
YS Jagan Mohan Reddy
@ysjagan • 2,797,482 subscribers
President, YSR Congress Party
Shorts
Videos

Hey Ram! Save Democracy! Another dark chapter in the history of democracy! Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police. In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter? Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others. Under N Chandrababu Naidu’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate! I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy. #CBNJungleRaj
YS Jagan Mohan Reddy408,931 просмотров • 4 дней назад

Andhra Pradesh today witnessed a brutal attack on democracy under N Chandrababu Naidu's coalition government. On the first day of municipal nominations, YSRCP candidates faced attacks, death threats and attempts to stop them from filing nominations. Vehicles were burnt and nomination papers snatched and torn. Police remained mere spectators, in some cases party to the crime as well, dancing to Naidu's tunes instead of maintaining law and order and upholding the Constitution. I strongly condemn the murder attempt on YSRCP Lok Sabha Floor Leader and Rajampet MP, P. V. Midhun Reddy in Punganur. TDP workers attacked his convoy, which had gone there to file the nominations, with stones, sticks and iron rods, injured his CRPF security staff, damaged vehicles and blocked our candidates from filing nominations while police watched all this in the premises of the nomination filing centre. Even after this, officials did not accept their nomination papers despite making them wait for over three hours. If our Lok Sabha Floor Leader is unsafe, what protection can ordinary people expect? In Rayachoti, our candidates were threatened not to file nominations. When they proceeded despite these threats, TDP workers attacked former MLA Srikanth Reddy's office, set it and vehicles on fire, and injured our workers. Instead of registering cases against those responsible and protecting our candidates, police ordered our workers to leave our party office, where they had gathered to select candidates and prepare nomination papers, while it is our own party office that was set on fire while police remained mute spectators. In Tirupati, a woman candidate's papers were snatched and torn, and our leaders were attacked. In Dharmavaram, candidates were attacked and their papers snatched in police presence. In Kadapa, our 30th Division candidate was obstructed, and papers submitted to the Returning Officer were snatched and torn. Yet no case was registered and no action was taken against them. This shameful inaction gives TDP workers a free hand to obstruct elections in full public view. In Dachepalli, police planted liquor and forcibly detained our Nagar Panchayat chairman candidate to prevent him from filing his nomination. Chandrababu Naidu must understand that government machinery is not his party's property. Violence cannot give the TDP the public confidence it has lost. Every attack strengthens our resolve to stand with the people and defend their democratic rights. I stand firmly with every YSRCP worker. We will not surrender to threats or abandon our democratic fight. Every incident must be investigated, every attacker held accountable, and every officer who enabled this violence made answerable. The SEC must intervene immediately, ensure that all affected candidates can file nominations, and secure the deployment of Central forces. Candidates must be able to contest without fear, and people must be free to choose their representatives. Centralised or transparent and safe online nominations should be made available. Proper CCTV live footage should be put in place in polling stations. CCTV live footage should be placed in all strong rooms to prevent tampering of ballot boxes. CCTV live footage should be in place in all counting stations to ensure proper verification of the signatures on ballot paper account and to monitor the counting process in the counting stations. Central government forces (Paramilitary forces) should be brought in to ensure that free and fair elections are conducted. #SaveDemocracyInAP
YS Jagan Mohan Reddy277,916 просмотров • 20 дней назад

.N Chandrababu Naidu Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old examination-based recruitment model? Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
YS Jagan Mohan Reddy348,897 просмотров • 1 месяц назад
Sensitive content
This media may contain sensitive content.

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండోరోజూ N Chandrababu Naidu గారు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు. వైయస్సార్సీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే, నామినేషన్ కేంద్రాల పరిధిలోనే, కత్తులు, కర్రలతో వెంటాడటం, నామినేషన్ కేంద్రాలను ముట్టడించడం, ఆర్వో కార్యాలయాల్లోకే చొరబడి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేయడం, అర్ధరాత్రి అభ్యర్థులను పోలీసులు ఎత్తుకెళ్లడం.. ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం! ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు. దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన మా పార్టీ ఎంపీలను కూడా వదల్లేదు. వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ద్వారానే దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే. దీని వెనుక ముమ్మాటికీ చంద్రబాబుగారి కుట్రే! నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రపోజెర్స్ పై పోలీసులు దాడి చేసి ఎందుకు కొట్టారు! ఎందుకు కాల్పులు జరిపారు! చంద్రబాబుగారూ, నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాను. సూపర్ 6, సూపర్ 7ల మోసాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్న ఏమి ఆశించగలం! #SaveDemocracyInAP
YS Jagan Mohan Reddy106,047 просмотров • 19 дней назад

