
Telangana CMO
@TelanganaCMO • 1,675,642 subscribers
Official account of CMO Telangana.
Shorts
Videos

రాజధాని హైదరాబాద్ నగరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. ✅తాగునీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు. ✅#CURE పరిధిలో మంచినీటి సరఫరా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాటర్ వినియోగంపై ఎంసీఆర్‌హెచ్ ఆర్డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ✅ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ప్రాంత పరిధిలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (#STP) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాలని ఆదేశించారు. ✅సచివాలయంతో పాటు సీఎంఓ, అవుటర్ రింగ్, మెట్రో రైల్, ఇతర శాఖల కార్యాలయాల్లో పచ్చదనం నిర్వహణ కోసం, ఇతర అవసరాలకు శుద్ది చేసిన నీటిని వినియోగించేలా చూడాలని తెలిపారు. పబ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు కూడా ట్రీటెడ్ వాటర్‌నే వాడాలన్నారు. ✅భవన నిర్మాణంలో శుద్ధి చేసిన నీటినే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని రెడ్కో ఉన్నతాధికారులను ఆదేశించారు. ✅ఎస్టీపీల్లో నీటి శుద్ధికి అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలు పాటించాలని చెప్పారు. నీటి నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దన్నారు. ప్రతి నీటిశుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ✅ఈ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు హైడ్రా పర్యవేక్షించాలని చెప్పారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ✅ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ✅ప్రస్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాటర్‌ను #GreenWaterTanker ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు వివరించారు. వినియోగదారుల నుంచి కేవలం రవాణా రుసుం మాత్రమే వసూలు చేస్తున్నామని, నీటిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ✅ఈ సమీక్షా సమావేశంలో Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #WaterConservation #TreatedWater #WastewaterTreatment #ElNino #Hyderabad
Telangana CMO15,361 views • 2 days ago

On the occasion of #PoliceCommemorationDay, Hon’ble Chief Minister Sri Revanth Reddy paid heartfelt tributes to police personnel who laid down their lives in the line of duty at the Martyrs’ Memorial, Goshamahal Stadium, Hyderabad. The Chief Minister reaffirmed the Government’s commitment to filling all vacancies in the Police Department by 2028 through phased recruitment to ensure adequate personnel for maintaining law and order and safeguarding public security. Paying homage to the police personnel who lost their lives in the line of duty across the country this year, he expressed his deepest condolences to their families and assured them of the Government’s continued support. He emphasised that the Government would take responsibility for the education and security of martyrs’ children and extend assistance with compassion and sensitivity. Highlighting the need to strengthen the police force to address emerging challenges, including #cybercrime, #onlinefraud, drug trafficking and food adulteration, the Chief Minister stressed the importance of modern policing, discipline, integrity and public trust. He called upon police personnel to uphold the spirit of friendly policing by treating citizens with empathy and respect while dealing firmly with criminal activities. He reiterated the Government’s commitment to the welfare of police personnel and their families. The Chief Minister emphasised that honouring #policemartyrs goes beyond paying tributes - it means upholding their ideals, supporting their families and working collectively towards building a peaceful, safe and developed #Telangana. Salute to the brave police martyrs whose supreme sacrifices will forever remain an inspiration to the nation. #TelanganaPolice #FriendlyPolicing #PublicSafety
Telangana CMO28,071 views • 9 days ago

Hon’ble Chief Minister Sri Revanth Reddy has called upon the southern states to work together to make South India the safest region in the country. He reaffirmed Telangana’s readiness to share its technological infrastructure and integrate Integrated Command Control Centre (#ICCC) systems with neighbouring states to strengthen policing and prevent crime. Inaugurating the Southern Regional Police Coordination Committee (#SRPCC) conference at the ICCC in #Hyderabad, the Chief Minister stressed that effective inter-state coordination, technology-driven policing and continuous reforms are essential to combat emerging challenges such as cybercrime, drug trafficking and organised crime. Highlighting Telangana’s policing initiatives, he spoke about the achievements of specialised agencies such as EAGLE, HYDRAA and the Telangana Cyber Security Bureau, along with initiatives to strengthen public safety and service delivery. Reaffirming the government’s commitment to police welfare, he highlighted the Young India Police School, enhanced financial assistance to families of personnel who die in the line of duty, and other welfare measures. The Chief Minister expressed confidence that the conference would pave the way for stronger inter-state cooperation and a comprehensive action plan to make South India safer. DGP TELANGANA POLICE DGP KARNATAKA Dr Mahesh Kumar Aggarwal DGP Andhra Pradesh State Police Chief Lakshadweep Police Puducherry Police #TelanganaPolice #SouthIndiaPolice #PoliceCoordination
Telangana CMO19,016 views • 7 days ago

