanneeru
Dr.RS Praveen Kumar73,687 次观看 • 11 个月前

Feeling proud to share the promo of food start up, Suchi- Gongoora by one of our swaeroes, Mr. Chennaiah in Hyderabad under the mentorship of legend-Mr Sudhakar Dande. Please encourage him whenever you find an opportunity. #Swaeroes- Let’s become the leaders in all fields with the best service and great products. Govt jobs shouldn’t be the only goals we pursue in our lifetime. #SuchiKitchen #Gongoora
Dr.RS Praveen Kumar93,715 次观看 • 1 年前

Proud products of KCR’s Vision for Telangana. Meet Flt Cadet Umakanth, a product of Rukmapur Social Welfare Sainik School, Karimnagar. He stood first in flying and in over all merit in Air Force Academy. Meet Flying Officer Veludandi Kavya, product of Bibinagar Social Welfare Armed Forces Prep College for Women who recently passed out from Air Force Academy. Both the achievements are historic and resemble Mission Impossible. Born to parents from neglected communities these kids made it to the top of the most prestigious armed forces to guard the Motherland. But for KCR’s grand vision and freedom to the officers who pursued this mission vigorously, this would have remained only as a dream. It pains me to share with you that these institutions in Telangana are now facing neglect under Congress rule, because the priorities changed to exploitation from emancipation. Eagerly waiting for KCR 2.0 to create many more miracles and make Telangana and India super proud. Thanks a million, Col CN, Col Ravinder, Maj Usha and many more soldiers who made this Mission Possible. Jai Hind. 🇮🇳🫡 KTR Telangana CMO
Dr.RS Praveen Kumar28,253 次观看 • 4 个月前

Never imagined that a tiny attempt of redefining the identity of underprivileged students would find its place in the famous Oxford Dictionary! SWAERO is now a proud identity and a noun in the lexicon. Hope in future it will transform into a verb. Entire credit goes to all the students studying in welfare schools across the nation, the alumni, and their teachers-parents who are making country proud in their own way. స్వేరో అనే పదానికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీషు డిక్షనరీలో చోటు దొరకడం చాలా ఆనందంగా ఉంది. తరతరాల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటూనే, జ్ఞానఖడ్గం తో బానిసత్వపు సంకెళ్లను ధ్వంసం చేయడం చారిత్రాత్మకం. ఎన్ని కుట్రలు చేసిన మనిషి ఆలోచనాసరళిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని ఈ గుర్తింపుతో నిరూపితమైంది. स्वेरो अब ऑक्सफ़ोर्ड अंग्रेज़ी शब्दकोश में।लाखों स्वेरो छत्रोंकों मेरा हार्दिक बधाई💐 #Swaero
Dr.RS Praveen Kumar164,346 次观看 • 3 年前

.Telangana CMO Revanth Reddy గురుకులాల్లో ఇట్లనేనా మా పిల్లలను మీరు పెంచేది? పిల్లలను ‘లేకి ముండా’, వాల్ల తల్లులను ‘దొంగ ముండా’ అని తిట్టొచ్చా? వాళ్లను ఇట్ల కొట్టొచ్చా? మీ ఇళ్లలో పిల్లలను ఇట్లనే దండిస్తరా? వాళ్లు చదివే పాఠశాలలో వాళ్లను ఎవరైనా కొడితే మీరు ఊరుకుంటారా Office of Chief Secretary, Telangana Govt. DGP TELANGANA POLICE TGSWREI SOCIETY గారు? పిల్లలు ఏ తప్పు చేయలేదని నేను అనడం లేదు. I can understand the dangers lurking around girls’ boarding schools and the anxiety of caretakers. కానీ ఈ వయసులో వాళ్లను కూర్చోబెట్టి జాగ్రత్తగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, కానీ ఇట్ల కొట్టడమేంది? రేవంత్ గారు, మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ పోయింది? Ms Sailatha, I never expected this from you, madam. You should have called professional counsellors or their parents and exhibited more maturity. Take action on all those responsible in this heinous incident in Vikarabad Centre of Excellence, Telangana. #TelanganaFalling #CongressAntiDalit
Dr.RS Praveen Kumar86,153 次观看 • 1 年前