పని వైయస్సార్‌సీపీది … ప్రచారం చంద్రబాబుది! ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’-అదే చంద్రబాబు మార్కు రాజకీయం ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్‌పోర్టు కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. తద్వారా దేశవిదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబుగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. N Chandrababu Naidu గారూ… భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా, ఏమీ చేయకపోయినా, ఒక రాయి వేయడం తప్ప, భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్ 2020లో నిర్మాణం కోసం జీఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం నుంచి, ల్యాండ్ అక్విజషన్, ఆర్ అండ్ ఆర్, సైట్ క్లియరెన్స్, ఎన్ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, ఇంటర్నల్ రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబుగారూ? అన్నింటికంటే ముఖ్యంగా మీరు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను మేం పూర్తి చేశాం. నిర్వాసితులైన 4 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాం. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడంకోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు మొత్తంగా రూ.1200 కోట్లు పెట్టింది మేం. మరి మీరు చేసింది ఏమిటి చంద్రబాబుగారూ? ఇవన్నీ పూర్తి చేశాం కాబట్టే, అన్ని అనుమతులు, అన్ని NOCలు, అన్ని సౌకర్యాలు పూర్తిచేశాం కాబట్టే, కోవిడ్ వంటి మహాసంక్షోభాన్ని ఎదుర్కొంటూనే, పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల నాటికే, విమానాశ్రయ రన్‌వే పనులను కీలక దశకు తీసుకురాగలిగాం. టెర్మినల్ నిర్మాణ పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. మా ప్రభుత్వం చేసిన విశేష కృషి నేపథ్యంలోనే 2026 జూన్‌లోనే భోగాపురం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయని అప్పుడే ప్రకటించాం. మేం చేపట్టిన పనుల ఫలితంగానే విమానాశ్రయం ఇవాళ ప్రారంభోత్సవానికి సిద్ధమైందని గర్వంగా చెప్పుకోగలం. కానీ చంద్రబాబుగారూ… మీరు అప్పడూ ఏమీ చేయలేదు, ఇప్పుడు కూడా ఏమీ చేయడంలేదు. విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు సదుపాయం లేదు. ‘‘ఎయిర్‌పోర్టు ఉంది… కానీ సిటీ నుంచి వేగంగా, తక్కువ సమయంలో చేరుకునేందుకు రోడ్డు లేదు. భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేలా 77 మీటర్ల వెడల్పుతో, రూ. 6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులేన్ల హైవేకోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడితీసుకురావడంతో, కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కరీ గారు స్వయంగా ఆ రహదారిని మంజూరు చేస్తున్నట్లు అక్కడే ప్రకటించారు. ఆయన ఇప్పుడు కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబుగారూ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదు. ఇప్పడు భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవాలంటే ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదీ మీ చిత్తశుద్ధి, గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి, దాదాపు 80 ఏళ్లు వస్తున్నాయి. సంబంధిత ఆధారాలు- #CreditChorBabu
YS Jagan Mohan Reddy315,346 просмотров • 3 месяцев назад

𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺! N Chandrababu Naidu Garu, the explanations keep changing, and every new explanation gives rise to even more questions for teacher aspirants. 𝗟𝗲𝘁’𝘀 𝗳𝗼𝗹𝗹𝗼𝘄 𝘁𝗵𝗲 𝘁𝘄𝗶𝘀𝘁𝘀: 𝗧𝘄𝗶𝘀𝘁 𝟭. 𝟲𝟱 𝗠𝗮𝗿𝗸𝘀 → 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻 The post was reportedly awarded with 65 TET marks, after the candidate passed through 7 stages of verification. 𝗧𝘄𝗶𝘀𝘁 𝟮. 𝗧𝗵𝗲 𝗗𝗘𝗢 𝗖𝗼𝗻𝗳𝗶𝗿𝗺𝘀 “𝗜𝗻𝗲𝗹𝗶𝗴𝗶𝗯𝗹𝗲” The DEO confirmed the candidate to be ineligible. So the obvious question is: What actually was verified in those 7 stages? 𝗧𝘄𝗶𝘀𝘁 𝟯. 𝗛𝗲 𝗚𝗼𝘁 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯, 𝗕𝘂𝘁 𝗗𝗶𝗱𝗻’𝘁 𝗞𝗻𝗼𝘄 𝗛𝗼𝘄 The candidate himself reportedly said that he did not know how he got the job. 𝗧𝘄𝗶𝘀𝘁 𝟰. 𝗧𝗵𝗲 𝗦𝘂𝗱𝗱𝗲𝗻 𝟳𝟳-𝗠𝗮𝗿𝗸 𝗧𝘄𝗶𝘀𝘁 Officials confirmed that he had scored 77 marks in a 2018 TET attempt. If those 77 marks were already on record: Why were they not considered earlier? Why did the DEO declare him ineligible? And why did this explanation emerge only after questions were raised? 𝗧𝘄𝗶𝘀𝘁 𝟱. 𝗧𝗵𝗲 “𝗪𝗿𝗼𝗻𝗴 𝗣𝗮𝗽𝗲𝗿” 𝗧𝘄𝗶𝘀𝘁 The reported 77 marks are being cited under Paper-II-B.(School assistant special education) But Paper-I-A is the required TET category for an SGT post. So, how did he pass through 7 stages of verification? 𝗧𝘄𝗶𝘀𝘁 𝟲. 𝗧𝗘𝗧 𝗔𝗴𝗮𝗶𝗻, 𝗔𝗳𝘁𝗲𝗿 𝗚𝗲𝘁𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗝𝗼𝗯 Even after getting the job, the candidate appeared for TET again in 2025. If the 2018 score of 77 marks already made him eligible, then: What was the need to appear for TET again? And now, the biggest questions of all: Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this? #MegaDSCScam
YS Jagan Mohan Reddy158,307 просмотров • 1 месяц назад

𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻! Teacher aspirants’ careers have become a joke for you, N Chandrababu Naidu Garu ? 𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲. 𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho authorities: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲 𝗶𝘀 𝗿𝗲𝗽𝗼𝗿𝘁𝗲𝗱𝗹𝘆 𝗳𝗮𝗸𝗲. 𝗖𝗮𝘀𝗲 𝟯: Check with Nagarjuna University: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝘀𝗽𝗼𝗿𝘁𝘀 𝗲𝘃𝗲𝗻𝘁 𝗮𝗹𝗹𝗲𝗴𝗲𝗱𝗹𝘆 𝗻𝗲𝘃𝗲𝗿 𝗵𝗮𝗽𝗽𝗲𝗻𝗲𝗱. Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this? #MegaDSCScam
YS Jagan Mohan Reddy138,224 просмотров • 1 месяц назад
Sensitive content
This media may contain sensitive content.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా? N Chandrababu Naidu గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు. వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది? చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి. ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
YS Jagan Mohan Reddy88,105 просмотров • 1 месяц назад

అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా? రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. N Chandrababu Naidu గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. English Version-
YS Jagan Mohan Reddy232,463 просмотров • 3 месяцев назад

𝗪𝗵𝗲𝗻 𝗲𝘅𝗮𝗺𝘀 𝗹𝗼𝘀𝗲 𝗰𝗿𝗲𝗱𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝘆, 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝗴𝗲𝘁 𝗰𝗹𝗶𝗽𝗽𝗲𝗱! Lakhs of aspirants sacrifice prime years of their lives and their families’ hard-earned money for a fair chance. When the system fails them, it doesn’t just affect the results, it shatters their faith in the entire recruitment process, resulting in disillusionment. N Chandrababu Naidu Garu, fairness is not an option; it is a duty! Don’t you feel their hard work deserves fairness and future accountability? Will you assume responsibility for the current scam in DSC? #MegaDSCScam
YS Jagan Mohan Reddy104,351 просмотров • 1 месяц назад