Hon’ble Chief Minister Shri Revanth Reddy met Maharashtra Chief Minister Shri Devendra Fadnavis in Mumbai to discuss enhancing the height of the #TummidihattiBarrage across the Pranahita River from 148 m to 152 m to meet Telangana’s irrigation needs. Irrigation Minister Shri Uttam Kumar Reddy highlighted the long-pending irrigation demands of tribal and Adivasi communities in the erstwhile #Adilabad district and Telangana’s willingness to compensate Maharashtra farmers affected by submergence. He emphasised the need to consider current electricity requirements, energy costs, environmental protection, climate change and project operational costs, highlighting the importance of prioritising gravity-based water conveyance. CM Shri Fadnavis expressed willingness to reconsider the proposal and announced an independent study by #Maharashtra to assess the proposed construction site, submergence impacts at different heights and land requirements. He assured that any objections raised by #Telangana would be examined jointly, with expert opinions sought if necessary. Senior officials from both states, along with experts, will examine technical issues, water availability, environmental concerns, land acquisition and compensation, and work towards a roadmap for further action. Both Chief Ministers reaffirmed their commitment to cooperation and the development of backward regions, particularly the welfare of tribal communities. #PranahitaChevella #IrrigationProjects #GodavariRiver
Telangana CMO11,003 views • 3 days ago

ఇబ్రహీంపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ గారి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, మల్లు రవి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ జోషీ గారితో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. DGP TELANGANA POLICE CP Future City #BharatFutureCity #FutureCityPoliceCommissionerate #Telangana
Telangana CMO26,528 views • 10 days ago

76 వ గణతంత్ర దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో నాలుగు నూతన సంక్షేమ పథకాలను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి Revanth Reddy గారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా ఒక సందేశాన్ని ఇచ్చారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను గణతంత్ర దినోత్సవం రోజున ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. #TelanganaRising #RepublicDay
Telangana CMO919,987 views • 1 year ago

Hon’ble Chief Minister Shri Revanth Reddy has invited Hyundai India to consider Telangana for car manufacturing, highlighting Hyderabad’s strategic location, skilled workforce, robust infrastructure and quality of life. A delegation of Hyundai Motor India Engineering (HMIE), led by Managing Director Mr. Changyeon Cho, met the Chief Minister at the Bodhi Pavilion. The CM assured the company of full government support for its proposed Integrated Global R&D facility at #NIMZ, Zaheerabad. The project involves an investment of ₹8,528 crore, spans 678 acres and is expected to generate 4,276 jobs. The delegation informed the CM that the facility could be ready for groundbreaking in the coming months. Hyundai’s existing #Hyderabad R&D centre in HITEC City has been operational for nearly 20 years. The Chief Minister highlighted Telangana’s dedicated mobility clusters, multimodal connectivity and emerging manufacturing corridors, including the Peri-Urban Region (#PURE), as key advantages for automotive investments. He also invited Hyundai’s leadership to participate in the Invest Telangana Global Summit 2026 and outlined the vision for #BharatFutureCity. Mr. Changyeon Cho said Hyundai’s plans to strengthen Hyderabad as a global technology and advanced engineering hub align with the Telangana Rising 2047 vision. Senior officials, including Chief Minister’s Advisor and Ex-Officio Special Chief Secretary K. Ramakrishna Rao and Sangareddy Collector Prateek Jain, attended the meeting. #InvestTelangana #HyundaiMotors #MakeInTelangana #GlobalInvestments #ManufacturingHub
Telangana CMO22,862 views • 14 days ago

రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన, అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు రక్షణ రంగ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. #TelanganaRising2047 దార్శనికతకు అనుగుణంగా త్వరలోనే “ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0”ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ✅#InvestTelanganaGlobalSummit2026 లో అంతర్భాగంగా హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు “రక్షా ఎక్స్పో 2026 కర్టెన్ రైజర్”ను ప్రారంభించి లోగోను ఆవిష్కరించారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Uttam Kumar Reddy గారు, Sridhar Babu Duddilla గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ గారితో ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ✅“రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా చూడాలన్నది నా ఆకాంక్ష. యుద్ధానికి అవసరమైన సాంకేతికతను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి స్వావలంబన సాధించడమే కాకుండా రక్షణ సాంకేతిక ఎగుమతులు చేసే దేశంగా భారత్ ఎదగాలి” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభిలషించారు. ✅“తెలంగాణ రాష్ట్రం కోసం నాకొక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో తెలంగాణ గణనీయమైన పాత్ర పోషిస్తోంది. అయితే, ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సిన అవసరముంది. దేశ రక్షణ రంగ పరిశ్రమకు అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా తెలంగాణ ఎదగాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి” అని కోరారు. ✅“తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మీరు వేసుకున్న ప్రణాళికలను రెట్టింపు చేయండి. లక్ష్యాన్ని సాధించడానికి నా నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలో చెప్పండి. సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది నా హామీ” అని స్పష్టంగా చెప్పారు. ✅భారతదేశ రక్షణ పరిశ్రమకు తెలంగాణ అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా ఎదగాలి. రక్షణ రంగంతో పాటు స్పేస్, #Aerospace, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ వంటి అనేక అనుబంధ రంగాల్లో ఈ సమావేశానికి హాజరైన మీరందరూ సహకరించి లక్ష్యాన్ని సాకారం చేయాలని ఆశిస్తున్నా. ✅#Telangana 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గతేడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశాం. ✅దేశ జనాభాలో ప్రస్తుతం తెలంగాణ వాటా 2.5 శాతానికి పైగా ఉంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో తెలంగాణ 5 శాతం వాటాను అందిస్తోంది. 2047 నాటికి ఆ వాటాను 10 శాతం సాధించాలన్నది నా లక్ష్యం. ✅ఈ దార్శనికతను సాకారం చేయడంలో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్, వాటి అనుబంధ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు “#RakshaExpo” ఒక ప్రధాన వేదికగా మారుతుంది. ఈ రంగంలో పనిచేస్తున్న వారంతా వినూత్న ఆలోచనలను, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నా. అందుకు అవసరమైన సహకారాన్ని, అనువైన వాతావరణాన్ని కల్పిస్తాం అని చెప్పారు. ✅“భవిష్యత్తులో యుద్ధ స్వరూపం పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఈ రంగంలోని నిపుణులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డ్రోన్లు, రోబోట్లు, కృత్రిమ మేధస్సుతో పనిచేసే వ్యవస్థలు యుద్ధ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో ఊహించండి. మన ముందున్న మార్గం స్పష్టంగా ఉంది. అందుకు సాంకేతిక పరిజ్ఞానమే అత్యంత కీలకం. ✅రక్షణ, స్పేస్, ఏరోస్పేస్, భద్రతా రంగాలకు చెందిన ప్రముఖులు, దిగ్గజ సంస్థలైన డీఆర్డీఓ (#DRDO), హెచ్ఏఎల్(#HAL), బీడీఎల్ (#BDL), మిధాని, టాటా సంస్థలు, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్ వంటి ఎన్నో ప్రముఖ సంస్థల ప్రతినిధులు మనమధ్యనున్నారు. ✅ఈ రంగానికి చెందిన భాగస్వాములందరినీ ఒక వేదికపై సమావేశమై చర్చించుకోవడానికి, పరస్పరం సహకరించుకోవడానికి రక్షా ఎక్స్పోను ఒక చైతన్యవంతమైన అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దాలన్నది నా ఆలోచన” అని రేవంత్ రెడ్డి గారు రక్షణ ఎక్స్పో ఉద్దేశాలను వివరించారు. ✅“భారతదేశ రక్షణ వ్యవస్థలో ఒక వ్యూహాత్మకమైన ప్రదేశంగా హైదరాబాద్ కీలకమైన స్థానంలో ఉంది. హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరం. అనేక ముఖ్యమైన పరిశోధనా సంస్థలకు నిలయం. భారత సైన్యం, భారత వైమానిక దళాలకు సంబంధించిన కీలకమైన స్ట్రాటజిక్ కేంద్రాలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయి. ✅దక్షిణ భారతదేశంలో సముద్రతీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. అయినప్పటికీ, భారత నౌకాదళానికి రాష్ట్రం కీలకమైన సేవలు అందిస్తోంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యంత తక్కువ పౌనఃపున్యాల(Very Low Frequency – VLF) నౌకాదళ రాడార్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు“ అని వివరించారు. ✅గతేడాది మొదటిసారి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ #BharatFutureCity లో రెండోసారి మరింత భారీస్థాయిలో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ✅ఈ కర్టెన్ రైజర్‌లో భారత రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ ఉన్నతాధికారులు, DGP TELANGANA POLICE సీవీ ఆనంద్ గారు, @DRDO_Indiabdl, Bharat Dynamics Limited, Mishra Dhatu Nigam Ltd. (MIDHANI), HAL సంస్థల ప్రతినిధులు, U.S. Consulate General Hyderabad లారా విలియమ్స్ గారు పాల్గొన్నారు. ✅అలాగే, Bharat Forge Ltd సీఎండీ బాబా ఎన్. కల్యాణి గారు, Skyroot Aerospace సీఈఓ పవన్ కుమార్ చందన గారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ Dr G Satheesh Reddy గారు, Lockheed Martin హెడ్ మైకెల్ ఫెర్నాండెజ్ గారు, Larsen & Toubro ఇంజనీరింగ్ సిస్టమ్స్ (ఎస్పీవీ) అరుణ్ రాంచందాని గారు, Dhruva Space కో-ఫౌండర్ సంజయ్ నెక్కంటి గారు, Safran సీఈఓ జితేంద్ర గవాంకర్ గారు, ఎయిర్‌బస్ డిఫెన్స్ స్పేస్ ప్రెసిడెంట్ వెంకట్ కట్కూరి గారితో పాటు భారత రక్షణ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. #RakshaExpo2026 #Aerospace #Defense #Space
Telangana CMO10,449 views • 5 days ago

ఎల్‌నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రకోపించడంతో తలెత్తిన ఈ విపత్తును ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ✅#ElNino వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ✅ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అఖిల పక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి సహకారం కోరుతామని చెప్పారు. ఈ సంక్షోభ కాలం నుంచి గట్టెక్కడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ✅ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, సాగు, తాగునీటి ఎద్దడి, తద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. ✅అనంతరం ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Office of Tummala గారు, Jupally Krishna Rao గారు, Ponnam Prabhakar గారు, Ponguleti Srinivasa Reddy గారు, Danasari Seethakka గారు, Dr Vivek Venkatswamy గారు, Vakiti Srihari గారు, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి గారు, Harkara Venugopal Rao గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ✅ఎల్‌నినో కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవలసిన చర్యలపై ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి గారు వివరించి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ✅"సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద మనసుతో ఎండాకాలం పంటలు వేయడం తగ్గించుకోవాలి. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, ఉన్న నీటిని తాగడానికి వినియోగించుకోవాలి. ✅ఎల్‌నినోను ఎదుర్కొనడానికి ప్రజలకు అండగా నిలబడాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పుడు ప్రచారం నమ్మి వరి పంటలు వేస్తే నీరు అందించలేక పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవడమే కాకుండా మోటార్లు, మీటర్లు కాలిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. పెద్దమనసుతో ఒక సీజన్‌ను వాయిదా వేసుకోవాలి. ✅రైతులతో పాటు ఈ సంక్షోభ పరిస్థితుల్లో భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకోవలసిన అవసరం ఉంది. ఈసారి 2.5 లక్షల మంది ఉపాధి హామీ కూలీ పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి గారికి సూచించడం జరిగింది. ✅ప్రస్తుత కాలంలో పంట నష్టపోయిన వారికి, ఎండాకాలంలో వాయిదా వేసుకునే పంట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధి నుంచి సహకారం అందించాలి. ✅మార్చి నెలలో ఉండే ఎండలు ఇప్పుడే ఉన్నాయి. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న కాలంలో నీరు, విద్యుత్ విషయంలో తీవ్ర సమస్య ఎదుర్కోబోతున్నాం. ✅ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, ఆరుతడి పంటలు వేసుకోవాలని వర్షాకాలం ప్రారంభం నుంచి చెబుతూవచ్చాం. గడిచిన 3 సంవత్సరాల్లో సగటున 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈరోజు 20 వేల మెగావాట్లకు చేరుకుంది. ✅2014-15 నాటికి సగటున 6500 – 7,000 మెగావాట్ల వినియోగం ఉండగా, ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల వినియోగం పెరిగింది. గడిచిన రెండేళ్లలో ఆరేడు వేల వినియోగం పెరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులకు, పరిశ్రమలకు వీలైనంత మేరకు విద్యుత్ అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. ✅ఇంకో 15 - 20 రోజుల్లో వర్షాకాలం పంటలు కోతలు అయిపోతాయి. చేతికొచ్చిన పంట ఎండిపోకూడదు. రైతుకు నష్టం, కష్టం రాకూడదు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో.. మార్కెట్లో ఎక్కడ, ఏ రేటుకు దొరికినా విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ✅తెలంగాణ మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తికన్నా వినియోగం పెరగడంతో విద్యుత్ లభించని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం. ✅చలికాలం ప్రారంభానికి ముందే రిజర్వాయర్లు వట్టిపోయే పరిస్థితులు వచ్చాయి. పోయిన సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరుండగా, ఇప్పుడు 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ✅అందుబాటులో ఉన్న నీటిని రాబోయే జూన్ వరకు 8 నుంచి 10 నెలలు పొదుపుగా వాడుకోవలసిన అవసరముంది. తాగునీటికే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ✅ప్రపంచంలోని దాదాపు వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా తీవ్రమైన నీటి ఎద్దడి, ఎండ వేడిమితో పాటు రకరకాల సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. ✅ప్రజలు, ముఖ్యంగా రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎల్‌నినో ప్రభావం మొదటగా రైతాంగంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సాగునీరు, తాగునీరుతో పాటు విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. తద్వారా పరిశ్రమలు, ప్రజా జీవితం, దినసరి కార్యక్రమాలపైన కూడా తీవ్రమైన ప్రభావం పడనుంది. ✅కనీవినీ ఎరుగని విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రానికి సబ్సిడీపై అదనంగా విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన అవసరాలకు అనుగుణంగా రాబోయే 10 నెలల వినియోగం ఎంత అవసరమో అంచనా వేసి అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆశిస్తున్నాం. ✅ఒక విపత్తు సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి. ఈ ప్రకృతి విపత్తును జయించడానికి అందరి సహకారం కావాలి. ✅ఎల్‌నినో విపత్తుకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎవరూ వ్యాప్తి చేయొద్దు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల పాటు ప్రజలకు సరైన సమాచారం అందించడానికి ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాం. ✅ అపోహలు, తప్పుడు ప్రచారం కల్పించకుండా ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ✅సాగునీరు, తాగునీటిని ఆదా చేసుకోవడం, కూలీలకు పనులు కల్పించడంతో పాటు పశువులకు గ్రాసం, తాగునీరు అవసరాలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య పరంగా ఏ కష్టమొచ్చిన నిరుపేదలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి గారు సవివరంగా తెలిపారు. ✅ఈ విపత్తు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సబ్ కమిటీని నియమించారు. అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారికంగా సమాచారం అందించడానికి సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావు గారిని నోడల్ అధికారిగా నియమించారు. #Telangana #RainfallDeficit #WaterConservation #PowerCrisis #ClimateChange #DroughtManagement #PublicAwareness
Telangana CMO23,242 views • 14 days ago