.N Chandrababu Naidu గారూ… గిరిజన వర్గానికి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులమీద ఇంతటి క్రౌర్యమా? మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిమీద అనుచిత ప్రవర్తనకు తెగబడతారా? పోలీసు బలంతో వారి గొంతునొక్కేయడానికి ఈ స్థాయికి దిగజారుతారా? ఎక్కడికక్కడ వైయస్సార్సీపీ నాయకులను గృహ నిర్బంధాలకు పాల్పడతారా? వారు చేసిన తప్పేమిటి? విశాఖపట్నం మారికవలస వద్దనున్న గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించవద్దంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచి, వారి తరఫున గొంతెత్తడం, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే వారు చేసిన నేరమా? ప్రభుత్వం, పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. మారిక వలస స్కూల్ తరలింపును వ్యతిరేకిస్తూ ఆగస్టు 20 నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన చేస్తున్నా, వారి అభ్యంతరాలను వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. అసలు ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? వైయస్సార్‌గారి హయాంలోనే ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఎమ్మెల్సీ చుక్కారామయ్యగారి సలహాలు, సూచనలతో దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటీ, ఐఐటీ లాంటి విద్యాసంస్థల్లో ఎస్టీ విద్యార్థులు ప్రవేశం పొందేలా స్కూల్‌ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ నాణ్యమైన బోధన అందించేలా ఏడు గురుకులాలను ఏర్పాటు చేశారు. క్వాలిఫైడ్ టీచర్స్‌ను పెట్టి, ఈ టీచర్లకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి, వారి ద్వారా మంచి శిక్షణ ఇప్పించడం వల్ల గిరిజన విద్యార్థులు ఆ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు పొందారు. మా ప్రభుత్వంలో నాడు-నేడు ద్వారా వీటిని మరింతగా సౌకర్యాలను మరింత అభివృద్ధి చేయడమే కాక, ఆన్లైన్ కోచింగ్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫామ్స్ ద్వారా వారికి అందించే బోధనను మరింత మెరుగుపరిచాం. మంచి ఫలితాలు కూడా సాధించాం. ఎన్ఐటీ, ఐఐటీల్లో సీట్లు పొందే ట్రైబల్ విద్యార్థులకు ప్రోత్సాహకంగా రూ.40వేలు, మరియు వారికి ల్యాప్‌టాప్‌లు ఇచ్చాం. ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా, బాగా నడుస్తున్న స్కూళ్లలో విద్యార్థులను బలవంతంగా తరలించి, ఎందుకు వారిని కష్టపెడుతున్నారు? విశాఖలాంటి నగరంలో గిరిజన విద్యార్థులకు చదువుకునే అర్హతలేదా? నెల్లూరు జిల్లాలోని కోటలో కూడా ఎస్సీ గురుకులం నుంచి వందలమంది విద్యార్థులను కూడా విద్యా సంవత్సరం మధ్యలోనే హడావిడిగా తరలించేశారు. భారీగా విద్యార్థులు ఉన్న మొత్తం 4 గురుకులాల నుంచి దాదాపు 2వేల మందికిపైగా విద్యార్థులను ఇబ్బందిపెడుతూ వారిని చెల్లాచెదురు చేసేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా? చంద్రబాబుగారు మీరు, మీ సుపుత్రుడి తలతిక్క పనులతో విద్యాశాఖను అస్తవ్యస్తం చేస్తున్నారు. మీరు పెడతామంటున్న ఈ కొత్తవాటిలో ఇంటర్మీడియట్నుంచి ప్రత్యేక శిక్షణ అంటున్నారు. కానీ జేఈఈ, నీట్‌లాంటి పోటీ పరీక్షల్లో రాణించాలంటే, ఆ పరీక్షలు రాసే వారికి పునాది కనీసం 8వ తరగతి నుంచే ఉండాలి కదా? అలాంటి కాన్సెప్ట్‌తో పెట్టిన ``స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్``లను నిర్వీర్యంచేయడం కరెక్టు కాదు. ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యంతరాలను విని, ఆ పిల్లలకు నచ్చినచోటే చదువుకోనివ్వండి. గిరిజన మహిళా నాయకులపట్ల మీ అనుచిత ప్రవర్తనకు క్షమాపణలు చెప్పండి.
YS Jagan Mohan Reddy118,849 просмотров • 2 месяцев назад