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Devendra Fadnavis గారు ఇటీవల సూచనప్రాయంగా తెలియజేశారని చెప్పారు. ✅ముఖ్యమంత్రి గారు నీటి పారుదల ప్రాజెక్టులపై ఉప ముఖ్యమంత్రి Bhatti Vikramarka Mallu గారు, మంత్రులు Uttam Kumar Reddy గారు, Sridhar Babu Duddilla గారు, Jupally Krishna Rao గారు, ఎంపీ Vem Narender Reddy గారితో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ✅#ThummidihattiBarrage తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీఠముడిగా ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకోవచ్చు, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే #YellampalliProject వరకు ఎంత నీటిని తరలించవచ్చనే వివరాలను నీటి పారుదల శాఖ ఇంజనీర్లు సమావేశంలో వివరించారు. ✅తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని వివరించారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని తెలిపారు. ✅మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసి, సాధ్యమైనంత ఎక్కువ నీటిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ బ్యారేజీ నిర్మించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ✅అటవీ, గిరిజన ప్రాంతం, అందులో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ✅జల్, జంగిల్, జమీన్ నినాదంతో ఏళ్ల తరబడి పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలని అన్నారు. అందుకే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ✅బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను ఆదేశించారు. ✅గతంలోనే 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీల్లేదని అన్నారు. అందుకే 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ✅ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, వాళ్లు కోరిన నివేదికలన్నీ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా #Telangana నీటి అవసరాలను తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సూచించారు. ✅డిండి ప్రాజెక్టు #DLIS కు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ✅ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ✅ఎక్కడెక్కడ పంపులు, పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలి, ప్రస్తుతం ఉన్న కాల్వలు, సొరంగాల సామర్థ్యం సరిపోతుందా, లేదా ఎక్కడైనా కాల్వల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుందా అనే అంశాలపై నీటి పారుదల విభాగం వెంటనే అధ్యయనం చేసి, అందుకు వీలైన డిజైన్లు తయారు చేసుకోవాలని ఆదేశించారు. ✅దీంతో పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు ఎలాంటి కోత పడదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. పాలమూరు నీటి కేటాయింపులకు ఆటంకం లేకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. ✅డిండికి నార్లాపూర్ నుంచి లేదా ఏదుల.. ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే విషయంలో మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ జరిగింది. ✅ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది, ఏదుల నుంచి నీటిని తీసుకుంటే ఎంత అంచనా వ్యయం అవుతుందనే వివరాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వాటిలోని అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ వివరించారు. ✅మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలిపారు. #IrrigationProjects #TelanganaIrrigation #WaterResources #DindiProject #Maharashtra
Telangana CMO10,984 views • 7 days ago

అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారి వెంట ఎంపీ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. Governor of Telangana
Telangana CMO70,105 views • 2 months ago

శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్లో ముఖ్యమంత్రి గారిని దేవాదాయ శాఖ కమిషనర్ గారు, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు. #GaneshChaturthi #VinayakaChavithi #LordGanesha
Telangana CMO48,191 views • 1 month ago

Hon’ble Chief Minister Sri Revanth Reddy has sought the cooperation of the Aga Khan Foundation in various development initiatives being undertaken by the Telangana government. The Chief Minister met His Highness Prince Rahim Aga Khan V, who is currently on a visit to India, at Taj Falaknuma Palace in #Hyderabad. During the courtesy meeting, the Chief Minister discussed various development and heritage conservation initiatives being undertaken in Telangana with the support of the Aga Khan Foundation. Recalling the Aga Khan Development Network’s contributions to the state, the Chief Minister said that the Telangana government holds the Aga Khan Foundation in high regard for its significant role in preserving and restoring the state’s rich heritage. The meeting also recalled the long-standing historical association between Hyderabad and the Aga Khan family. He specifically highlighted the restoration of the Legislative Council building and the Qutub Shahi Tombs in Hyderabad with the Foundation’s support. As part of the comprehensive redevelopment of Hyderabad, the Chief Minister briefed Prince Rahim Aga Khan V on the plans being prepared for the rejuvenation of the Musi River. He said the government is also working towards developing a vibrant night-time economy along the Musi River corridor. The Chief Minister sought the Foundation’s cooperation in the restoration and conservation of the historic City College and the Osmania General Hospital buildings located along the Musi riverfront. He further explained that a new building for Osmania General Hospital is being constructed at Goshamahal and that the existing hospital building is proposed to be conserved and developed as a heritage asset. The Chief Minister invited Prince Rahim Aga Khan V to attend the three-day #InvestTelanganaGlobalSummit to be held at Bharat Future City from December 7 to 9. He said that representatives from more than 100 countries are expected to participate in the summit. The Chief Minister said that #BharatFutureCity is being developed across 30,000 acres with state-of-the-art infrastructure and facilities. Located approximately 20 minutes from the international airport, the proposed Future City is envisioned as a fully net-zero city. He said that a Singapore-based company is preparing the master plan for Future City, with nearly 15,000 acres earmarked as a green zone. The Chief Minister noted that leading organisations such as Amazon have already commenced operations in Future City. He further stated that the Telangana government is working towards increasing the state’s contribution to India’s GDP to 10 per cent by 2047. Minister Sri Mohammed Azharuddin, Office of Chief Secretary, Telangana Govt. Sri Sanjay Jaju, Advisor Sri K. Ramakrishna Rao, senior government officials and representatives of the Aga Khan Foundation were present at the meeting. #PrinceRahimAgaKhan #HeritageConservation #HeritageRestoration #MusiRejuvenation #TelanganaRising2047
Telangana CMO39,504 views • 1 month ago

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు బ్రిటన్‌లోని గ్రేట్ నార్త్ మేయర్లు, వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో తయారీ రంగాన్ని భారీగా విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని వివరించారు. ✅ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోది పెవిలియన్‌లో బ్రిటన్ యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన మేయర్ల నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో సమావేశమైంది. సౌత్ యార్క్‌షైర్ మేయర్ ఆలివర్ కొప్పార్డ్, యార్క్ అండ్ నార్త్ యార్క్‌షైర్ మేయర్ డేవిడ్ స్కైత్, వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రాసీ బ్రాబిన్లు ఈ బృందానికి నాయకత్వం వహించారు. ✅ఇటీవల భారత్ - బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) నేపథ్యంలో తెలంగాణతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, దేశంలో అత్యంత యువ రాష్ట్రమైన తెలంగాణ అనతికాలంలోనే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తెలంగాణ ఇప్పుడు కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని చెప్పారు. ✅డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ✅తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక 'తెలంగాణ రైజింగ్–2047' గురించి ముఖ్యమంత్రి వివరించారు. 2025 డిసెంబర్లో ఆవిష్కరించిన ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు చెందిన సంస్థ నాలెడ్జ్ పార్ట్నర్గా కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అంతర్జాతీయ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల సూచనలతో ఈ అభివృద్ధి ప్రణాళిక రూపొందిందని తెలిపారు. ✅కృత్రిమ మేధ (AI) విస్తరిస్తున్న నేపథ్యంలో యువతకు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రముఖ కంపెనీల ప్రత్యక్ష భాగస్వామ్యంతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ✅30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరలో ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి గారు వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్‌లో రివర్‌ఫ్రంట్ ఎకానమీ, నైట్ ఎకానమీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను వివరించారు. ✅అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ 2025 మేలో హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ✅ఈ సందర్భంగా బ్రిటన్ ప్రతినిధులు తెలంగాణతో అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, వైద్య, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్టైల్స్, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యాన్ని ప్రత్యక్ష వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులు, విద్యా సంస్థల మధ్య సహకారంగా మార్చేందుకు త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ✅సౌత్ యార్క్‌షైర్ మేయర్ అలివర్ కొప్పార్డ్ మాట్లాడుతూ, యార్క్‌షైర్ ప్రాంతంలో వివిధ రంగాలకు చెందిన సుమారు 1.50 లక్షల వ్యాపార సంస్థలు ఉన్నాయని తెలిపారు. దేశంలో అత్యధిక తలసరి జీఎస్డీపీ కలిగిన రాష్ట్రంగా తెలంగాణను ప్రస్తావిస్తూ, రెండు ప్రాంతాల ఆర్థిక ప్రయోజనాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. తెలంగాణలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వ్యాపార విస్తరణ అవకాశాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. ✅వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రాసీ బ్రాబిన్ మాట్లాడుతూ, యార్క్‌షైర్, తెలంగాణ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, రెండు ప్రాంతాలు సోదర భావంతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ✅అంతకుముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రిటన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, క్లీన్ ఎనర్జీ, నాలెడ్జ్ ఆధారిత ఆర్థికాభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతానికి ఉన్న పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలతో తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలకు మంచి అనుసంధానం ఉందన్నారు. ✅ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం బ్రిటన్‌లో పర్యటించి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు తెలంగాణ కేంద్రంగా ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ✅ఈ సమావేశంలో ముఖ్యమంత్రి గారు 'UK–India CETA & Regional Synergies' పేరుతో యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UK India Business Council) రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. ✅కార్యక్రమంలో #UKIBC సీఈవో కిషోర్ జయరామన్, హైదరాబాద్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #InvestInTelangana #TelanganaUKPartnership #IndiaUKRelations #TradeAndInvestment #UKIndiaCETA
Telangana CMO15,298 views • 15 days ago