హే రామ్…! గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లు కనిపిస్తే… రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? N Chandrababu Naidu గారూ… అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, శంఖవరప్పాడు వద్ద జరిగిన దాన్ని ఏదో ఒక్క ఘటనగా కొట్టిపారేయలేం. రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజలకోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, మీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్లు తెచ్చిపెట్టుకోవడానికి, వాడుకున్న ఫలితమే ఈ పతనం. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, మీ కలెక్షన్లకు వాడుకుంటే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో ఈ ఘటన కళ్లకు కడుతోంది. ఈనేపథ్యంలో, ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు, తాగిన మత్తులో ఉన్న డ్రైవర్ ఒక ఆటోను ఢీకొట్టడం, ఆటోలో ఉన్నవాళ్లు తీవ్రంగా గాయపడ్డం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును చుట్టుముట్టడం, ఆ కారులో ఉన్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్న పరిస్థితిలో ఉండడం, ఆ కార్ డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్ యూనిఫాం దొరకడం, చివరకు అక్కడున్న ప్రజలే జర్నలిస్టులుగా మారి, జరిగిన ఘటనను వీడియో తీసి వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే, “వీడియోలు తీయొద్దు, కేసులు పెడతాం” అని అక్కడకు చేరుకున్న మరో సీఐ, బెదిరిస్తున్నారంటే మీ పాలనలో పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా? ఈ ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేటు పార్టీలు నిర్వహించారని, మద్యం, గంజాయి అక్కడ వాడారని, ఆ పార్టీలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఆ ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు కూడా అత్యంత తీవ్రమైనవి. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోంది. అలాంటప్పుడు రాష్ట్రంలో పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబుగారూ… రోజూ గంటలకొద్దీ పైకి నీతి కబుర్లు చెబుతూ, లోపల రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మీద చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలపై, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టండి. ఈ ఘటనను కూడా మీకున్న మీడియా బలంతో కప్పిపుచ్చకండి. డైవర్ట్ చేయకండి. నిష్పక్షపాత విచారణ జరిపించి, తప్పుచేసినవారు ఎంతటివారైనా చర్యలు తీసుకోండి. ఘటనను నిలదీసిన ప్రజలపై మళ్లీ రెడ్‌బుక్ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించండి. English Version-
YS Jagan Mohan Reddy139,225 просмотров • 2 месяцев назад

Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by N Chandrababu Naidu’s government which is seemingly a chaotic, authoritarian regime driven by infamous Red Book governance. Incapable and deceiving people in fulfilling his grand welfare promises, Babu chose to distract the public by unleashing chaos in an attempt to hide his failures. The instance of falsely implicating senior journalist Kommineni Srinivasa Rao garu for remarks he never made and arresting him is not actually law enforcement—it’s pure political vendetta. He merely moderated a debate and how unfair and irrelevant it is to hold him responsible for that! Babu’s government twisted the narrative, weaponized it, and orchestrated violent, state-wide attacks on Sakshi media offices—all under the guise of “protecting women’s dignity.” Nevertheless what kind of dignity are they claiming to protect? These videos clearly reflect their true attitude—disrespect and disconnect from the values they pretend to uphold. As an indicator of Govt’s insensitivity, the state has witnessed 188 rapes and 15 rape-murders in one year. Even recently, an Intermediate tribal student of Anantpur Dist. was found murdered and her body dumped in woods with signs of a brutal attack. In Edgurallapalli, a 9th-grade Dalit girl was gang-raped by 14 TDP-linked men for six months. She became pregnant, and the victim's family has since gone missing amid serious allegations of political pressure and police inaction. Is this the safety they promised? Is this the dignity they protected? Clearly, both their actions and attitude toward women are disgraceful and it is preposterous that they file grudge-bearing charges in the garb of dignity.
YS Jagan Mohan Reddy788,879 просмотров • 1 год назад

.N Chandrababu Naidu గారూ… డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ వేయాలని అడిగితే, ఎందుకంత భయం? ఎందుకంత ఉక్రోషం? పారదర్శకంగా జరిగాయంటూ మీరు, మీ కొడుకు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్, మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? స్కాంలు చేసిన వాళ్లే తమకు తాముగా ఇచ్చుకునే సర్టిఫికెట్లకు విలువ ఏముంటుంది? ఊరికే డైలాగులు కొట్టడం ఎందుకు? దమ్ముంటే సీబీఐ విచారణకు ఒప్పుకోండి. ఇవాళ విజయవాడలో జరిగిన ఘటనలు చూస్తే మీ ప్రభుత్వం ఎంతగా దిగజారిపోయిందో అర్థమవుతోంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి మా పార్టీ నాయకులు శాంతియుతంగా ర్యాలీ చేసేందుకు వెళ్తే వారిని అడ్డుకున్నారు, లాఠీలతో కొట్టించారు, టీచర్ల ముసుగులో మీ రౌడీలతో దాడులు చేయించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ర్యాలీలు చేసే హక్కు కూడా లేదా చంద్రబాబుగారూ? డీఎస్సీలో మీరు స్కామ్‌లు చేశారు కాబట్టే, ఆ అక్రమాలపై ప్రశ్నిస్తూ మిమ్మల్ని, మీ అబ్బాయిని, బట్టలిప్పి కడిగేస్తున్నారు కాబట్టే, సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఇంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ఏదో స్కాం చేసి దొరికినప్పుడల్లా తప్పించుకోవడానికి డైవర్షన్లు చేయడం మీకు అలవాటే. మీ బుద్ధే అంత. మేం అడుగుతున్నది ఏంటి? లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షికంగా సీబీఐ విచారణ జరపమంటున్నాం. ఎలాంటి తప్పూ జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారు? పైపెచ్చు ఇన్ని ఆధారాలు కనబడుతున్నప్పుడు. టీచర్ పోస్టులకోసం లక్షలమంది యువత సంవత్సరాల తరబడి చదువుతారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటప్పుడు వారి కష్టానికి, ప్రతిభకు, న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ప్రభుత్వ నియామక వ్యవస్థపై ఉండాలి. మీరు, మీ కుమారుడు లోకేష్ చేసిన స్కాంల పుణ్యమా అని ఆ విశ్వాసం ఏ నిరుద్యోగికీ, ఏ ఉద్యోగార్థికీ లేకుండా పోయింది. మీ పోలీసుల బారికేడ్లు, మీ లాఠీఛార్జిలు, అరెస్టులు, కౌంటర్‌గా మీరు పెట్టించిన ఫేక్ ధర్నాలు పోయిన ఆ విశ్వాసాన్ని తీసుకు వస్తాయా? కేవలం సీబీఐ చేత జరిగే నిష్పాక్షిక విచారణ మాత్రమే ఆ విశ్వాసాన్ని తిరిగి తీసుకు రాగలదు. పోలీసులను అడ్డుపెట్టుకుని స్కాంను దాచేయలేరు. ప్రతిపక్ష గొంతును అణిచివేసి వాస్తవాలను దాచలేరు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరగాలి, ఉద్యోగాల నియామకాలు పారదర్శకంగా ఉండాలి. దానికోసమే మా పోరాటం. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. సీబీఐ విచారణ జరిపించాలి. అంతవరకూ డీఎస్సీ బాధితుల పక్షాన మా గొంతు నినదిస్తూనే ఉంటుంది. #MegaDSCScam పూర్తి వివరాలు క్రింది డ్రైవ్ లింక్‌లో-
YS Jagan Mohan Reddy78,974 просмотров • 1 месяц назад

.N Chandrababu Naidu గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? రాజధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? రైతుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం. అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా? అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఇవ్వగలరా? చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది. English Version-
YS Jagan Mohan Reddy207,026 просмотров • 4 месяцев назад

🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻 Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance. Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu. Pilgrims who once travelled with devotion and confidence now arrive with anxiety and doubt. A string of painful, preventable failures has shaken faith in the system, yet the response from the TDP government is limited to publicity exercises and after the event routine reviews, with responsibility, accountability and moral answerability nowhere in sight. At Srisailam Temple, the breakdown became painfully clear when Police Lathi Charged Shiva Mala Dharana devotees. For years, Lord Shiva devotees who arrived on padayatra had time across the Shivaratri season to fulfil their vow with dignity. Now the window has been compressed to seven days. Authorities knew lakhs would arrive, yet failed to put in place adequate arrangements. Drinking water, shade, queues and medical help were insufficient. Families waited for hours in punishing conditions. Slogans rose against Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan, but instead of providing relief, Government resorted to using force. Devotees who came to pray were beaten with lathis. ⚠️⚠️Even after earlier tragedies, the TDP government failed to reform. Temple tragedies in Andhra Pradesh in 2025: 📍 Tirumala Venkateswara Temple, Tirupati – 8 January 2025 – 6 devotees died in a stampede while queuing for Vaikunta Ekadasi tokens. This happened for the first time in the history of TTD. 📍 Sri Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam – 30 April 2025 – 7 devotees died when a newly constructed low-in quality wall collapsed during Chandanotsavam. 📍 Venkateswara Swamy Temple, Kasibugga – 1 November 2025 – 9 devotees died in a stampede during Karthika Ekadasi. Many more such incidents have been occurring across the state. Each tragedy rang like a loud alarm demanding urgent correction, yet it was brushed aside without meaningful action ⚠️⚠️ Chandrababu Naidu’s cheap politics now dominate sacred spaces, with the Tirumala laddu dragged into repeated controversies for political mileage, hurting crores of devotees, damaging the reputation of temples, and now this has reached all temples across the state. When N Chandrababu Naidu and Pawan Kalyan speak of Sanatana Dharma yet stay silent on devotees being humiliated and beaten, people ask who will take responsibility. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన చోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు. ⚠️⚠️ రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..: •📍 తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి. •📍 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారు. •📍 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది. ⚠️⚠️ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబుగారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేయడంతో కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
YS Jagan Mohan Reddy328,189 просмотров • 8 месяцев назад