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ✅వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు. ✅రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ✅ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ ఉత్పత్తిని పెంచేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ✅నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు లింకేజీ ఏర్పాట్లు చేసినా యాదాద్రి విద్యుత్ ప్లాంట్‌లో పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు. ✅"ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు" అని ముఖ్యమంత్రి గారు తీవ్రంగా హెచ్చరించారు. ✅అవసరమైతే విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ.. సంబంధిత విభాగపు ఐఏఎస్ లను సస్పెండ్ చేస్తానని మండిపడ్డారు. విద్యుత్ అంతరాయాలకు రోజుకో కారణం చెప్పవద్దని హెచ్చరించారు. ➡️ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు ✅ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కోవిడ్ తరహా విపత్తుగా పరిగణించి అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పుడు సాధారణ సమస్యగా కనిపిస్తున్న పరిస్థితులు ముందస్తు చర్యలు చేపట్టకపోతే తీవ్ర సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ✅"ఎల్‌నినో కోవిడ్ లాంటి విపత్తు. ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సమస్యగా కనిపిస్తోంది. అప్రమత్తం కాకపోతే సంక్షోభంగా మారుతుంది. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఎల్‌నినో ప్రభావాన్ని లోతుగా అంచనా వేయాలి. సమస్యలను అధిగమించేందుకు పరిష్కార మార్గాలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలి" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ✅ఈ పరిస్థితులు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేమని, మళ్లీ వానలు వచ్చే వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాల్సిందేనన్నారు. వచ్చే జూన్ వరకు ప్రతి శాఖ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. రాబోయే సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ➡️తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బందులు రావద్దు ✅వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ✅గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మాణ రంగంతో పాటు ఇతర అవసరాలకు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ✅ఎల్‌నినో ప్రభావంతో పశువులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ➡️ప్రతి మండలానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు ✅ఎల్‌నినో ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి గ్రూప్-1, గ్రూప్-2 స్థాయి అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆయా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు, విద్యుత్, తాగునీటి సరఫరా, పంటలు, పశుగ్రాసం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యతలను వారికి అప్పగించాలని సూచించారు. ✅సంబంధిత మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి నివేదించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ➡️గ్రామసభలు, కళాజాతలతో ప్రజల్లో అవగాహన ✅ఎల్‌నినో ఒక విపత్తని, దీని ప్రభావం, రాబోయే సంక్షోభ పరిస్థితులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. దసరా తర్వాత దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ✅కళాజాతల ద్వారా ప్రజలకు ఎల్‌నినో ప్రభావాన్ని వివరించాలని, నీరు, విద్యుత్ పొదుపుతో పాటు రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ✅గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు ఈ విపత్తు తీవ్రతను వివరించాలని ఆదేశించారు. మళ్లీ వర్షాలు వచ్చే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ✅ఈ సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారితో పాటు విద్యుత్, వ్యవసాయం, ఆర్థిక, పంచాయతీ రాజ్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరాలు, మున్సిపల్, హైదరాబాద్ నగర మంచినీటి సరఫరా, భూగర్భ జలాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. #ElNino #FarmersWelfare #PowerSupply #WaterConservation #Agriculture #PublicWelfare #ClimateAction
Telangana CMO13,632 views • 15 days ago

తెలంగాణలో ఆదిలాబాద్, మామూనూరు (వరంగల్) విమానాశ్రయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ Ram Mohan Naidu Kinjarapu గారికి విజ్ఞప్తి చేశారు. #MamnoorAirport కు అవసరమైన భూ సేకరణను పూర్తి చేసి ఇచ్చామని తెలిపారు. ✅ఢిల్లీలోని MoCA_GoI కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు. #AdilabadAirport లో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్, #MRO (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్‌హాలింగ్) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ✅ఆదిలాబాద్‌లో రన్‌వే ఫైనలైజ్ చేయడానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. #WarangalAirport టెండర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. ✅తెలంగాణలో చాపర్ల ద్వారా #HeliTourism అభివృద్ధికి కృషి చేయాలని రామ్మోహన్ నాయుడు గారికి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు. హెలీ టూరిజంతో తెలంగాణలో పర్యాటక రంగం మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో సీ-ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ అధికారులు ముఖ్యమంత్రి గారికి తెలిపారు. ✅ఈ సమావేశంలో ఎంపీలు Anil Kumar Yadav గారు, Suresh Kumar Shetkar గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) Harkara Venugopal Rao గారు, Office of Chief Secretary, Telangana Govt. సంజయ్ జాజు గారు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. #Telangana #AirportDevelopment #AirConnectivity #CivilAviation #TelanganaTourism
Telangana CMO40,394 views • 1 month ago

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ విందులో పాల్గొన్నారు. #Bonalu #Telangana
Telangana CMO57,314 views • 2 months ago

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలూ పనులు కొనసాగించాలని ఆదేశించారు. ✅#warangal సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఇతర హాస్పిటల్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తి చేయడంపై ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ✅పనులకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. సీఎంఓ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని, ఇకనుంచి ప్రతిరోజూ ఆసుపత్రి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ గారిని ఆదేశించారు. ✅భవన నిర్మాణం విషయంలో శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని, అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలు అహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అవసరమైన విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ✅#SanathNagarTIMS తరహాలో వరంగల్ ఆసుపత్రిలో కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్‌లో స్టాఫ్ క్వార్టర్స్‌ను నిర్మించాలని, అందుకు సంబంధించి తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే హాస్పిటల్ నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు. ✅ఈ సమావేశంలో ఎంపీ Vem Narender Reddy గారితో పాటు వైద్య ఆరోగ్య, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. #SuperSpecialityHospital #HospitalDevelopment #HealthInfrastructure
Telangana CMO26,630 views • 1 month ago

భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వారి జ్ఞాపకార్థం సముచితమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ✅హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్లో #HMDA ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి స్మారక పార్క్‌ను, ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ✅ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు Sridhar Babu Duddilla గారు, Minister Adluri Laxman kumar గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి గారు, ఆర్థిక మాజీ సలహాదారు Mohan Guruswamy గారు, ఎంపీలు Vem Narender Reddy గారు, Anil Kumar Yadav గారు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే Gandhi Arekapudi గారు, V.NaveenYadav గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ✅ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, దేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అందించిన విశేషమైన సేవలను గుర్తుచేశారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత హక్కు చట్టం, ఆదివాసీ హక్కుల కోసం చట్టం, భూ సేకరణ - పునరావాస చట్టం వంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాలంలో తెచ్చిన విప్లవాత్మకమైన చట్టాల గురించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ✅"దేశం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక సరళీకృత విధానాలు అమలు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి జీవితం, త్యాగనిరతి, జేన్-జీ, అల్ఫా, బీటా తరాలకు దేశభక్తి స్ఫూర్తిని ఇవ్వాలన్న ఉద్దేశంతో వారి విగ్రహాన్ని ఆవిష్కరించాం. దేశం గర్వించదగిన జాతిరత్నాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా ఒక సందేశం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ✅ఆర్థిక సలహాదారుగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా హరించుకుపోయి, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన ముఖచిత్రం నుంచి ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తన అనుభవాలను రంగరించి ఆర్థిక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టారు. ✅పీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్... విధానాలను గొప్ప ఫలితాలనిచ్చాయి. ✅#Hyderabad నగరంలోని మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐఎస్బీ, అమెరికన్ కాన్సులేట్ వంటి దిగ్గజ సంస్థలు, దాదాపు 40 శాతానికి పైగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతున్న సంస్థలున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని, పార్క్‌ను ఏర్పాటు చేయడం సముచితమని భావించాం. ✅#Telangana చరిత్రను రెండు భాగాలుగా చూడొచ్చు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించడం. సమైక్య రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడం. ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ గారి నేతృత్వంలో పోలీస్ యాక్షన్ ద్వారా ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని అందించారు. ఈ విషయంలో ఎప్పుడు చర్చించినా నెహ్రూ, పటేల్ గార్లను ప్రజలు స్మరించుకుంటారు. ✅ఆ తర్వాత దశలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా కృతజ్ఞతలు తెలిపే ఘట్టం. శ్రీమతి సోనియాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గార్ల నేతృత్వంలో 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం. ✅తెలంగాణ ఏర్పాటు చేస్తూ బిల్లుపై డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెట్టిన సంతకాన్ని ఈ పార్క్‌లో నిక్షిప్తం చేశాం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన స్వదస్తూరి సంతకం కనిపించేలా ముద్రించడం జరిగింది. ఆ గొప్పమేధావి మన్మోహన్ సింగ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వ్యక్తిగతంగా తనకు గౌరవం తెచ్చేదిగా భావిస్తున్నా. ✅ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో వ్యక్తిగత పరిచయాలు, వారి ఆలోచనల పట్ల సంపూర్ణ అవగాహన ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి గారిని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడించాం. ✅దేశ శ్రేయస్సు కోసం ఎన్నో చట్టాలను అమలు చేసిన మౌనముని. గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతదేశ ముద్దుబిడ్డ. వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం? దేశం గర్వించదగిన జాతిరత్నాన్ని రాజకీయపరమైన అంశాల నేపథ్యంలో గుర్తించకపోవడం విషాదకరం. కొన్ని సందర్భాలు, అంశాల్లో రాజకీయాల గురించిన ఆలోచన చేయడం ఎంతమాత్రం తగదు. ✅భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి చట్టాలు, శాసనలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి, వారి స్మారకం ఢిల్లీలో ఉండాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న పురస్కారం అందించాలి. ఈ అంశాలపై తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తాలి" అని ముఖ్యమంత్రి గారు కోరారు. #ManmohanSingh #ManmohanSinghMemorial #EconomicReforms #IndianEconomy #ManmohanSinghStatue #ManmohanSingMemorialPark
Telangana CMO21,182 views • 1 month ago

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించిన బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్ - ట్రీసా జాలీలను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గారితో కలిసి వారు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీవీ లక్ష్మి గారు ఉన్నారు. #Badminton #WorldChampionships #GayatriGopichand #TreesaJolly #PullelaGopichand #Telangana
Telangana CMO34,793 views • 2 months ago