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ Gen-Z ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి Lokesh Nara తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపైన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం N Chandrababu Naidu ప్రభుత్వానిదే. టీచర్ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబుగారి ప్రభుత్వం… డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తా ఉన్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యాశాఖమంత్రి లోకేష్ కానీ ఇప్పటివరకూ వాటిమీద నోరుమెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు. యువత డిమాండ్లను సాధించే క్రమంలో యువత, విద్యార్థుల భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది. #NaraLokeshMustResign
YS Jagan Mohan Reddy124,389 просмотров • 3 месяцев назад
Sensitive content
This media may contain sensitive content.

రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ని చేశారు. ఎండీ చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై, పదిమందికీ వైద్య సేవలందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండాపోవడం అత్యంత విచారకరం. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షంమీద, ప్రశ్నించేవారిమీద, తప్పులు ఎత్తిచూపుతున్నవారిమీద రెడ్‌బుక్ రాజ్యాంగంతో, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఓవైపు చూస్తుంటే... మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసుల విషయంలో చట్టప్రకారం నడుచుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం. ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్‌మాల్ గేటు బయటే జరిగితే, వాళ్లు మద్యం తాగి ఉన్నారని తెలిసినా, వెంటనే సీసీ కెమెరాలు చూసి, నేరం తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సిందిపోయి! దాన్ని సాధారణ యాక్సిడెంట్ కేసుగా చిన్నదిగా చూపించి, నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపేసుకునే కార్యక్రమం చేయడం అత్యంత దారుణం. నిందితులు తమ కారుతో డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి, బాధితురాలి మీద నుంచి కారుతోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్నదానిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి, రాజకీయ వేధింపులకు, కక్షసాధింపులకు చంద్రబాబుగారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు వీధికి రెండు బెల్టుషాపులు, ప్రతి కిలోమీటర్‌కు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏదీ వదలకుండా, ప్రతి వీధి చివర, అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన చంద్రబాబు తీరుకూడా దీనికి మరో కారణం. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్‌ను కూడా చంద్రబాబుగారు, తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారు. పౌరులందరిపట్లా ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థల్లోకి రాజకీయ కక్షసాధింపులు, పక్షపాతం, ‘మీది ఏ పార్టీ?’ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావడం వల్ల, ఆ వ్యవస్థల మూలాలు కదిలిపోయి, కుప్పకూలిపోయే స్థాయికి చేరుకున్నాయని N Chandrababu Naidu గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది.
YS Jagan Mohan Reddy99,588 просмотров • 2 месяцев назад

N Chandrababu Naidu గారూ, మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు, వారికి మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే… దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? #DSC2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్లముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగిపడేశారు. మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి నుంచి పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల వరకు నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. నారా లోకేష్‌ను బాధ్యత నుంచి తప్పించడానికి మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? DSC–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. • నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను బాధ్యత వహిస్తూ రాజీనామాచేయాలి. • ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన పెండింగ్ విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్మెంట్), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. • మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. N Chandrababu Naidu గారూ… మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచివేయలేరు. ఆంధ్రప్రదేశ్ Gen Z గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. English Version-
YS Jagan Mohan Reddy92,947 просмотров • 3 месяцев назад